ఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ బాధిత గ్రామస్తులు, ప్రభుత్వంతో ఏదో ఒకటి తేల్చుకునే దిశగా భీష్మించుకొని నిరసనకు దిగారు. బుధవారం ఉదయం నిరసనకు దిగిన గ్రామస్తులు గ్రామంలో పోలీసులను రానివ్వకుండా పరిగెత్తించారు. రాళ్లు రువ్వినా సైతం పోలీసులు మాత్రం సంయమనం పాటించి నిరసనకారులపై ఎలాంటి చర్యలకు పాల్పడకుండా దూరంగా వెళ్లిపోయారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో విషయం తెలుసుకొని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో సీఎం కార్యాలయంకి నివేదిక పంపేలా చేశారు. దీంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలి ఫ్యాక్టరీ రద్దు చేసేలా చర్య తీసుకోవాలని ఆదేశించడంతో జిల్లా కలెక్టర్ ప్రకటన మీడియా ద్వారా తెలియజేశారు. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ రోడ్డెక్కిన గ్రామస్తుల ఆందోళనను జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఎలా సద్దుమణిగేలా ప్రయత్నం చేశారు..? ఈ అంశాలపై నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల,తో abp దేశం ఫేస్ టు ఫేస్.