News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Wrong UPI Payment: యూపీఐ ద్వారా మీ డబ్బు రాంగ్‌ పర్సన్‌కు వెళ్లిందా?, తిరిగి పొందే ఛాన్స్‌ కూడా ఉంది

మీరు ఏదైనా ఫోన్‌ నంబర్‌కు డబ్బులు పంపించాల్సి వచ్చినప్పుడు, 10 అంకెల్లో ఒక్క అంకెను తప్పుగా ఎంటర్‌ చేసినా డబ్బులు వేరొకరికి వెళ్లిపోతాయి.

FOLLOW US: 
Share:

Wrong UPI Payment: మన దేశంలో, డిజిటల్ పద్ధతిలో చేసే చెల్లింపుల్లో (Digital payments) వేగవంతమైన ట్రెండ్ కనిపిస్తోంది. 2022 డిసెంబర్‌లో, యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (Unified Payments Interface) లేదా UPI ఆధారితంగా జరిపిన చెల్లింపుల విలువ రూ. 12.82 లక్షల కోట్లకు చేరింది. ఇది రికార్డు స్థాయి. ఆ నెలలో దేశ ప్రజలు జరిపిన UPI లావాదేవీల సంఖ్య 782 కోట్ల పైమాటే.

గత ఏడాది కాలంగా, దేశంలో UPI లావాదేవీల సంఖ్య & వాటి విలువ చాలా వేగంగా పెరుగుతూ వస్తోంది. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ సమయంలో అయినా, చేతిలో ఉన్న మొబైల్‌ ఫోన్‌ ద్వారా తక్షణం చెల్లింపు చేయగలగడం ఈ పద్ధతిలో ఉన్న అత్యంత అనుకూల లక్షణం. దీని కోసం ప్రత్యేకంగా ప్రొఫైల్‌ను సృష్టించాల్సిన అవసరం లేదు. అవతలి వ్యక్తి UPI ఐడీ, ఫోన్‌ నంబర్‌, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌.. ఇలా ఏది ఉన్నా డబ్బు సులభంగా పంపించవచ్చు. 

UPIలో చాలా సానుకూల అంశాలు ఉన్నా, చిన్నపాటి ఇబ్బంది కూడా ఉంది. మీరు ఏదైనా ఫోన్‌ నంబర్‌కు డబ్బులు పంపించాల్సి వచ్చినప్పుడు, 10 అంకెల్లో ఒక్క అంకెను తప్పుగా ఎంటర్‌ చేసినా డబ్బులు వేరొకరికి వెళ్లిపోతాయి. లేదా, యూపీఐ ఐడీలో ఒక్క అక్షరం మారినా ఇదే జరుగుతుంది. ఒక్కోసారి హడావిడిగా పేమెంట్‌ చేసేటప్పుడు ఇలాంటి పొరపాటు దొర్లడానికి అవకాశం ఉంటుంది. మీ డబ్బు పొరపాటున వేరొకరికి వెళ్లిపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం ఇకపై లేదు. మీ డబ్బును మీరు తిరిగి పొందే అవకాశం ఉంది.

డబ్బును తిరిగి పొందడం ఇలా:
ఒకవేళ మీరు పొరపాటును వేరొకరికి డబ్బులు పంపితే... డబ్బు బదిలీ తర్వాత దాని తాలూకు స్క్రీన్‌ షాట్‌ తీసి పెట్టుకోండి. మీ ఖాతా నుంచి డబ్బు డెబిట్‌ అయినట్లు మీకు సందేశం వస్తుంది కదా, దాన్ని కూడా జాగ్రత్తగా దాచండి. ఇప్పుడు యాక్షన్‌ పార్ట్‌ మొదలవుతుంది. ముందుగా, మీరు ఏ యాప్‌ (పేటీఎం, ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటివి) ద్వారా డబ్బు అవతలి వ్యక్తికి పంపిచారో, సంబంధిత కస్టమర్‌ సర్వీస్‌కు ఫోన్‌ చేసి, లేదా ఈ-మెయిల్‌ చేసి జరిగిన విషయాన్ని వివరించండి. మీ సమస్య పరిష్కారం కావడానికి ఇక్కడ 50-50 ఛాన్స్‌ ఉంది.

ఒకవేళ సదరు కస్టమర్‌ సర్వీసు వాళ్లు కూడా చేతులెత్తేస్తే, మీరు NPCI పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌ npci.org.inలోకి వెళ్లి..'What we do' ట్యాబ్‌లో UPI బటన్‌ మీద క్లిక్‌ చేయండి. ఆ తర్వాత, కంప్లయింట్ సెక్షన్‌లో ఫిర్యాదు చేయండి. వచ్చు. నేరుగా ఈ లింక్‌ను క్లిక్‌ చేసి ఫిర్యాదుల పేజీకి వెళ్లవచ్చు.

వీటితోపాటు, మీ బ్యాంకుకు కూడా జరిగిన విషయాన్ని వివరించండి. ముందుగా మీ బ్యాంకుకు - ఆ తర్వాత, అవతలి వ్యక్తి ఖాతా ఉన్న బ్యాంకుకు ఫిర్యాదు చేయండి. ఆ బ్యాంకు వాళ్లు సదరు వ్యక్తిని సంప్రదించి డబ్బు వాపసు చేయించేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నాలు ఏమీ ఫలించకపోతే, bankingombudsman.rbi.org.in వెబ్‌సైట్‌కు వెళ్లి, అక్కడి నుంచి కూడా ఫిర్యాదు చేయవచ్చు. 

చివరి అస్త్రంగా మీరు కోర్టుకు వెళ్లవచ్చు. మీ అకౌంట్‌ నుంచి వచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు అవతలి వ్యక్తి నిరాకరించినట్లయితే.. అతని మీద లీగల్‌గా కూడా యాక్షన్  తీసుకునే అవకాశం ఉంది.

ఇన్ని తిప్పలు ఎందుకు అనుకుంటే... డబ్బు పంపే ముందే ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుంటే సరి, ఆల్‌ హ్యాపీస్‌.

Published at : 05 Jan 2023 04:52 PM (IST) Tags: NPCI UPI Unified Payments Interface wrong UPI payment Digital payments

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

Adani Group Investment Plan: ఇన్‌ఫ్రాలో పట్టు కోసం అదానీ మెగా ప్లాన్, మౌలిక సదుపాయాల్లోకి రూ.7 లక్షల కోట్లు

Train Ticket: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

Train Ticket: కన్ఫర్మ్‌డ్‌ ట్రైన్‌ టిక్కెట్‌ సెకన్లలో వ్యవధిలో దొరుకుతుంది, ఈ ఆప్షన్‌ ప్రయత్నించండి

Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

Forex Reserves: వరుసగా రెండో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ ఛెస్ట్‌ - ఇండియా దగ్గర 597.39 బిలియన్ డాలర్ల నిల్వలు

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

GST Data: GDPతో పోటీ పడిన GST, నవంబర్‌ నెలలో రూ.1.68 లక్షల కోట్ల వసూళ్లు

టాప్ స్టోరీస్

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్

Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
×