Budget 2022: గుడ్ న్యూస్.. 80 లక్షల ఇళ్ల నిర్మాణం.. రూ.44 వేల కోట్లు కేటాయింపు
కొత్తగా 80 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మధ్యతరగతి కుటుంబాలకు కీలక హామీ ఇచ్చారు. పీఎం ఆవాస్ యోజన కింద 2022-23 ఏడాదిలో 80 లక్షల ఇళ్లను నిర్మిస్తామన్నారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.44,000 కోట్లు కేటాయించారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హత ఉన్న లబ్ధిదారులకు పీఎం ఆవాస్ యోజన కింద ఈ ఇళ్లను అందిస్తామని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు, పట్టణ ప్రాంతాల్లో ఉంటోన్న మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పీఎం ఆవాస్ యోజన.. ఎంతోమంది సొంతింటి కలను నెరవేర్చుతుందన్నారు ఆర్థిక మంత్రి.
అంతేకాకుండా విద్యుత్ రంగం కోసం నిధులు కేటాయించారు. విద్యుత్ రంగ సంస్కరణల కోసం ప్రత్యేక ప్రణాళికను రచించినట్లు నిర్మలా తెలిపారు. విద్యుత్ సంస్థలను పునరుత్తేజ పరిచేందుకు ఆర్థిక సాయం ప్రకటించారు.
రాష్ట్రాల కోసం..
రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు.
ఎర్ర సంచిలోనే..
2020, 2021లానే 2022లోనూ ఎర్రటి బ్యాగులో తీసుకువచ్చిన ట్యాబ్ ద్వారానే బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. డిజిటల్ విధానంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కాపీలు యాప్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచారు.
Also Read: Tax Slab, Budget 2022: ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులేదు! ప్చ్.. వేతన జీవులకు నిరాశే!!
Also Read: Union Budget 2022 : రాష్ట్రాలకు "నిర్మల"మైన కానుక.. వడ్డీ లేని రూ. లక్ష కోట్ల రుణాలు !