అన్వేషించండి

Andhra Pradesh News: పసిపాప కోసం ఆక్సిజన్ సిలిండర్‌ మోసుకెళ్లిన తండ్రి- నెట్టింట వైరల్‌గా మారిన విశాఖ కేజీహెచ్‌ దారుణం

Visakhapatnam News: విశాఖపట్నం కేజీహెచ్‌లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెలలు నిండని బిడ్డకోసం ఓ తండ్రి ఆక్షిజన్ సిలిండర్ మోసుకుంటూ వెళ్లడం విమర్శలకు దారితీసింది.

AP Viral News: కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెడుతున్నా ప్రభుత్వ ఆస్పత్రుల రూపు రేఖలు మారడం లేదు. బడ్జెట్‌లో వేల కోట్లు కేటాయిస్తున్నా.. ఆస్పత్రుల్లో కనీస వసతులు ఉండడం లేదు. కొన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఆధునిక వైద్య సామగ్రి అందుబాటులో ఉండదు. కొన్నింటిలో రోగులకు సరిపడా పడకలు ఉండవు. స్ట్రెచర్లు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉండవు. ఇంకొన్ని చోట్ల వీల్ చైర్లు ఉండవు. ఇవన్నీ ప్రభుత్వాస్పత్రుల్లో వసతుల కొరతకు నిదర్శనాలు. ఆస్పత్రి ఫ్లోర్‌పై చికిత్స పొందుతున్న రోగులు ఎందరో ఉన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లలేని పేదలు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వాస్పత్రుల్లో పూర్తి స్థాయిలో నాణ్యమైన, మెరుగైన వైద్యం అందడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. 

భుజాన ఆక్షిజన్ సిలిండర్ 
విశాఖపట్నం కేజీహెచ్‌లో వసతులు, మౌలిక సదుపాయాల కొరత మరోసారి చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి ఆక్షిజన్ సిలిండర్ మోసుకుంటూ వెళ్లడం విమర్శలకు దారితీసింది. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు విష్ణుమూర్తి భార్య అల్లు శిరీష‌కు మంగళవారం ప్రసవ నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను  కేజీహెచ్‌ ప్రసూతి విభాగంలో చేర్పించి వైద్యం అందించారు. నెలలు నిండకుండని బిడ్డకు శిరీష జన్మనిచ్చింది. దీంతో శిశువును ఎన్‌ఐసీయూలో ఉంచాలని వైద్యులు సిబ్బందికి సూచించారు. 

పసికందుకు ఆక్సిజన్‌ పెట్టి ఎన్‌ఐసీయూకు బయలుదేరారు. బిడ్డను పట్టుకొని నర్సు ముందు నడుస్తుండగా అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్‌ సిలిండర్‌ను భుజాన వేసుకొని ఆమె వెనక నడిచారు. ఈ ఉదంతాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. విషయం కాస్తా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివానందకు చేరడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చర్యలు తప్పవని వైద్యులు, సిబ్బందిని పిలిచి హెచ్చరించారు. రోగుల సౌకర్యం కోసం బ్యాటరీ వాహనాన్ని అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. 

రెండు రోజుల క్రితం పేలిన వెంటిలేటర్ బ్యాటరీ
విశాఖ కేజీహెచ్‌లో రెండు రోజుల క్రితం సోమవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ ఐసీయూ వార్డులోని వెంటిలేటర్‌ బ్యాటరీ పేలిపోవడంతో మంటలు వ్యాపించాయి. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది అక్కడికి చేరుకుని రోగులు, పిల్లలను మరో వార్డుకు తరలించారు. వెంటిలేటర్‌కు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఆస్పత్రిలో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపకశాఖ అధికారులు వచ్చే సరికి మంటలు అదుపులోకి వచ్చాయి. కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివానందకు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.  

ముగ్గురు వైద్యులతో విచారణ
ప్రమాదానికి గల  కారణాలు తెలుసుకోవడానికి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శివానంద ముగ్గురు వైద్యులతో విచారణ కమిటీ వేశారు. అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్‌ వి.రవి, ఏఆర్‌ఎంవో డాక్టర్‌ దవళ భాస్కరరావు, బయోమెడికల్‌ ఇంజినీర్‌ రాజేష్‌తో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ బృందం ప్రమాదంపై విచారణ జరిపి షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే అగ్ని ప్రమాదం సంభవించిందని నిర్ధారించారు. ప్రమాదం జరిగిన తీరుపై సూపరింటెండెంట్‌కు నివేదిక సమర్పించారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Embed widget