By: ABP Desam | Updated at : 22 Jul 2023 10:05 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం(Image Source- freepik)
ఆడపిల్లకు ప్రమాదం ఏ రూపంలో వస్తుందో కూడా తెలియకుండా పోతుంది. సొంత మనుషులే మృగాలై చిన్నారులను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి దారుణమైన ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. అన్నకు వరసైన వ్యక్తి ఓ బాలికను అతి కిరాతకంగా అత్యాచారం చేశాడు. ఇది తప్పు అని చెప్పాల్సిన వ్యక్తి కూడా ఇందులో భాగం పంచుకున్నాడు.
ఇలాంటివి సినిమాల్లో చూపిస్తే కంటనీరు ఆగదు. అలాంటిది మన కళ్ల ఎదుటే జరిగింది అంటే గుండె బరువెక్కిపోతుంది. ముక్కుపచ్చలారని చిన్నారులపై సొంత మనుషులే మృగాళ్లే కామవాంఛ తీర్చకున్న దారుణం ఏలూరు జిల్లాలో జరిగింది. చేపల చెరువుల వద్ద కాపాల ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన చిన్నారి సమీపంలో ఉన్న హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది.
హాస్టల్‌కు సమీపంలో ఉండే బంధువు, ఆ బాలికకు అన్న వరసయ్యే వ్యక్తికి ఆమె బాధ్యతలు అప్పగించారు. హాస్టల్‌లో ఉన్నప్పటికీ ఆడపిల్ల కదా ఏదైనా అవసరం వస్తుంది కాస్త కనిపెట్టుకొని ఉండాలని బాలిక పేరెంట్స్ చెప్పారు. అదే ఆ చిన్నారి పాలిట శాపమైంది.
అన్న వరసైన వ్యక్తి తరచూ బాలికను తాను ఉంటున్న అద్దె ఇంటికి తీసుకెళ్లేవాడు. తీసుకెళ్లేది అన్నే కదా అని హాస్టల్ వాళ్లు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇలా ఆమెను తీసుకెళ్లిన ఆ వ్యక్తి ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోనే కుంగిపోయిందా బాలిక.
కొన్ని రోజుల తర్వాత వారి వ్యవహారాన్ని ఆ ఇంటి యజమానికి తెలిసింది. అతను తన స్నేహితులు వద్ద ప్రస్తావించాడు. అందులో ఒకడి బుర్రలో పాడు బుద్దులు పుట్టాయి. అంతే వీళ్లు ఉంటున్న ఇంటికి వచ్చి బాలిక అన్నను బెదిరించాడు. ఇద్దరికీ బుద్ది చెప్పి పంపించాల్సిన అతను కూడా ఈ తప్పులో భాగమయ్యాడు. పలుసార్లు బాలికను చిత్రవధ చేశాడు.
వాళ్లంతా ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంటి యజమాని 13 ఏళ్ల కుమారుడు గ్రహించాడు. అయితే ఆ విషయాన్ని ఎక్కడైనా బయట చెప్పేస్తాడేమో అని భయపడిన వాళ్లిద్దరు... ఆ బాలుడికి నీలి చిత్రాలు చూపించి ప్రేరణ కలిగించారు. అలా ఆ బాలుడిని కూడా ఈ నేరలంలో భాగం చేశారు. బాలుడితో కూడా అత్యాచారం చేయించారు.
ఇలా ముగ్గురు కొన్ని రోజులుగా ఇదే తీరున వ్యవహరించారు. ఇంతలో బాలికకు ఆరోగ్యం బాగాలేదు. అనారోగ్యంతో హాస్టల్‌లో ఉంటే బాగోదని ఇంటికి పంపించేద్దామనుకున్నారు. తల్లిదండ్రులకు కబురు పెట్టారు. వాళ్లు అన్న వరసైన వ్యక్తికి చెప్పారు. బాలికను తీసుకురావడానికి అతను హాస్టల్‌కు వచ్చాడు. ఆయన్ని చూసిన బాలిక వెళ్లేందుకు ఒప్పుకోలేదు. హాస్టల్ సిబ్బంది చెప్పినా వినిపించుకోలేదు. ఏడుస్తూ గట్టిగా కేకలు వేసింది. దీంతో ఏదో జరిగిందని గ్రహించిన హాస్టల్ సిబ్బంది నిలదీశారు.
హాస్టల్ సిబ్బంది గట్టిగా అడిగేసరికి బాలిక జరిగిన ఘోరాన్ని కళ్లకుకట్టింది. వెంటనే వాళ్లు కంగారుపడి తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవేశారు. వాళ్లు వచ్చి తమ బిడ్డతో మాట్లాడి మరిన్ని ఘోరమైన విషయాలు తెలుసుకున్నారు. అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు పోలీసులు హాస్టల్ వార్డెన్‌తో మాట్లాడి వివరాలు తీసుకున్నారు. ఈ కేసులో నిందితులైన ఖాదర్, రాంబాబు, ఇంటియజమాని కుమారుడు మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన నిందితుడు రాంబాబును పట్టుకోవడంలో నాటకీయ పరిణామాలు జరిగాయి. హాస్టల్ వార్డెన్‌కు, బాలిక పేరెంట్స్‌కు విషయం తెలిసిపోయిందని గ్రహించిన అతను ఎస్కేప్ ప్లాన్ చేశాడు. విశాఖ పారిపోతుండగా పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. రాజమండ్రి సమీపంలో అతన్ని అరెస్టు చేశారు. వీళ్లందరిపైనా పోక్సో కేసు నమోదు చేశారు.
Nara Lokesh: అమ్మ, చెల్లిని చూసినా జగన్‌కి భయమే, నాగార్జున సాగర్ ఇష్యూ కోడికత్తి లాంటిదే - లోకేశ్
AP Govt Holidays: వచ్చేఏడాది 20 సాధారణ సెలవులు, జాబితా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
AP High Court: ఎస్‌ఐ ఫలితాలపై హైకోర్టు కీలక తీర్పు - 'ఎత్తు' విషయంలో ఏమందంటే?
Nara Lokesh: ఆ తమ్ముడ్ని నేను చదివిస్తా, విద్యార్థి ఆవేదన విని స్పందించిన లోకేష్
Diploma in Pharmacy: ఫార్మసీ డిప్లొమా కోర్సుల ప్రవేశాల షెడ్యూలు విడుదల, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో రేపు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు
Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం
Revanth Reddy: రేపు ఈసీ వద్దకు కాంగ్రెస్ నేతలు, కేసీఆర్‌పై ఫిర్యాదు - వాటిని మార్చేస్తున్నారని ఆరోపణలు
Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్
Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్
/body>