TCS Q2 Earnings: ఈ రోజు టీసీఎస్ రిజల్ట్స్, షేర్ల బైబ్యాక్ ప్రకటన - కంపెనీ ఆదాయం, లాభంపై మార్కెట్ ఆలోచనలివి!
మార్కెట్ వాటా పరంగా దేశంలో రెండో అతి పెద్ద, IT సెక్టార్‌లో అతి పెద్ద కంపెనీ TCS.
TCS Q2 earnings today: ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సెక్టార్‌లో రెండో త్రైమాసిక ఆదాయాల సీజన్ ఈ రోజు (బుధవారం, 11 అక్టోబర్ 2023) నుంచి ప్రారంభమవుతుంది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) దీనిని స్టార్ట్ చేస్తుంది. ఈ రోజు మార్కెట్ ముగిసిన తర్వాత టీసీఎస్ సెప్టెంబర్ క్వార్టర్ (Q2 FY24) ఆర్థిక ఫలితాలు విడుదల అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వాతావరణం పెద్దగా అనుకూలంగా లేకపోవడం వల్ల, ఈ ఐటీ కంపెనీ నుంచి మార్కెట్ పెద్దగా ఆశించడం లేదు.
మార్కెట్ వాటా పరంగా దేశంలో రెండో అతి పెద్ద, IT సెక్టార్‌లో అతి పెద్ద కంపెనీ TCS. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 13.29 లక్షల కోట్లు.
ఆదాయం, లాభం అంచనాలు
సాంప్రదాయకంగా, సెప్టెంబరు త్రైమాసికం ఐటీ రంగానికి బలంగా ఉంటుంది. ఎనిమిది బ్రోకరేజ్ సంస్థల అంచనాల ప్రకారం, TCS ఏకీకృత ఆదాయం QoQలో కేవలం 1.4% వృద్ధితో రూ. 60,218 కోట్లకు చేరుతుంది. సంవత్సరం (YoY) ప్రాతిపదికన, టాప్‌లైన్ (ఆదాయం) దాదాపు 9% పెరుగుతుంది. ఏకీకృత నికర లాభం QoQలో 3%, YoYలో 9% పైగా పెరిగి రూ. 11,404 కోట్లుగా ఉంటుంది.
డీల్ విన్స్
IT సేవలపై క్లయింట్స్ వ్యయాలు మందగించినప్పటికీ, TCS డీల్ విన్స్‌లో మొమెంటం కొనసాగుతుందని ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు. రెండో త్రైమాసికంలో, టీసీఎస్ సహా టైర్-I కంపెనీలన్నీ చాలా లార్జ్ డీల్స్‌ను ప్రకటించాయి. కాబట్టి, TCV బుకింగ్స్‌లో బలం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు. కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ లెక్క ప్రకారం, BSNL డీల్ వాల్యూతో కలిపి Q2లో $12 బిలియన్ల విలువైన డీల్స్‌ను TCS విన్ అయింది. ఇది, YoYలో 48% వృద్ధి.
ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో, ఈ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ మేజర్ $10 బిలియన్ల విలువైన ఒప్పందాలు దక్కించుకుంది, ఇది దాని గైడెడ్ రేంజ్ అయిన $7-9 బిలియన్ల కంటే ఎక్కువ.
TCS ఆపరేటింగ్ మార్జిన్ 23.2% నుంచి QoQలో 30-90 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.
TCS షేర్స్ బైబ్యాక్ ప్రోగ్రామ్
షేర్ల బైబ్యాక్ గురించి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆలోచిస్తోంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ మీటింగ్ ఈ రోజు జరుగుతుంది. Q2 ఆర్థిక ఫలితాలతో పాటు షేర్స్ బైబ్యాక్ గురించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. డైరెక్టర్ల బోర్డు ఆమోదం తర్వాత, షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్‌ను ఈ టెక్ కంపెనీ మార్కెట్‌కు వెల్లడిస్తుంది. షేర్ల బైబ్యాక్ కోసం కంపెనీ ఎంత డబ్బు కేటాయిస్తుంది, ఎంత ధరకు ఒక్కో షేరును తిరిగి కొనుగోలు చేస్తుంది, తేదీలు ఏంటి అన్న డిటైల్స్ వెల్లడవుతాయి.
బైబ్యాక్‌కు ఆమోదం లభిస్తే, షేర్ బైబ్యాక్ ప్రోగ్రామ్‌ను చేపట్టడం ఇది ఐదోసారి అవుతుంది. చివరిసారిగా, గత ఏడాది, రూ.18,000 కోట్ల విలువైన షేర్లను టీసీఎస్ బైబ్యాక్ చేసింది. ఒక్కో షేరును రూ. 4,500 ప్రైస్ దగ్గర, మొత్తం 4 కోట్ల షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. 2022 మార్చిలో ప్రాసెస్ ముగిసింది. అంతకుముందు, 2020, 2018, 2017లోనూ రూ.16,000 కోట్ల చొప్పున షేర్స్ బైబ్యాక్ చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial