Mysuru: కర్ణాటకలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
ఓ విద్యార్థినిపై దోపిడీ దొంగలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటక మైసూర్ లో జరిగింది. వేగంగా దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకోవాలని సీఎం బసవరాజ్ బొమ్మై ఆదేశించారు.
కర్ణాటక మైసూర్ లో దారుణ ఘటన జరిగింది. ఓ విద్యార్థినిపై కొంతమంది సామాహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం బసవరాజ్ బొమ్మై విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అసలేం జరిగింది..?
Karnataka | A girl student was allegedly gang-raped at Lalithadripura layout, Mysuru on 24th August. As per the complaint, 6 men committed the crime and also beat the girl's friend. FIR lodged in Alanahally Police Station
— ANI (@ANI) August 25, 2021
మైసూరుకు చెందిన ఓ యువతీ యువకుడు ఆగస్టు 24న నగర శివారుల్లోని చాముండేశ్వరి దేవాలయానికి వెళ్లారు. ఆలయం బయటికి వచ్చాక సమీపంలోనే వారిని చుట్టుముట్టిన దోపిడీ దొంగలు డబ్బులు ఇవ్వాలని వారిని డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించడంతో వారిపై దాడికి పాల్పడ్డారు. యువకుడిని తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అనంతరం యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. కోలుకున్న బాధితులు ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న దొంగల కోసం గాలిస్తునట్లు తెలిపారు.
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువతి వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని.. నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుని కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
Karnataka | We have formed teams for the investigation of the case. We can't disclose details related to this case at this point in time: Dr. Chandragupta, Commissioner of Police, Mysuru City on the gangrape of a girl student
— ANI (@ANI) August 25, 2021
The victim is admitted to a hospital. A case has been registered based on the statement of the victim... I have instructed the DGP to take stringent action against the culprit: Karnataka CM Basavaraj Bommai on the gangrape of a girl student in Mysuru pic.twitter.com/rYqqKckRQJ
— ANI (@ANI) August 25, 2021