News
News
X

Medical Colleges AP: విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజీకి గ్రీన్ సిగ్నల్, ఎన్ని సీట్లు ఇచ్చారంటే !

Vizianagaram Medical College: విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది.

FOLLOW US: 
Share:

విజయనగరం : జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. త్వరలోనే జిల్లాలో మెడికల్ కాలేజీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం 2023-24 నుంచి వైద్య కళాశాల (Medical College) లో తరగతులు నిర్వహించేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (National Medical Commision) అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని విజయనగరం జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి వెల్లడించారు. 

మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 150 సీట్లతో ఎం.బి.బి.ఎస్. ప్రథమ సంవత్సరం తరగతులు మంజూరు చేసేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరంలో మెడికల్ కాలేజీ ఫస్ట్ బ్యాచ్ ప్రవేశాలు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఏపీలో కొత్తగా 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు కాగా, అందులో అనుమతులు పొందిన ఫస్ట్ కాలేజీ విజయనగరం జిల్లాదే. 

జాతీయ మెడికల్ కమిషన్ బృందం ఫిబ్రవరి 3న వైద్య కళాశాల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం అనుమతులు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి వెల్లడించారు. ఇప్పటికే రూ.500 కోట్ల వ్యయంతో వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో వైద్య కళాశాల నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

స‌ర్వజ‌న ఆసుప‌త్రిలో సకల సౌకర్యాలు
గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను తాత్కాలికంగా ప్రారంభించేందుకు, జిల్లా స‌ర్వజ‌న ఆసుప‌త్రిలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆసుప‌త్రిలో ఆధునిక వ‌స‌తుల‌ను క‌ల్పించడంతో పాటు హాస్పిటల్ పరిసరాలను సుంద‌రంగా తీర్చిదిద్దారు. మొత్తం 30 ప‌డ‌క‌ల‌తో ఎన్ఐసియు, ఐసియు, ఎస్ఐసియు స‌దుపాయాల‌ను ఏర్పాటు చేశారు. గ గ‌ర్భిణులు, చిన్న పిల్లల కోసం ఆసుప‌త్రిని అభివృద్ధి చేశారు.  సుమారు 8.6 కోట్ల రూపాయ‌ల‌ ఖ‌ర్చుతో అవ‌స‌ర‌మైన భ‌వ‌నాల‌ను నిర్మించి, వ‌స‌తుల‌ను కల్పించారు. వాటితో పాటు ఔట్ పేషెంట్‌ రిజిష్ట్రేష‌న్ రూమ్‌, లెక్చర్ గ్యాల‌రీని నిర్మించడంతో పాటు ప్రిన్సిపాల్‌, ప్రొఫెస‌ర్లు, వైద్య నిపుణులు, ఇత‌ర‌ సిబ్బంది నియామ‌కాల‌ను దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణ ప‌నుల‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి విడ‌ద‌ల ర‌జ‌ని ఇటీవల ప‌రిశీలించారు. రాష్ట్రంలో మొత్తం 16 ప్రభుత్వ కాలేజీలను మంజూరు చేయగా, అనుమతి లభించిన తొలి ప్రభుత్వ మెడికల్ కాలేజీగా విజయనగరం కాలేజీ నిలిచింది. గాజుల‌రేగ వ‌ద్ద రూ.500 కోట్లతో వైద్య క‌ళాశాల శాశ్వత భ‌వ‌నాల‌ నిర్మాణం వేగంగా జ‌రుగుతోంది. సుమారు 35 కోట్ల రూపాయ‌లతో, పీవీబీ స్టక్చర్ విధానంలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ భ‌వ‌నాన్ని త్వర‌లో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త మెడికల్ కాలేజీ పనులు త్వరలోనే పూర్తి చేసి కొత్త కాలేజీ భవనం నుంచే ఎంబీబీఎస్ తొలి ఏడాది విద్యార్థులకు క్లాసులు నిర్వహించనున్నారు.

ఎంబీబీఎస్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌
ఎంబీబీఎస్ అభ్యర్థులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు తప్పనిసరిగా పూర్తిచేయాల్సిన ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్(ఏడాది కాలం) కటాఫ్ తేదీని ఆగస్టు 11 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నీట్ పీజీ-2023 పరీక్ష అర్హత విషయంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల అభ్యర్థులకు ఊరట లభించినట్లయింది. పలు రాష్ట్రాలు, విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తయ్యేవారే నీట్ పీజీ-2023 పరీక్షకు అర్హులని కేంద్రం తొలుత పేర్కొంది. ఆ కటాఫ్ గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ గత నెల 13న నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

Published at : 21 Feb 2023 05:54 PM (IST) Tags: medical college Vizianagaram National Medical Commission Medical Colleges in AP Vizianagaram Medical College

సంబంధిత కథనాలు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

అచ్చెన్న ఫ్లెక్సీలపై దువ్వాడ పోస్టర్లు -మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు

పలాసలో భూవివాదాలపై మంత్రి భూ దర్బార్‌- కబ్జాలు నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటన

పలాసలో భూవివాదాలపై మంత్రి భూ దర్బార్‌- కబ్జాలు నిరూపిస్తే రాజకీయల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటన

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Visakhapatnam: చనిపోతామంటూ నిన్న దంపతుల సెల్ఫీ వీడియో - నేడు మృతదేహాలు లభ్యం

Visakhapatnam: చనిపోతామంటూ నిన్న దంపతుల సెల్ఫీ వీడియో - నేడు మృతదేహాలు లభ్యం

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు