UGC Initiative: స్వదేశం నుంచే 'విదేశీ విద్య'- కార్యాచరణ సిద్ధం చేసిన యూజీసీ!
భారత్‌కు చెందిన విద్యా సంస్థలతో కలిసి పనిచేసేందుకు 49 విదేశీ విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చాయి. త్వరలో ఆయా యూనివర్సిటీలు టై-అప్ కానున్నాయని యూజీసీ హెచ్ ఎం జగదీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
విదేశాల్లో విద్యాభ్యాసం కోరుకునే విద్యార్థులకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గుడ్ న్యూస్ తెలిపింది. భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదవడం ఆనవాయితీ.. అయితే ఇప్పుడు విదేశీ విద్యనే భారతీయ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది యూజీసీ. ఈ మేరకు భారత్‌కు చెందిన విద్యా సంస్థలతో కలిసి పనిచేసేందుకు 49 విదేశీ విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చాయి. త్వరలో ఆయా యూనివర్సిటీలు టై-అప్ కానున్నాయని యూజీసీ హెచ్ ఎం జగదీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
భారత్‌లోని విద్యాసంస్థలతో కలిసి పని చేసేందుకు మిచిగాన్ యూనివర్సిటీ, సిడ్నీ యూనివర్సిటీ, మెల్‌బోర్న్ వర్శిటీ, బర్మింగ్‌హమ్ యూనివర్సిటీ, లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ, ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్శిటీ ఆఫ్ మలయా, ఇజ్రాయెల్‌కు చెందిన హఫియా యూనివర్సిటీతోపాటు ఇతర 49 యూనివర్సిటీలు ఉన్నాయని యూజీసీ ఛైర్మన్ వెల్లడించారు. ఇందుకోసం ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న 230 భారతీయ, 1256 విదేశీ ఉన్నత విద్యా సంస్థలను యూజీసీ గుర్తించినట్లు ఆయన చెప్పారు.
యూజీసీ సిద్ధం చేసిన ఈ కార్యచరణ ఆచరణలోకి వస్తే.. భారత్‌లో ఉంటూనే ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్శిటీల్లో చదువుకునే అవకాశం ఉంటుంది భారతీయ విద్యార్థులకు ఉండనుంది. ఇది విద్యార్థుల కెరీర్‌ను అభివృద్ధి చేసుకునేందుకు లాభపడటమే కాకుండా తక్కువ ఖర్చుతో విదేశీ డిగ్రీని పొందే వీలుంటుంది. విదేశీ విశ్వవిద్యాలయాల టై ఆప్ కింద మూడు రకాల డిగ్రీల ప్రోగ్రాంకు యూజీసీ ఆమోదం తెలిపింది. ఇందులో డ్యూయల్, జాయింట్, ట్విన్నింగ్ డిగ్రీలు ఉన్నాయి. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం కింద రెండు కాలేజీలు ఒకే సబ్జెక్టులో డిగ్రీ ఇస్తాయి. జాయింట్ డిగ్రీ ప్రోగ్రాంలో రెండు ఇన్‌స్టిట్యూట్‌లు ఒకేసారి రెండు వేర్వేరు సబ్జెక్టుల్లో డిగ్రీలను ప్రదానం చేస్తాయి. ఇక చివరి ప్రోగ్రాం ట్విన్నింగ్‌లో ఎక్కువ భాగం విదేశాల్లో విద్యాభ్యాసం ఉంటుంది. విదేశీ యూనివర్శీటీలే డిగ్రీలను అవార్డ్ చేస్తాయి.
ఈ విద్యాపరమైన సహకారాన్ని సులభతరం చేయడానికి 63 దేశాల్లోని భారతీయ రాయబారుల మద్దతు ఉందని, వీరి ద్వారానే ఇది సాధ్యమైందని జగదీశ్ కుమార్ చెప్పారు. “భారత రాయబారులు యూజీసీ నిబంధనలను సంబంధిత దేశాల విశ్వవిద్యాలయాలకు తెలియజేసారు. యుఎస్, యుకె, ఆస్ట్రేలియా, జర్మనీ, మలేషియా మరియు సింగపూర్ వంటి దేశాల నుండి మాకు సానుకూల స్పందన వచ్చింది'' అని ఆయన అన్నారు.
Also Read:
నేషనల్ మెడికల్ కమిషన్ కఠిన నిబంధనలు, చైనా దృష్టికి తీసుకెళ్లిన భారత్!
చైనాలో వైద్య విద్యను అభ్యసించి స్వదేశానికి వచ్చి ప్రాక్టీస్ చేసుకునేందుకు పొందే అనుమతుల విషయంలో జాతీయ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) తాజాగా జారీ చేసిన కఠిన నిబంధనల వివరాలను భారత్ తెలియజేసింది. భారత్‌లో ప్రాక్టీస్ ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన అనుమతి విషయాన్నీ అక్కడి అధికారులతో పంచుకుంది. ఈ కొత్త నిబంధనలన్నీ పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ చైనాకు విజ్ఞప్తి చేసింది.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..