IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Nellore Politics: నెల్లూరులో పెరిగిన పొలిటికల్ హీట్ - సమావేశమైన ఆ ఇద్దరు వైసీపీ నేతలు

Nellore Politics: పదవి దక్కలేదని బాధపడిన ఎమ్మెల్యే, మంత్రి వర్గం నుంచి బయటకొచ్చిన ఎమ్మెల్యే.. ఇద్దరూ ఇప్పుడు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

FOLLOW US: 

Nellore YSRCP News: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు వైసీపీ ఏకపక్షంగా గెలుచుకుంది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇక్కడ ప్రతిపక్షం బలపడలేదు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ హవా కనపడింది. నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో టీడీపీ ప్రాధాన్యం అస్సలు లేదని తేలిపోయింది. ప్రతిపక్ష ప్రభావం నామమాత్రమే అయినా నెల్లూరులో రాజకీయ వేడి మాత్రం తగ్గలేదు. వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి. 

ఇటీవల జరిగిన మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణతో నెల్లూరు పాలిటిక్స్ మరోసారి రచ్చకెక్కాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్ యాద‌వ్‌ కు మంత్రి ప‌ద‌వి పోవ‌డం, అదే సమయంలో స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్‌ రెడ్డికి కొత్తగా మంత్రి పదవి దక్కడంతో సరికొత్త రాజకీయం మొదలైంది. 

కోటంరెడ్డితో అనిల్ భేటీ.. 
ఇటీవల మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా తనకు పదవి రాలేదని మీడియా సమక్షంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఇక మంత్రి వర్గం నుంచి బయటకొచ్చిన అనిల్ కుమార్ యాదవ్.. తాజా మంత్రి కాకాణిపై చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంత్రి పదవి దక్కలేదని బాధపడిన ఎమ్మెల్యే, మంత్రి వర్గం నుంచి బయటకొచ్చిన ఎమ్మెల్యే.. ఇద్దరూ ఇప్పుడు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సహజంగా ఒకరింటికి ఒకరు వెళ్లి పలకరించుకుంటే పెద్దగా చర్చ జరిగేది కాదు. కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఇప్పుడు పూర్తిగా ప్రజల్లోకి వచ్చేశారు. నెలరోజులపాటు ఇంటికి దూరంగా జగనన్న మాట గడప గడపకు కోటంరెడ్డి బాట అనే కార్యక్రమం చేపట్టారు. ప్రతి రోజూ కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తూ తన యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పాదయాత్రలో ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డిని వెళ్లి కలిశారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. వీరిమధ్య జరిగిన భేటీ సారాంశం ఏంటనేది బయటకు రాలేదు. 

అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇప్పుడు సిటీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి కాస్త దూరమైనా, ఇప్పుడు ప్రజల్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దశలో ఇద్దరు ఎమ్మెల్యేలు సమావేశం కావడం, అనంతరం ఎవరూ ఎలాంటి ప్రకటన చేయకపోవడం నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ విషయంలో, కొత్తగా కాకాణికి పదవి దక్కిన సందర్భంలో నెల్లూరు వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయని అంటున్నారు. కాకాణి, ఆనం రామనారాయణ రెడ్డి ఒక వర్గం కాగా.. మిగతా ఎమ్మెల్యేలలో కొంతమంది మరో జట్టుగా తయారయ్యారని అంటున్నారు. ఇటీవలే నెల్లూరు సిటీలో కాకాణి ఫ్లెక్సీలు తొలగించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. మరో రెండు రోజుల్లో మంత్రి కాకాణి సొంత జిల్లాకు వస్తున్న సందర్భంలో నెల్లూరు పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి. 

Published at : 15 Apr 2022 08:57 AM (IST) Tags: Nellore news Nellore Updates Kotamreddy Sridhar Reddy Nellore politics nellore ysrcp anil kumar yadav

సంబంధిత కథనాలు

Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి

Nellore Knife Attack : నెల్లూరులో దారుణం, పట్టపగలే యువకుడిపై కత్తులతో దాడి

Atmakur Elections : ఆత్మకూరులో పోటీపై తేల్చని పార్టీలు - విక్రమ్ రెడ్డికి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థేనా ?

Atmakur Elections :  ఆత్మకూరులో పోటీపై తేల్చని పార్టీలు - విక్రమ్ రెడ్డికి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థేనా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

AP Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగులతో కీలక భేటీ - సీపీఎస్ వివాదం ఇకనైనా తేల్చుతారా, కాలయాపన చేస్తారా !

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం

Weather Updates: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మరో 4 రోజులు వర్షాలు - తెలంగాణలో పొడి వాతావరణం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!

Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!

MK Stalin With PM : తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలి - మోదీని స్టేజ్‌పైనే అడిగిన స్టాలిన్ !

MK Stalin With PM : తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలి - మోదీని స్టేజ్‌పైనే అడిగిన స్టాలిన్ !

PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం

PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం