News
News
X

Water: భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?

భోజనానికి ముందు, తరువాత, మధ్యలో... ఎప్పుడు నీళ్లని తాగాలి. ఒకవేళ భోజనం తింటున్నప్పుడు అధికంగా తాగితే ఏమవుతుంది?

FOLLOW US: 

చాలా మందికి ఓ నమ్మకం ఉంది. భోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్లను తాగకూడదని. ఆ నమ్మకం ఇప్పటిది కాదు ప్రాచీన కాలం నుంచి వస్తూనే ఉంది. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగే విషయంలో ఆయుర్వదేం ఏం చెబుతుందో తెలుసుకుందాం. 

ఎప్పుడు తాగకూడదు?
మీరు భోజనం తినడానికి సరిగ్గా అరగంట ముందు నుంచి నీళ్లు తాగడం ఆపేయాలి. భోజనం చేస్తూ నాలుగు ముద్దలు తిన్నాక, నీళ్లు తాగడం మళ్లీ తినడం కూడా చేయకూడదు. అలాగే తిన్న అనంతరం కూడా అరగంట పాటూ నీళ్లు పొట్టలోకి చేరకూడదు. మరీ తప్పని పరిస్థితి అయితే కాస్త నీళ్లు నోట్లో వేసుకుని చప్పరించాలి. 

తాగితే ఏమవుతుంది?
ఎక్కువ మందికి  భోజనం చేస్తూ మధ్యమధ్యలో నీళ్లు తాగడం అలవాటు. నీళ్లు తాగుతూ తినడం వల్ల భోజనం త్వరగా చేసేయొచ్చని, దీని వల్ల కొంత సమయం మిగిల్చిన వారమవుతామని అనుకుంటారు కానీ ఆ పిరిస్థితి మీకే నష్టం కలిగిస్తుంది. ఇలా భోజనానికి మధ్యలో నీళ్లను తాగడం వల్ల జీర్ణక్రియకు ఇబ్బంది కలుగుతుంది. ఆహారం సరిగా జీర్ణంకాదు. అజీర్తి వంటి రోగాలు పుట్టుకొస్తాయి. భోజనం చేసేటప్పుడు, తినడం పూర్తయ్యాక... ఆహారాన్ని జీర్ణం చేసే రసాలు ఉత్పత్తి అవుతాయి. మధ్యలో నీళ్లు తాగడం వల్ల ఆ రసాలలో నీళ్లు కలిసిపోయి పలుచబడిపోతాయి. దీనివల్ల సంపూర్ణంగా ఆహారాన్ని జీర్ణం చేయలేవు జీర్ణ రసాలు. అందుకే భోజనానికి ముందు, తరువాత కూడా కాసేపు పొట్టలోకి నీళ్లు చేరకుండా చూసుకోమని ఆయుర్వేదం చెబుతోంది. 

ఇంకా ఎన్నో నష్టాలు
మనం తిన్నా ఆహారం సగం జీర్ణం కాక, శక్తిగా మారకుండా వ్యర్థమైపోతుంది. జీర్ణం కాని ఆహారాల్లో కొంత భాగం కొవ్వుగా మారుతుంది. దీని వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఈ పరిస్థితి డయాబెటిస్ రావడానికి దోహదపడుతుంది. అందుకే భోజనం మధ్యలో నీళ్లు తాగడం, ముందుగా, ఆ తరువాత నీళ్లు తాగడాన్ని తగ్గించాలి. 

భోజనం చేసి అరగంట గడిచాక హ్యాపీగా ఓ గ్లాసుడు నీళ్లు తాగేయండి. లేదా భోజనం చేయడానికి అరగంట ముందు తాగండి. అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read:  తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?

Also read: గోల్డెన్ అవ‌ర్ అనేది ఒకటుంది తెలుసా... ఆ సమయంలో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడినట్టే...

Also read: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 14 Nov 2021 10:14 AM (IST) Tags: Drinking Water Eating Digestive issues వాటర్

సంబంధిత కథనాలు

Breakfast Recipes: మీరు చాలా బిజీయా? అయితే పది నిమిషాల్లో తయారయ్యే దోశెల రెసిపీలు ఇవిగో

Breakfast Recipes: మీరు చాలా బిజీయా? అయితే పది నిమిషాల్లో తయారయ్యే దోశెల రెసిపీలు ఇవిగో

Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

Life Expectancy: ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు, కానీ 1947లో ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Life Expectancy: ఇప్పుడు మన సగటు ఆయుర్ధాయం 70 ఏళ్లు, కానీ 1947లో ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Cucumber: తొక్కే కదా అని తక్కువగా చూడొద్దు, కీర దోస తొక్క ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Cucumber: తొక్కే కదా అని తక్కువగా చూడొద్దు, కీర దోస తొక్క ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

జీవ గడియారం అంటే ఏమిటీ? సమయానికి నిద్రాహారాలు లేకపోతే అంత ప్రమాదమా?

జీవ గడియారం అంటే ఏమిటీ? సమయానికి నిద్రాహారాలు లేకపోతే అంత ప్రమాదమా?

టాప్ స్టోరీస్

CM Jagan: వారికి లేనివి, నాకు ఉన్నవి అవే - వాళ్ల కడుపు మంట కనిపిస్తోంది: సీఎం జగన్

CM Jagan: వారికి లేనివి, నాకు ఉన్నవి అవే - వాళ్ల కడుపు మంట కనిపిస్తోంది: సీఎం జగన్

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

Normon And Foster : ఏపీ ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పించండి - సుప్రీంకోర్టులో నార్మన్ ఫోస్టర్స్ పిటిషన్ !

YS Vijayamma : వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం

YS Vijayamma : వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం

Ysrcp Reactions : ఫేక్ వీడియోపై ఇంకా రాద్దాంతమా ? టీడీపీపై వైఎస్ఆర్‌సీపీ ఆగ్రహం !

Ysrcp Reactions : ఫేక్ వీడియోపై ఇంకా రాద్దాంతమా  ? టీడీపీపై వైఎస్ఆర్‌సీపీ ఆగ్రహం !