By: ABP Desam | Updated at : 03 Jun 2022 06:11 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వైద్యులు, డ్రైవర్ ఇళ్లకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Kotamreddy Sridhar Reddy : సహజంగా ఆస్పత్రి నుంచి కోలుకుని ఇంటికి వచ్చినవారు దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటారు. కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం తన ప్రాణం కాపాడిన దేవుళ్లు మీరేనంటూ నెల్లూరు అపోలో హాస్పిటల్ వైద్యులు, అంబులెన్స్ డ్రైవర్, టెక్నీషియన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు ఆప్యాయంగా పలకరించారు. తన సతీమణితో కలసి ఆయన వారి ఇంటికి వెళ్లి అందర్నీ పలకరించి తన ప్రాణం కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపివచ్చారు. తనకు మరో జన్మ ఇచ్చారని, వారి రుణం తీర్చుకుంటానని చెప్పారు.
వైద్యులు, డ్రైవర్, టెక్నీషియన్లకు కృతజ్ఞతలు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో మే 27న ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించి, అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైకి చేర్చారు. తిరిగి ఆయన కోలుకుని నెల్లూరు చేరుకున్నారు. కొన్నిరోజులపాటు ఇంటిలో విశ్రాంతి తీసుకున్న ఆయన నేరుగా తనకు వైద్యం చేసిన డాక్టర్, ఆరోజు తనను అంబులెన్స్ లో చెన్నైకి తీసుకెళ్లిన డ్రైవర్, టెక్నీషియన్ల కుటుంబాలను కలిసి వారికి కృతజ్ఞతలు తెలిపారు.
అసలేం జరిగింది?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 47 రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆయన పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. గత నెల 27వ తేదీన ఓ కుటుంబం ఇంట్లోనే ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. ఆరోజు సాయంత్రం ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ముందు జాగ్రత్తగా అక్కడి నుంచి చెన్నై అపోలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. నెల్లూరులో ఆయనను మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ ఆమంచర్ల గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అక్కడే స్థానికులతో కలిసి భోజనం కూడా చేశారు.
Also Read : Nellore Politics: నెల్లూరులో పెరిగిన పొలిటికల్ హీట్ - సమావేశమైన ఆ ఇద్దరు వైసీపీ నేతలు
Top 10 Headlines Today: మెగాస్టార్ ఇంట గ్రాండ్ ఎంగేజ్‌మెంట్, సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ విచారణ, తెలంగాణలో బీసీలకు లక్ష
Top 10 Headlines Today: కేసీఆర్ వ్యూహం ఏంటీ? అవినాష్ అరెస్టు విడుదల!, రహానే-భరత్‌పైనే భారం, ఇవే మార్నింగ్ చూడాల్సిన వార్తలు
CM Jagan Gudivada Tour: సీఎం జగన్ గుడివాడ పర్యటన వాయిదా, ఇక టిడ్కో ఇళ్లు ప్రారంభం 16న!
AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు - ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !
చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ దంపతుల కుమార్తె వివాహం
Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?
చెరువుల పండుగలో అపశ్రుతి- నాటు పడవలో వెళ్తూ నీటిలో పడిపోయిన మంత్రి గంగుల
MP Avinash Reddy Arrest In YS Viveka Case: ఈ నెల 3వ తేదీన అరెస్ట్ చేసిన సీబీఐ
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం