Online Shopping: కొనేది మీరయినా, కొనిపించేది వాళ్లు! ఈ-కామర్స్ కంపెనీల ట్రాప్
ఈ కామర్స్ కంపెనీలు ఉపయోగిస్తున్న డార్క్ ప్యాటర్న్‌లు కన్జ్యూమర్లను కన్‌ఫ్యూజ్ చేస్తాయి.
Dark Patterns In Online Shopping: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, నైకా, బిగ్‌బాస్కెట్, రిలయన్స్ రిటైల్, స్విగ్గీ, మీషో వంటి టాప్ డిజిటల్ కామర్స్ కంపెనీలకు సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కన్జ్యూమర్లను ట్రాప్ చేసే చౌకబారు పనులు మానుకోవాలని హితవు చెబుతూ లేఖలు పంపింది. యూజర్లను ఛాయిస్‌ను మోసం/తారుమారు చేసే "డార్క్ ప్యాటర్న్స్" డిస్కషన్స్ లేకుండా ఆపేయమంటూ హెచ్చరించింది.
ఈ కామర్స్ కంపెనీలు ఉపయోగిస్తున్న డార్క్ ప్యాటర్న్‌లు కన్జ్యూమర్లను కన్‌ఫ్యూజ్ చేస్తాయి. అవసరం లేని వస్తువును కూడా కొనేలా ఫోర్స్ చేస్తాయి. కాబట్టి, ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో జాగ్రత్తగా లేకపోతే, మీ పర్స్/కార్డ్ ఖాళీ అవుతుంది.
ఈ-కామర్స్ కంపెనీలు ప్రదర్శిస్తున్న నక్కజిత్తులు ఇవి:
అర్జెన్సీ: ఒక ప్రొడక్ట్‌ను కొనేలా కన్జ్యూమర్‌ను బలవంతం చేయడం. ఆ ఉత్పత్తి అత్యవసరం అనిపించేలా మైండ్‌వాష్ చేయడం లేదా, కొరతను సృష్టించడం. కన్జ్యూమర్ రెండో ఆలోచన లేకుండా ఆ ప్రొడక్ట్‌ను కొనిపించడం ఈ వ్యూహం లక్ష్యం.
బాస్కెట్ స్నీకింగ్: కొన్ని వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లు కన్జ్యూమర్ అనుమతి లేకుండానే షాపింగ్ కార్ట్‌లో కొన్ని ప్రొడక్ట్స్, సర్వీసులను యాడ్ చేయడానికి డార్క్ ప్యాటర్న్స్ ఉపయోగిస్తాయి.
కన్‌ఫర్మ్ షేమింగ్: ఇదొక మైండ్ గేమ్. ఒక నమ్మకం లేదా వ్యూపాయింట్‌కు అనుగుణంగా కన్జ్యూమర్ ఆలోచనలు లేకపోతే ఇది వాళ్లను విమర్శిస్తుంది, మాటలతో దాడి చేస్తుంది. ఫైనల్‌గా, వినియోగదార్లను తన దారిలోకి తెచ్చుకుంటుంది.
ఫోర్స్‌డ్ యాక్షన్: వినియోగదార్లు ఇష్టపడని పనులను కూడా బలవంతంగా చేయిస్తుంది. ఉదాహరణకు.. వెబ్‌సైట్ లేదా యాప్‌లోని కంటెంట్‌ను యాక్సెస్ చేసేందుకు కచ్చితంగా సైన్-అప్ చేయడం వంటివి.
న్యాగింగ్: ఇది కూడా మానసికంగా వేధించడమే. ప్రొడక్ట్‌కు సంబంధించి విమర్శల రూపంలో కన్జ్యూమర్‌ను నిరంతరం వెంటాడుతుంది. ఉత్పత్తి మీద ఏవైనా కంప్లైంట్స్, రిక్వెస్ట్‌లకు సంబంధించి యాక్షన్ తీసుకోవాలంటూ విసిగిస్తుంది.
సబ్‌స్క్రిప్షన్ ట్రాప్స్: ఈ వ్యూహం ప్రకారం, వినియోగదార్లు సులభంగా సైన్-అప్ చేస్తారు. కానీ, ఆ సబ్‌స్క్రిప్షన్ వద్దకున్నప్పుడు క్యాన్సిల్ చేయడం అంత ఈజీగా ఉండదు. కాన్సిలేషన్ ఆప్షన్‌ను దాచి పెట్టడం లేదా మల్టీపుల్ స్టెప్స్‌తో విసిగించడం జరుగుతుంది.
ఇంటర్ఫేస్ ఇంటర్‌ఫిరెన్స్: సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయడం లేదా అకౌంట్ డిలీట్ చేయడం వంటి పనులను కష్టంగా మార్చి, కన్జ్యూమర్లకు చుక్కలు చూపిస్తుందీ టాక్టిక్.
బెయిట్/స్విచ్: ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్ గురించి గొప్పగా యాడ్ ఇచ్చి, కన్జ్యూమర్ ఆర్డర్ చేసినప్పుడు వేరే ప్రొడక్ట్ పంపడం లేదా లో-క్వాలిటీ ఉన్నవి డెలివెరీ చేయడం.
హిడెన్ కాస్ట్స్: ఒక వస్తువు/సర్వీస్‌ను కొనే క్రమంలో, పేమెంట్ చేసే చివరి స్టేజ్ వచ్చేవరకు కూడా అదనపు ఖర్చుల గురించి చెప్పకుండా దాచడం ఈ వ్యూహం ఉద్దేశం.
యాడ్స్‌కు ముసుగు: యూజర్ రాసిన రివ్యూలు లేదా మీడియా న్యూస్ రూపంలో యాడ్స్‌ను ప్రజెంట్ చేయడం. అంటే. కంటెంట్ తరహాలో కనిపించేలా యాడ్స్ రూపొందించడం, యాజర్లను మోసం చేయడం.
మరో ఆసక్తికర కథనం: LTIమైండ్‌ట్రీకి నిఫ్టీ50 టిక్కెట్, HDFC ప్లేస్‌లో ఎంట్రీ
Join Us on Telegram: https://t.me/abpdesamofficial