Corona Cases: క్రమంగా తగ్గుతోన్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10,229 కేసులు
దేశంలో కొత్తగా 10,229 కరోనా కేసులు నమోదుకాగా 125 మంది మృతి చెందారు.

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కొత్తగా 10,229 కరోనా కేసులు నమోదుకాగా 125 మంది మృతి చెందారు. 11,926 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
#Unite2FightCorona#LargestVaccineDrive
— Ministry of Health (@MoHFW_INDIA) November 15, 2021
𝐂𝐎𝐕𝐈𝐃 𝐅𝐋𝐀𝐒𝐇https://t.co/5uTm0IlK3Q pic.twitter.com/IWJLyFYIvn
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.39%గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 98.26%గా ఉంది. 2020 మార్చి నుంచి అదే అత్యధికం.
#𝐂𝐎𝐕𝐈𝐃𝟏𝟗 𝐕𝐚𝐜𝐜𝐢𝐧𝐚𝐭𝐢𝐨𝐧 𝐔𝐏𝐃𝐀𝐓𝐄
— Ministry of Health (@MoHFW_INDIA) November 15, 2021
➡️ More than 124 Cr vaccine doses provided to States/UTs.
➡️ More than 20.20 Cr doses still available with States/UTs to be administered.https://t.co/MfuJCv5Vbg pic.twitter.com/m0SS6Oft6s
మొత్తం కేసులు: 3,44,47,536
యాక్టివ్ కేసులు: 1,34,096 (గత 523 రోజుల్లో ఇదే అత్యల్పం)
మొత్తం మరణాలు: 4,63,655
మొత్తం వ్యాక్సినేషన్: 1,12,34,30,478
కేరళ..
కేరళలో కూడా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కొత్తగా 5,848 కేసులు నమోదయ్యాయి. 65 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 50,61,072కు పెరగగా మరణాల సంఖ్య 35,750కి చేరింది.
మొత్తం 14 జిల్లాల్లో ఎర్నాకులంలో అత్యధికంగా 919 కరోనా కేసులు నమోదుకాగా కోజికోడ్ (715), తిరువనంతపురం (724) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 956 మందికి వైరస్ సోకింది. 18 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 66,24,300కు పెరగగా మరణాల సంఖ్య 1,40,583కు చేరింది.
Also read: తన గేదెపైనే కంప్లయింట్ ఇచ్చిన అమాయకపు రైతు... గేదె చేసిన తప్పు అదే
Also read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

