Gujarat Drugs Seized: భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. వీటి విలువ రూ. 600 కోట్ల పైమాటే!
గుజరాత్‌లో 120 కిలోల డ్రగ్స్‌ను ఉగ్రవాద నిరోధక దళం స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ. 600 కోట్లు.
గుజరాత్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు అయింది. భారీ ఎత్తున మత్తు పదార్థాలను ఆ రాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పట్టుకుంది. ద్వారకాలోని మోర్బిలో 120 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందన్నారు.
రాష్ట్ర పోలీసులు, ఏటీఎస్‌పై గుజరాత్ హోంమంత్రి హర్ష సంఘవి ప్రశంసలు కురిపించారు.
Another achievement of Gujarat Police.
— Harsh Sanghavi (@sanghaviharsh) November 15, 2021
Gujarat Police is leading from the front to eliminate the drugs.
Gujarat ATS has snabbed around 120 kilo drugs.@dgpgujarat will address the press conference on the subject at 11 AM today. @GujaratPolice @himanshu_rewa
నవ్లఖి నౌకాశ్రయానికి దగ్గరలోని జిన్జుడా గ్రామంలో మత్తుపదార్థాల ముఠా ఉందనే ముందస్తు సమాచారంతో ఆదివారం రాత్రి ఏటీఎస్ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో 120 కేజీల మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.
మత్తు పదార్థాల ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్‌లో ముంద్రా పోర్టు నుంచి సుమారు రూ.21 వేల కోట్ల విలువైన 3 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Delhi Air Pollution: లాక్‌డౌన్ బాటలో దేశ రాజధాని.. కరోనా కోసం కాదు అంతకుమించి!
Also Read: Corona Cases: క్రమంగా తగ్గుతోన్న కరోనా ఉద్ధృతి.. కొత్తగా 10,229 కేసులు
Also read: తన గేదెపైనే కంప్లయింట్ ఇచ్చిన అమాయకపు రైతు... గేదె చేసిన తప్పు అదే
Also read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి