Viral: తన గేదెపైనే కంప్లయింట్ ఇచ్చిన అమాయకపు రైతు... గేదె చేసిన తప్పు అదే
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల అమాయకత్వానికి ఉదాహరణ ఈ సంఘటన.
మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లాలో నివసిస్తున్నాడు బాబులాల్ జాదవ్. గేదెలు ఇచ్చే పాలే అతని జీవనాధారం. వాటిని అమ్ముకుని వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటాడు. ఓరోజు అతను హఠాత్తుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన గేదె పాలు ఇవ్వడం లేదని కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు నవ్వుకుని, అతడిని అక్కడ్నించి పంపించేశారు. కానీ జాదవ్ వదల్లేదు. ఇంటికెళ్లి తన గేదెతో సహా తిరిగి పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అతడిని చూసి పోలీసులు తలలు పట్టుకున్నారు. గేదె పాలు ఇవ్వకపోతే మమ్మల్నేం చేయమంటావ్ అంటూ అతనికి సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ జాదవ్ మాత్రం అక్కడ్నించి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. కేసు నమోదు చేసుకోమని పట్టుపట్టాడు.
గ్రామస్థులు చెప్పడం వల్లే...
తన గేదె రోజూ ఉదయం, సాయంత్రం పాలు ఇచ్చేదని, కొన్ని రోజులుగా ఇవ్వడం లేదని చెప్పాడు జాదవ్. గ్రామంలో ఎవరో చేతబడి చేయడం వల్లే ఇలా జరిగిందని. గేదెకు మీ సాయం అవసరమని పోలీసులకు చెప్పాడు. గ్రామస్థులే తనకు పోలీస్ స్టేషన్ కు వెళితే న్యాయం జరుగుతుందని చెప్పారని తెలిపాడు. అతని పరిస్థితి అర్థం చేసుకున్న పోలీసులు... గేదెను గ్రామంలో ఉన్న వెటర్నరీ ఆసుపత్రిలో చూపించమని సలహా ఇచ్చారు. అతడు పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నాడు. రెండు రోజుల తరువాత తిరిగి స్టేషన్ వచ్చాడు జాదవ్. ఈసారి కంప్లయింట్ ఇచ్చేందుకు కాదు, థ్యాంక్స్ చెప్పేందుకు. ఆసుపత్రిలో చూపించాక గేదె పాలు ఇవ్వడం మొదలుపెట్టిందట. ఆ విషయం పోలీసులకు చెప్పి ఆనందంగా ఇంటికి వెళ్లిపోయాడు జాదవ్. కొంతమంది గ్రామస్థులు ఎంత అమాయకంగా ఉంటారో ఈ సంఘటనే చెబుతోంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
Also read: ఇతడు గజినీల సంఘానికే లీడర్... ఆరుగంటలకోసారి అంతా మర్చిపోతాడు, చివరికి కొడుకు పుట్టిన సంగతి కూడా...
Also read: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?
Also read: ఈ మహమ్మారి లక్షణాలను ముందే తెలుసుకోండి... రాకుండా జాగ్రత్త పడండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి