News
News
X

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

కేవలం పావురాల కోసమే రెండంతస్తుల భవనాన్ని కేటాయించి వాటి బాగోగులు చూసుకుంటున్న వారు ఉంటారంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవును ఇది నిజం.

FOLLOW US: 
Share:

రెండంతస్తుల భవనం అంటే సాధారణంగా అందులో ఎన్నో కుటుంబాలు జీవనం సాగించటం కామన్ గా చూస్తుంటాం. కానీ కేవలం పావురాల కోసమే రెండంతస్తుల భవనాన్ని కేటాయించి వాటి బాగోగులు చూసుకుంటున్న వారు ఉంటారంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవును ఇది నిజం. రెండంతస్తుల భవనంలో శబ్ధాలు చేసుకుంటూ, పాటలు వింటూ, ఫ్యాన్ కింద జీవనం సాగిస్తున్న పావురాల వివరాలపై మీరు ఒ లుక్కేయండి.
గన్నవరం సమీపంలోని మానికొండ గ్రామంలో ఉన్న ఈ రెండు అంతస్తుల భవనంలో కుటుంబాలు నివాసం ఉండటం లేదు. మనుషులు అసలు కనిపించరు. కేవలం పావురాలు మాత్రమే ఉంటాయి. సాధారణంగా రెండు అంతస్తుల భవనం అంటే కనీసం నాలుగు కుటుంబాలు నివాసం ఉండే అవకాశం ఉంది. కానీ ఈ భవనంలో మాత్రం పూర్తిగా పావురాలకు మాత్రమే ప్రత్యేకం. గత పది సంవత్సరాలకు పైగా ఈ భవనంలో  పక్కాగా పావురాలను మాత్రమే పెంచుతున్నారు చెరుకువాడ శ్రీనివాసరావు అనే బిల్డర్. ఈ భవనంలో ఉంటున్న పావురాలకు మనుషులతో సమానంగా జీవనం సాగిస్తున్నాయి. ఉదయం లేచింది మెదలు రాత్రి పడుకునే వరకు పూర్తిగా స్వచ్ఛమైన గాలిని, నీరు, ఆహరం అందిస్తున్నారు. వేకువజామునే పావురాలు లేచింది మెదలు, వాటికి జొన్నలు, పెసలు, శనగలు, గోధుమలు, బఠాణీలు వంటి 15 రకాల ఆహరాన్ని అందిస్తారు. అంతే కాదు ప్రత్యేకంగా తాగునీటి సరఫరా ఉంటుంది. అది పూర్తిగా మెడికేటెడ్ వాటర్ కావటం మరో విశేషం.
ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది. పావురాల కోసం ప్రత్యేకించి మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేశారు. తెలుగు పాటలతో పాటుగా హిందీ, ఇంగ్లీష్ పాటలను పావురాల కోసం ప్లే చేస్తారు. మ్యూజిక్ ను వింటూ మేత తింటూ, పావురాలు విలాసవంతమయిన జీవనం గడుపుతున్నాయి. పక్షులు ఉండే ప్రాంతం అంటే పారిశుద్ధ్యానికి ఇబ్బందిగా ఉంటుంది, కాని ఇక్కడ మనుషులు ఉంటే ఎలాంటి హైజెనిక్ వాతావరణం ఏర్పరచుకుంటామో, అలాంటి వాతావరణమే ఉంటుంది. ఉదయం, సాయంత్రం పావురాలు ఉంటే ఫ్లోరింగ్ ను పూర్తిగా శానిటైజ్ చేస్తుంటారు. సాధారణంగా భవనంలో పావురాలను పెంచాలంటే ఆషామాషీ వ్యవహరం కాదు. వాటిని కాపాడుకోవటం ప్రదాన సమస్య. అనారోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్తలు వహించాలి. సమయానికి ఆహరం, తాగునీరు, ఎంత ముఖ్యమో, అనారోగ్యం గురయినప్పుడు గుర్తించి మందులు వేయటం అంతే శ్రద్ద ఉండాలి. ఇందుకు ప్రత్యేకంగా ఒక మనిషిని శ్రీనివాసరావు నియమించారు. అతనే స్వయంగా పావురాలతో మమేకం అయ్యి, వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. తాను చూసుకుంటున్న పావురాలు ఏ జాతికి చెందినవి, ఎలా ఉంటాయి, వాటిని కాపాడుకునే విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను గురించి రాము గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తున్నాడు. 150కి పైగా పావురాలను తమ వద్ద పెంచుతున్నామని అంటున్నాడు. పావురాలు అంటే తమకు ఉన్న ఇష్టంతోనే ఇలా ప్రత్యేకంగా పెంచుకుంటున్నామని తెలిపారు.

దాదాపుగా 20 ఏళ్ళుగా పావురాలను పెంచుకుంటున్నామని, వాటి పై ఉన్న ప్రేమతోనే ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించినట్లు చెరుకువాడ శ్రీనివాసరావు తెలిపారు. పావురాలకు గాలి, వెలుతురు కోసం భవనాన్ని డిజైన్ చేయించి నిర్మించినట్లు చెబుతున్నారు. పావురాలకు ఫీడింగ్ తో పాటుగా ఫ్యాన్, లైట్లు, మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేశామని చెప్పారు. దోమల నుంచి రక్షణ కోసం ప్రత్యేకంగా మెష్ ను ఏర్పాటు చేశామని, దశాబ్దాలుగా ఆలనాపాలనా చూస్తున్నామని తెలిపారు. ఆదాయం లేకపోయినా తమకు వచ్చిన ఇబ్బంది లేదని అంటున్నారు. చాలా మంది పక్షులను బంధిస్తున్నారంటూ మాట్లాడుతుంటారని, అయితే వీటిని బయటకు వదిలితే, పక్షులు, కాకులు పొడుచుకొని తినేస్తాయి కనుక వాటికి రక్షణగా ఉంటున్నామని శ్రీనివాసరావు వెల్లడించారు.

Published at : 27 Nov 2022 10:13 PM (IST) Tags: Pigeon Vijayawada News Vijayawada bird lovers bulding for piegions

సంబంధిత కథనాలు

ఇమేజ్‌ డ్యామేజ్ చేస్తే డొక్క పగలదీస్తాం- దుట్టా, యార్లగడ్డకు వంశీ స్ట్రాంగ్ వార్నింగ్!

ఇమేజ్‌ డ్యామేజ్ చేస్తే డొక్క పగలదీస్తాం- దుట్టా, యార్లగడ్డకు వంశీ స్ట్రాంగ్ వార్నింగ్!

Buggana Rajendranath: సీఎం కార్యాలయం ఉన్నచోటే పరిపాలనా రాజధాని: బుగ్గన రాజేంద్రనాథ్

Buggana Rajendranath: సీఎం కార్యాలయం ఉన్నచోటే పరిపాలనా రాజధాని: బుగ్గన రాజేంద్రనాథ్

కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఎపిసోడ్స్‌పై జగన్ వ్యూహమేంటి? జిల్లా కోఆర్డినేటర్లకు ఏం చెప్పనున్నారు?

కృష్ణా, గుంటూరు, నెల్లూరు ఎపిసోడ్స్‌పై జగన్ వ్యూహమేంటి? జిల్లా కోఆర్డినేటర్లకు ఏం చెప్పనున్నారు?

AP News : ఒక్కో కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి, కొత్త కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం

AP News : ఒక్కో కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి, కొత్త కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ శ్రీకారం

Ministers On Tapping : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - కోటంరెడ్డికి మంత్రుల కౌంటర్ !

Ministers On Tapping : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - కోటంరెడ్డికి మంత్రుల కౌంటర్ !

టాప్ స్టోరీస్

Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!

Jagan focus on Muslims : మైనార్టీలపై జగన్ ఫోకస్, త్వరలో భారీ బహిరంగ సభకు ప్లాన్!

Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్

Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని

PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam

PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam