NMC Regulations: నేషనల్ మెడికల్ కమిషన్ కఠిన నిబంధనలు, చైనా దృష్టికి తీసుకెళ్లిన భారత్!
నాలో మెడిసిన్ చదవాలనుకుంటున్న వారి కోసం బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ గత సెప్టెంబర్‌లో సవివరమైన సూచనలు జారీ చేసింది. చైనాలో తక్కువ పాస్ పర్సెంటేజీతో ఉత్తీర్ణులవడం వంటి సమస్యలను ప్రస్తావించింది.
చైనాలో వైద్య విద్యను అభ్యసించి స్వదేశానికి వచ్చి ప్రాక్టీస్ చేసుకునేందుకు పొందే అనుమతుల విషయంలో జాతీయ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) తాజాగా జారీ చేసిన కఠిన నిబంధనల వివరాలను భారత్ తెలియజేసింది. భారత్‌లో ప్రాక్టీస్ ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన అనుమతి విషయాన్నీ అక్కడి అధికారులతో పంచుకుంది. ఈ కొత్త నిబంధనలన్నీ పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ చైనాకు విజ్ఞప్తి చేసింది.
నేషనల్ మెడికల్ కమిషన్ ఇటీవల ఈ నిబంధనలను రూపొందించిన విషయం తెలిసిందే. ఇక చైనాలో మెడిసిన్ చదవాలనుకుంటున్న వారి కోసం చైనా రాజధాని బీజింగ్‌లోని ఇండియన్ ఎంబసీ గత సెప్టెంబర్‌లో సవివరమైన సూచనలు జారీ చేసింది. చైనాలో తక్కువ పాస్ పర్సెంటేజీతో ఉత్తీర్ణులవడం వంటి సమస్యలను ప్రస్తావించింది. చైనా చదువు తరువాత భారత్‌లో ప్రాక్టీస్ చేసేందుకు కఠిన నిబంధనలు ఉంటాయన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. 2021 నవంబరు తరవాత చైనాలో వైద్య కోర్సుల్లో చేరిన విద్యార్థులు వైద్యులుగా ఆ దేశంలో ప్రాక్టీస్ చేసేందుకు లైసెన్స్ పొందకపోతే భారత్‌లో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ పరీక్ష రాసేందుకు అనర్హులని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.
అధికారిక అంచనాల ప్రకారం.. చైనాలో ప్రస్తుతం 23 వేల పైచిలుకు భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో అధిక శాతం వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. కరోనా సంక్షోభం కారణంగా రెండేళ్ల పాటు వీసా ఆంక్షలు విధించిన చైనా.. ఇటీవలే సడలింపులకు తెరతీసింది. భారతీయులకు కొత్త వీసాలు జారీ చేయడం ప్రారంభించింది. ఇప్పటికే..350 మంది చైనాలో మళ్లీ చదువులు ప్రారంభించేందుకు వెళ్లారని సమాచారం. ఇదిలా ఉంటే.. చైనా యూనివర్శిటీలు కొత్త సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో దేశంలో అమలవుతున్న కఠిన నిబంధనల గురించి భారత్ చైనా దృష్టికి తీసుకెళ్లింది. భారతీయ విద్యార్థులకు అన్ని అంశాల్లో నిబంధనలకు అనుగూణంగా శిక్షణ ఇవ్వాలని సూచించింది.
Also Read:
క్రాఫ్ట్స్ & డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు, ఐఐసీడీ నోటిఫికేషన్ జారీ!!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) 2023 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బీ.డిజైన్, ఎం.డిజైన్, ఎం.వొకేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ అర్హత ఉండాలి. పీజీ కోర్సులకు సంబంధి విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్ధులు జనవరి 21లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐఎన్ఐ సెట్ - 2023 అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్ఐ-సెట్)- జనవరి 2023 సెషన్' అడ్మిట్ కార్డులను 'ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-ఎయిమ్స్' నవంబరు 7న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి...