(Source: ECI/ABP News/ABP Majha)
Basra RGUKT Selection List: బాసర ఆర్జీయూకేటీ తొలి ఎంపిక జాబితా విడుదల, 1404 మంది విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన
Basara IIIT Admissions: బాసర ఆర్జీయూకేటీలో బీటెక్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా జులై 3న విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపికజాబితాను అందుబాటులో ఉంచారు.
BASARA RGUKT Selection List: బాసర ఆర్జీయూకేటీలో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి ఎంపికైన విద్యార్థుల తొలి జాబితా జులై 3న విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఎంపికైన విద్యార్థుల జాబితాను అందుబాటులో ఉంచారు. తొలిదశలో మొత్తం 1404 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. తొలి జాబితాలో ఎంపికైన విద్యార్థులకు జులై 8 - 10 వరకు ధ్రువపత్రాల పరిశీలన (ఫేజ్-1 కౌన్సెలింగ్) నిర్వహించనున్నారు. ఇక స్పెషల్ కేటగిరీ ధ్రవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల జాబితా ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటా విద్యార్థులకు జులై 4న ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఇక ఎన్‌సీసీ, క్యాప్ విభాగాలకు చెందినవారికి జులై 5న సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు అవసరమైన అన్ని ధ్రువీకరణపత్రాలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
Webnote: Verification of Certificates for CAP Category
Webnote: Verification of Certificates for NCC Category
Webnote: Verification of Certificates for PH Category
Webnote: Verification of Certificates for Sports Category
ఫీజు వివరాలు ఇలా..
కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద జనరల్, బీసీ విద్యార్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500 చెల్లించాలి. కాషన్ డిపాజిట్ కింద ప్రతి విద్యార్థి రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని విద్యార్థి ట్రిపుల్ ఐటీనుంచి బయటకు వెళ్లిపోయేటప్పుడు తిరిగి చెల్లిస్తారు. బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు పొందినవారు ప్రతి ఏడాది రూ.30 వేలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమే బోధన రుసుములు చెల్లిస్తుంది. ఇక ఎన్నారై విద్యార్థులు ఏటా రూ.3 లక్షలు, ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఏటా రూ.1.36 లక్షలను బోధన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గ్లోబల్ కోటాలో ఏటా రూ.1.36 లక్షలు చెల్లించి స్థానికులు ఎవరైనా సీటు పొందే వెసులుబాటు ఉంటుంది.
కోర్సు వివరాలు ఇలా..
బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరాల్సి ఉంటుంది. కోర్సులో మొదటి రెండేళ్లపాటు ఇంటర్ తత్సమాన కోర్సు పీయూసీ ఉంటుంది. రెండేళ్ల పీయూసీ విద్య అభ్యసించిన అనంతరం ఎవరికైనా మెరుగైన విద్యావకాశాలు వస్తే ఆర్జీయూకేటీ నుంచి బయటకు వెళ్లిపోవచ్చు. కొనసాగాలనుకునేవారు నాలుగేళ్ల బీటెక్ కోర్సు సెమిస్టర్ విధానంలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆర్జీయూకేటీ బీటెక్‌లో సివిల్, కెమికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులను అందిస్తోంది. పీయూసీ అనంతరం విద్యార్థి తన గ్రూపును ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు పీయూసీలో సాధించిన మార్కులు ఆధారంగా తీసుకుంటారు.
సీట్ల సంఖ్య..
బాసర ట్రిపుల్ ఐటీలో మొత్తం 1650 ఇంటిగ్రెటెడ్ బీటెక్(ఇంటర్+బీటెక్) సీట్లు అందుబాటులో ఉన్నాయి. యూనివర్శిటీలో 1500 సీట్లు ఉండగా.. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటా కింద, మరో 150 అదనంగా భర్తీ చేస్తారు. మొత్తం సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లకు రాష్ట్రంతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీపడతారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5 శాతం సీట్లు సూపర్ న్యూమరీ కింద కేటాయిస్తారు.
ఎంపిక విధానం..
బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారైతే పదోతరగతిలో వారు సాధించిన గ్రేడ్‌కు 0.40 స్కోర్ కలుపుతారు. ఒకవేళ ఇద్దరు విద్యార్థుల స్కోర్ సమానంగా ఉంటే.. ఏడు కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు. మొదట గణితంలో, తర్వాత సైన్స్, ఆంగ్లం, సాంఘికశాస్త్రం, ప్రథమ భాషలో గ్రేడ్‌ను పరిశీలించి సీట్లు ఇస్తారు. అవీ సమానంగా ఉంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసు ఉన్న వారికి సీటు కేటాయిస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్‌టికెట్ ర్యాండమ్ నంబరు విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
కౌన్సెలింగ్‌కు ఈ డాక్యుమెంట్లు అవసరం..
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. రెండు సెట్ల జిరాక్స్ కాపీలతోపాటు, ఒరిజినల్ సర్టిఫికేట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
➥ పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్
➥ పదోతరగతి మార్కుల జాబితా (గ్రేడ్-షీట్)
➥ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ/బోనఫైడ్ సర్టిఫికేట్లు.
➥ రెసిడెన్స్ సర్టిఫికేట్
➥ క్యాస్ట్/కమ్యూనిటీ/ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్.
➥ ఇన్‌కమ్ సర్టిఫికేట్
➥ విద్యార్థి ఫోటోలు-6, రెండు తల్లిదండ్రుల ఫోటోలతోపాటు, ఇద్దరు గార్డియన్‌ల ఫోటోలు ఉండాలి.
➥ ఫ్యామిలీ రేషన్ కార్డు కాపీ.
➥ ఆధార్ కార్డు.
➥ చదువు కోసం బ్యాంకు రుణం కోరేవారు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు క్యాంపస్‌లో బ్యాంకులో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుతోపాటు కింది డాక్యుమెంట్లు అవసరమవుతాయి.
➥ 4 సెట్ల సర్టిఫికేటల్ కాపీలు
➥ తల్లిదండ్రులు ఉద్యోగులైతే ఎంప్లాయి ఐడీ కార్డు కాపీ.
➥ గడచిన 3 నెలల శాలరీ సర్టిఫికేట్లు (పే స్లిప్స్)
➥ విద్యార్థి, తల్లిదండ్రుల పాన్‌కార్డు
➥ రేషన్ కార్డు/పాన్‌కార్డు/ఓటరు ఐడీకార్డు/ఆధార్ కార్డు (విద్యార్థి, తల్లిదండ్రుల)
➥ చివరి 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్.
➥ విద్యార్థి ఫోటోలు-6, రెండు తల్లిదండ్రుల ఫోటోలు నాలుగు అవసరమవుతాయి.