Suicides: షాకింగ్ రిపోర్ట్, భారత్‌లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు - ఆ రాష్ట్రాల్లో మరీ దారుణం
Student Suicides: భారత్‌లో విద్యార్థుల ఆత్మహత్యలు జనాభా కన్నా వేగంగా పెరుగుతున్నాయని NCRB రిపోర్ట్ వెల్లడించింది. ఈ సమస్య మహమ్మారిలా పట్టి పీడిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
Student Suicides in India: భారత్‌లో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఏడాది లెక్కల వారీగా చూస్తే జనాభా కన్నా వేగంగా ఆత్మహత్యలే పెరుగుతున్నాయని NCRB రిపోర్ట్ వెల్లడించింది. విద్యార్థుల ఆత్మహత్యల సమస్య దేశాన్ని ఓ మహమ్మారిలా పట్టి పీడిస్తోందని అసహనం వ్యక్తం చేసింది. ఇటీవలే ఈ నివేదికను విడుదల చేసింది. ఏటా ఆత్మహత్యలు 2% మేర పెరుగుతున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం ఏటా 4% మేర పెరుగుతున్నట్టు వెల్లడించింది. 20 ఏళ్లలో ఈ ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలిపింది.
"గత రెండు దశాబ్దాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. 4% మేర పెరుగుదల కనిపిస్తోంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ. 2022 లో 53% మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్లంతా అబ్బాయిలే. అయితే...2021-22 మధ్య కాలంలో ఈ సూసైడ్స్ సంఖ్య 6% తగ్గింది. అటు మహిళా విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం 7% మేర పెరిగింది. ఏటా జనాభా రేటు కన్నా వేగంగా ఈ ఆత్మహత్యలే పెరుగుతున్నాయి. గత పదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 6,654 నుంచి 13,044 కి పెరిగింది"
- NCRB రిపోర్ట్
ఆ రాష్ట్రాల్లోనే ఎక్కువ..
మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశం మొత్తం నమోదవుతున్న వాటిలో ఇవే మూడోవంతు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 29% మేర ఆత్మహత్యలు నమోదవుతున్నట్టు ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఈ జాబితాలో రాజస్థాన్ పదో స్థానంలో ఉంది. అక్కడి కోటా ప్రాంతంలో ఈ మధ్య కాలంలో సూసైడ్స్ పెరుగుతున్నాయి. FIRల ఆధారంగా ఈ లెక్కలు తేల్చింది NCRB. అయితే...ఇంకా FIR నమోదు కాని కేసులు ఎన్నో ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా కేసుల లెక్కలు తేల్చడంలో నిర్లక్ష్యం జరుగుతోందన్న వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. దీన్నో జాతీయసమస్యగా తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంస్థలూ ఈ ఆత్మహత్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఈ నివేది సూచించింది. (Also Read: Gujarat Rains: గుజరాత్‌ని ముంచెత్తుతున్న వరదలు, మూడు రోజుల్లోనే విలయం - 28 మంది మృతి)
"విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరముంది. ఇదంతా విద్యా సంస్థల్లోనే జరగాలి. వాళ్ల కెరీర్ గురించి ముందుగానే అవగాహన కల్పించాలి. వాళ్ల సిలబస్‌లోనే ఇందుకు సంబంధించిన అంశాలు జోడించాలి. ఈ తరహా ఇనిషియేషన్ తీసుకుంటేనే పరిస్థితుల్లో మార్పు వస్తుంది"
- నిపుణులు
పురుషులు, మహిళలను పోల్చి చూస్తే మహిళల్లో సూసైడ్ రేట్ ఎక్కువగా ఉంటోంది. 61% మంది మహిళా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు తేలింది. అయితే..మొత్తంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే అటు మహిళలతో పాటు పురుషుల్లోనూ 5% మేర సూసైడ్ రేటు పెరిగింది. ఇవి తగ్గుముఖం పట్టాలంటే కౌన్సిలింగ్ ఒక్కటే సరైన మార్గం అని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది.
Also Read: Crime News: రాత్రి గాఢ నిద్రలో, తెల్లవారి లేచే సరికి దారుణ హత్య - మహిళ మర్డర్ మిస్టరీ