X

Internship: ఇంట‌ర్న్‌షిప్‌తో ఉద్యోగావకాశాలెక్కువ.. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రముఖ కంపెనీల్లో చేసేయండి 

ఇప్పుడు చాలా కంపెనీలు.. ఫ్రెషర్స్ కంటే.. ఇంటర్న్ షిప్ చేసిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇంటర్న్ షిప్ చేస్తే ఉపాధి అవకాశాలు ఎక్కువ.

FOLLOW US: 

ఒకప్పుడు ఫ్రెషర్స్ ను తీసుకుంటే వారికి పని నేర్పించి.. ఉద్యోగంలో పెట్టుకునేవి చాలా కంపెనీలు. అయితే రానురాను పరిస్థితులు మారుతున్నాయి. ఫ్రెషర్స్ ను తీసుకోవడం కంటే.. ఇంటర్న్ షిప్ చేసిన వారికే కంపెనీలు ప్రిపరెన్స్ ఇస్తున్నాయి. ఇంటర్న్ షిప్ చేస్తే.. వారికి ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పనిపై కొంచెం అనుభవం ఉన్న వారైతే.. తమ కంపెనీకి కూడా ఉపయోగపడతారని అనుకుంటున్నాయి. చాలా కంపెనీలు కూడా ఇంటర్న్ షిప్ ను అందిస్తున్నాయి. ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు మంచి అవకాశం కల్పిస్తోంది. ఆర్ బీఐలో విద్యార్థులకు, గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ కు సమ్మర్ ఇంటర్న్ షిప్ ప్రోగ్రామ్ కు అవకాశం కల్పిస్తుంది. ఇంటర్న్ షిప్ ను ఏప్రిల్ 2022 నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఈ ఇంటర్న్ షిప్ కోసం ఫైనాన్స్, ఎకనామిక్స్, లా, బ్యాంకింగ్ కు సంబంధించి.. చదువుతున్నవారు.. దీనికి అర్హులు. ఇంట‌ర్న్‌షిప్ ప్రొగ్రామ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు డిసెంబ‌ర్ 31, 2021 వ‌ర‌కు ఛాన్స్ ఉంది. అయితే మెుత్తం 125 మంది ఇంటర్న్‌లను ఎంపిక చేస్తారు. వారికి నెలకు రూ.20,000 స్టైఫండ్ ఇస్తారు.

ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ ఓ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్​ను ప్రారంభించింది. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ ఫెసిలిటీ (ISTF)లో ఇంటర్న్​ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హత ఉన్నవారు.. డిసెంబర్ 5లోపు ఐఐటీ గాంధీనగర్​ వెబ్‌సైట్ www.iitgn.ac.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, నెట్‌వర్క్ అండ్​ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ మొదలైన మాడ్యూల్స్​పై అవగాహన ఉంటుంది. ఎంపికైన వారిని మెుదట  ఆరు నెలల.. వారి పనితీరు ఆధారంగా మరో ఆరు నెలల పాటు పొడిగించే ఛాన్స్ ఉంది. 

డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఐటీ దిగ్గజం.. మైక్రోసాఫ్ట్ ఇంటర్‌షిప్ ప్రకటించింది. వర్చువల్ ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఇస్తోంది.  డిగ్రీ పూర్తి చేసినవారంతా ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ , ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్-ఏ నాస్‌కామ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ స్కిల్ ఇనషియేటీవ్, ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ , గిట్‌హబ్, క్వెస్ కార్ప్ లాంటి సంస్థలతో కలిపి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. 

Also Read: ISRO Online Course: ఇస్రో ఉచిత ఆన్‌లైన్ కోర్సు.. 12 రోజుల్లో మీ చేతిలో సర్టిఫికేట్ .. ఏం నేర్పిస్తారంటే.. 

Also Read: Resume: జాబ్ ట్రయల్స్ వేస్తున్నారా? రెజ్యూమ్ ఇలా సింపుల్ గా ఉంటే చాలు కదా బ్రో!

Also Read: స్నేహితుడికి ఉద్యోగమెుచ్చింది.. నాకెందుకు రాలేదనే పోలిక కాదు.. ఎక్కడ వెనకపడ్డారో చూసుకోండి

Tags: Education microsoft Online courses internship job opportunities Internship In RBI IIT Gandhi Nagar

సంబంధిత కథనాలు

Fact Check CBSE :  సీబీఎస్‌ఈ ఫలితాలపై ఆ పోస్ట్ ఫేక్ .. ఇదిగో నిజం !

Fact Check CBSE : సీబీఎస్‌ఈ ఫలితాలపై ఆ పోస్ట్ ఫేక్ .. ఇదిగో నిజం !

TS Schools: ఈ నెల 31 నుంచి విద్యాసంస్థలు తెరిచే అవకాశం... ప్రత్యక్ష తరగతుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు...!

TS Schools: ఈ నెల 31 నుంచి విద్యాసంస్థలు తెరిచే అవకాశం... ప్రత్యక్ష తరగతుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు...!

PG Medical Web Options: నేటి నుంచి పీజీ మెడికల్ వెబ్ ఆఫ్షన్లు... కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్

PG Medical Web Options: నేటి నుంచి పీజీ మెడికల్ వెబ్ ఆఫ్షన్లు... కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

Vizag IIPE: పెట్రోలియం వర్సిటీకి సొంత క్యాంపస్, 157.36 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

మొబైల్‌, యాప్స్‌ అప్‌డేట్‌ చేస్తున్నారు సరే... మరి మీరు అప్‌డేట్‌ అవ్వరా?... అలా కాకుంటే ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా?

టాప్ స్టోరీస్

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Samantha: సమంత సినిమాలో విలన్ ఎవరో తెలిసిపోయింది!

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Student Suicide: ఇంజినీరింగ్ మ్యాథ్స్‌ పరీక్ష లెక్క తప్పింది.. నిండు ప్రాణం పోయింది

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Naga Chaitanya Web Series Title: అక్కినేని నాగచైతన్య వెబ్ సిరీస్.. ఆసక్తి కలిగిస్తున్న టైటిల్

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల

Tirumala Sarva Darshan Tickets: నిన్న ప్రత్యేక దర్శనం టికెట్లు మిస్సయ్యారా.. నేడు సర్వ దర్శనం టికెట్లు విడుదల