LPG Cylinder Rates Today :దీపావళి రోజే బాంబు పేల్చిన చమురు సంస్థలు- LPG సిలిండర్‌పై భారం, మీ ప్రాంతంలో కొత్త రేట్లు చూడండి
LPG Price Hike:నవంబర్ మొదటి నుంచి ఈ కేటగిరీ LPG సిలిండర్ ధర పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు షాక్ ఇచ్చాయి. సిలిండర్‌కు 62 రూపాయల భారం వడ్డించాయి.
LPG Gas Cylinder Price Today In Hyderabad: దేశమంతా దీపావళి సంబరాల్లో మునిగితేలుతున్నారు. నేడు కూడా చాలా ప్రాంతాల్లో దీపావళి జరుపుకుంటున్నారు. అంతా ఆ అనందంలో ఉంటే ప్రజలకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. తెల్లారేసరికి ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. నవంబర్ 1 నుంచి 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచారు. ఇండియన్ ఆయిల్ కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు నవంబర్ 1 నుంచి రూ.62 పెంచి ఒక్కో సిలిండర్ ధర రూ.1802కి పెంచింది.
ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన ఎల్‌పిజి సిలిండర్ల ధరలు సమీక్షిస్తాయి. పండుగల సీజన్ అయినా నేటి నుంచి కొత్త మాసం ప్రారంభం కానుంది. నవంబర్ 1న కూడా దేశంలోని అనేక నగరాల్లో దీపావళి పండుగ జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ నెల మొదటి వారంలోనే ఛత్ పండుగతోపాటు కార్తీక మాసం ప్రారంభంకానుంది. ఈ నెల నుంచి పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలవుతోంది.
ఈ సెలబ్రేషన్స్ ఉండగానే ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు పెంచాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.62 పెరిగింది. హైదరాబాద్‌లో గతంలో రూ.1967గా ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.2028గా మారింది.
ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చే ధరలు ఇలా
ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1740 నుంచి రూ.1802కి పెరిగింది. కోల్‌కతాలో కొత్త ధర రూ.1850 నుంచి రూ.1911.50కి పెరిగింది. ముంబైలో వాణిజ్య LPG సిలిండర్ కొత్త ధర రూ.1692.50 నుంచి రూ.1754.50కి పెరిగింది. చెన్నైలో, వాణిజ్య LPG సిలిండర్ గ్యాస్ ఇప్పుడు రూ.1903 నుంచి పెరిగిన రూ.1964.50కి అందుబాటులో ఉంటుంది.
డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు
నేటి నుంచి కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు పెరిగినప్పటికీ ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కానీ వాణిజ్య LPG సిలిండర్ల ధరల పెరుగుదల రెస్టారెంట్లలో భోజనంపై ప్రభావం చూపుతుంది. రెస్టారెంట్లు తమ ఆహార రేట్లు పెంచవచ్చు.
సిలిండర్ ధర ఎక్కడ ఎలా ఉంది.
నగరం | గృహ అవసరాల సిలిండర్ ధర | వాణిజ్య సిలిండర్ ధర | |
1 | ఢిల్లీ | రూ. 803 | రూ. 1802 |
2 | కోల్‌కతా | రూ. 829 | రూ. 1911 |
3 | ముంబై | రూ.802 | రూ. 1754 |
4 | చెన్నై | రూ.818.50 | రూ.1954.50 |
5 | బెంగళూరు | రూ.805.50 | రూ.1879 |
6 | భువనేశ్వర్ | రూ.829 | రూ.1950 |
7 | హైదరాబాద్ | రూ.855.50 | రూ.2028 |
సీఎన్జీ ఏ ప్రాంతంలో ఏ ధర ఉంది.
రాష్ట్రం పేరు | కేజీ సీఎన్జీ ధర | |
1 | ఆంధ్రప్రదేశ్ | రూ.88 |
2 | తెలంగాణ | రూ. 92 |
3 | తమిళనాడు | రూ. 90.50 |
4 | ఒడిశా | రూ. 87.26 |
5 | కర్నాటక | రూ. 83.25 |
6 | మహారాష్ట్ర | రూ. 75 |
7 | కేరళ | రూ. 86.50 |
8 | ఢిల్లీ | రూ. 75.50 |
9 | హర్యానా | రూ. 84.64 |