iPhone 17 Price Drop: ఐఫోన్ 17 ధర భారీగా తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే కొనేందుకు మంచి అవకాశం
iPhone 17 Flipkart Discount: ఐఫోన్ 17 కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ఐఫోన్ 17పై డిస్కౌంట్ ప్రకటించింది. వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.

iPhone 17 Discount Offer: మీరు ఎప్పటినుంచో ఐఫోన్ కొనాలని చూస్తున్నారా.. అయితే ధరలు ఎక్కువ అని, మీ బడ్జెట్ సెట్ కావడం లేదని వదిలేస్తున్నారా. అయితే కొత్త iPhone కొనాలని ఆలోచిస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చింది. సంక్రాంతి పండుగకు ముందే Flipkart తన రిపబ్లిక్ డే 2026 సేల్‌ను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ సేల్ జనవరి 17 నుండి ప్రారంభం కానుంది. ఈ సేల్ ప్రారంభానికి ముందే Apple iPhone 17ని ఇప్పటివరకు తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ఐఫోన్ 17 మీకు రూ. 74,999 ధరకు లభిస్తుంది. ఐఫోన్ ప్రారంభ ధర రూ. 82,900 కంటే ఇది చాలా తక్కువ. సెప్టెంబర్‌లో విడుదలైన ఈ iPhoneపై మొదటిసారిగా భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
Flipkart రిపబ్లిక్ డే సేల్
Flipkart రిపబ్లిక్ డే సేల్ జనవరి 17, 2026 నుండి ప్రారంభం కానుంది. దీని కోసం ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రత్యేక మైక్రోసైట్‌ను కూడా లైవ్ చేసింది, ఇక్కడ రాబోయే ఆఫర్‌లను చూడవచ్చు. ప్రతి సంవత్సరం లాగే, ఈసారి కూడా ప్లస్, బ్లాక్ సభ్యులకు సేల్‌లో ముందుగా షాపింగ్ చేసే అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం, ఈ సేల్ ఎన్ని రోజులు కొనసాగుతుందో Flipkart చెప్పలేదు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, బ్యాంక్ డీల్స్ ఉన్నాయి.
అందరినీ ఆశ్చర్యపరిచిన iPhone 17 ధర
Flipkart సమాచారం ప్రకారం, రిపబ్లిక్ డే సేల్ లో iPhone 17 రూ. 74,999కి లిస్ట్ చేశారు. ఫోన్ లాంచింగ్ ధర ధర కంటే దాదాపు రూ. 8,000 తక్కువ. ఈ ధరకు బ్యాంక్ ఆఫర్‌లు ఇవ్వనుంది. అయితే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం వరకు అదనపు తగ్గింపు లభిస్తుందని తెలుస్తోంది. ఈ ఆఫర్ వర్తిస్తే, iPhone 17 ధర ఇంకా తగ్గుతుంది.
iPhone 17 ఫీచర్లు, అద్భుతమైన పనితీరు
iPhone 17లో యాపిల్ కంపెనీ 120Hz ProMotion డిస్‌ప్లేను అందించింది. ఐఫోన్ 17లో సరికొత్త A19 చిప్‌సెట్ ఉంది. ఇది గేమింగ్ నుంచి మల్టీ టాస్కింగ్ వరకు ప్రతి పనిని ఏ అంతరాయం లేకుండా చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 18MP సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. వెనుకవైపు 48MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి.
బ్యాటరీ, ఛార్జింగ్, కొత్త iOS అనుభవం
బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా iPhone 17ని పెద్ద అప్‌గ్రేడ్‌గా భావిస్తారు. ఇది 40W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది ఐఫోన్‌ను మునుపటి కంటే వేగంగా ఛార్జ్ చేస్తుంది. ఈ ఫీచర్ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులకు ప్రత్యేకంగా ఉంటుంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే iPhone 17 సరికొత్త iOS 26లో నడుస్తుంది. ఇందులో కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్ ఉంటుంది. ఈ కొత్త ఇంటర్‌ఫేస్ ఫోన్‌కు మరింత ప్రీమియం లుక్ ఇవ్వడంతో పాటు యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది.
OnePlus 15R 5Gపై డిస్కౌంట్
ఈ-కామర్స్ సైట్ Amazonలో వన్‌ప్లస్ 15ఆర్ (OnePlus 15R)పై ఆఫర్ ప్రకటించారు. ఈ ఫోన్ 12+256GB వేరియంట్‌పై డిస్కౌంట్ లభిస్తుంది. వాస్తవానికి, ఈ వేరియంట్ ధర రూ. 54,999, అయితే ఇక్కడ రూ. 47,998కి లిస్ట్ చేశారు. నేరుగా 7 వేల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌పై రూ. 43,000 ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.






















