News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Cancer Risk: గర్భస్రావం కాకుండా వాడే ఆ మందుతో పుట్టే బిడ్డకు క్యాన్సర్... వెల్లడించిన కొత్త అధ్యయనం

ఎన్నాళ్లు నుంచో గర్భిణులకు గర్భస్రావం కాకుండా అడ్డుకుంటున్న ఓ మందు చాలా ప్రమాదకరమని తేలింది.

FOLLOW US: 
Share:

గర్భస్రావం... ఎక్కవమంది గర్భిణిలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. దాన్ని అడ్డుకునేందుకు చాలా ఏళ్లుగా మనం వాడుతున్న మందుల్లో ఒకటి 17-OHPC.ఇదొక సింథటిక్ ప్రొజెస్టరాన్. దీన్ని 1950నుంచి 60ల మధ్య కాలంలో మహిళలు చాలా విరివిగా వాడారు. ఇప్పుడు కూడా ఇది వాడుకలో ఉంది. కానీ ఇది వాడడం వల్ల పుట్టే బిడ్డకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని తేల్చింది ఓ కొత్త అధ్యయనం. హ్యూస్టన్ లెని యూనివర్సిటీ ఆఫ్  టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ కు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అధ్యయనం తాలూకు ఫలితాలను ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ అబ్సెస్ట్రెట్రిక్స్ అండ్ గైనకాలజీ’ అనే మ్యాగజైన్ లో ప్రచురించారు. ఈ మందును  నెలలు నిండకుండా ప్రసవం కాకుండా అడ్డుకునేందుకు కూడా వినియోగిస్తున్నారు. ఈ ప్రొజెస్టరాన్ గర్భధారణ సమయంలో గర్భాశయం పెరగడానికి సహాయపడుతుంది. అలాగే గర్భస్రావానికి దారితీసే పరిస్థితులను అడ్డుకుంటుంది. 

ఈ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం
గర్భధారణ సమయలో 17-OHPC ఔషధాన్ని తీసుకున్న మహిళలకు పుట్టిన పిల్లలు, ఈ ఔషదాన్ని వాడని స్త్రీలకు పుట్టిన బిడ్డలను పోల్చి చూశారు పరిశోధకులు. డ్రగ్ తీసుకున్న తల్లులకు పుట్టిన పిల్లల్లో  క్యాన్సర్ వచ్చే ప్రమాదం  రెండింతలు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఆ పిల్లల్లో పెద్దయ్యాక కొలొక్టెరాల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ వంటివి అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. 1950 నుంచి 1960ల కాలంలో పుట్టిన వారిపై ఈ పరిశోధనను సాగించారు. ఆ కాలంలోనే కదా ఈ డ్రగ్ ని విపరీతంగా వాడారు.

ఈ పరిశోధన కోసం 1959 నుంచి 1967 మధ్య పుట్టిన 18,751 మందిని పరిశీలించారు. వారిలో 17-OHPC మందును వాడిన తల్లులకు పుట్టిన వారిని, వాడని తల్లులకు పుట్టిన వారిని విడదీశారు. ఈ డ్రగ్ ను వాడిన తల్లులకు పుట్టిన పిల్లల్లో... వారు పెద్దయ్యక దాదాపు 1008 మంది క్యాన్సర్ బారిన పడినట్టు గుర్తించారు. వీరిలో 65 శాతం మంది కేవలం 50 ఏళ్లలోపే క్యాన్సర్ బారిన పడినట్టు తేల్చారు. 

‘గర్భధారణ సమయంలో ఈ ఔషధాన్ని తీసుకోవడం ప్రారంభంలోనే కొన్ని అవయవాల అభివృద్ధికి అంతరాయం కలిగిస్తుంది, దశాబ్ధాల తరువాత క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది’ అని అధ్యయనకర్త మర్ఫీ వివరించారు. అమెరికాలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అక్టోబర్ 2020లోనే ఈ ఔషధాన్ని మార్కెట్ నుంచి ఉపసంహరించాలని ప్రతిపాదించింది. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి

Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?

Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Nov 2021 08:34 AM (IST) Tags: New study క్యాన్సర్ Miscarriage Risk of cancer Drug increases risk

ఇవి కూడా చూడండి

Health Benefits Of Peanuts : పల్లీలు తింటూ బరువు తగ్గిపోవచ్చా? చలికాలంలో తప్పకుండా తినాలా?

Health Benefits Of Peanuts : పల్లీలు తింటూ బరువు తగ్గిపోవచ్చా? చలికాలంలో తప్పకుండా తినాలా?

Magnesium Deficiency: రక్తంలో మెగ్నీషియం లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే - బీ కేర్‌ఫుల్!

Magnesium Deficiency: రక్తంలో మెగ్నీషియం లోపిస్తే కనిపించే లక్షణాలు ఇవే - బీ కేర్‌ఫుల్!

Kidney Problems: ‘క్రియాటినిన్’ అంటే ఏమిటీ? మాంసాహారం తింటే కిడ్నీలు పాడవుతాయా? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

Kidney Problems: ‘క్రియాటినిన్’ అంటే ఏమిటీ? మాంసాహారం తింటే కిడ్నీలు పాడవుతాయా? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

Earplugs Side Effects : ఇయర్‌ఫ్లగ్స్ పెట్టుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు నరకం చూపిస్తాయి

Earplugs Side Effects : ఇయర్‌ఫ్లగ్స్ పెట్టుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు నరకం చూపిస్తాయి

World Aids Day: HIV కి వ్యాక్సిన్‌ ఎందుకు కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్‌లకు ఎదురవుతున్న సవాళ్లేంటి?

World Aids Day: HIV కి వ్యాక్సిన్‌ ఎందుకు కనుక్కోలేకపోయారు? సైంటిస్ట్‌లకు ఎదురవుతున్న సవాళ్లేంటి?

టాప్ స్టోరీస్

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే
×