అన్వేషించండి

ఇసుక క్వారీల వద్ద టీడీపీ ధర్నాలు- రేపు మైనింగ్ శాఖ ఆఫీస్‌ ముట్టడికి పిలుపు- పోలీసులు అప్రమత్తం

మొదటి రెండు రోజులు ఇసుక అక్రమ రీచ్‌ల వద్ద నిరసనలు తలపెట్టి తెలుగుదేశం పార్టీ 30వ తేదీన మైనింగ్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించింది.

ఇసుక అక్రమ తవ్వకాలపై తెలుగు దేశం పార్టీ తలపెట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. మొదటి రోజు జరిగిన ఆందోళనలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాలు, అమ్మకాలపై మూడు రోజుల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చింది పార్టీ అధినాయకత్వం 

మొదటి రెండు రోజులు ఇసుక అక్రమ రీచ్‌ల వద్ద నిరసనలు తలపెట్టి తెలుగుదేశం పార్టీ 30వ తేదీన మైనింగ్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగు దేశం పార్టీ శ్రేణులు రెండు రోజుల నుంచి ఇసుక క్వారీల వద్ద నిరసన తెలిపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 67 క్వారీలను గుర్తించగా 44 ప్రధాన క్వారీలలో ‘ఇసుక సత్యాగ్రహం’ కార్యక్రమం జరిగిందని టీడీపీ ప్రకటిచింది. అక్రమ అరెస్టులు, గృహ నిర్భంధాలతో ఆందోళనలు అడ్డుకునే ప్రయత్నం అధికార్ పార్టీ చేసిందని ఆరోపించింది టీడీపీ. అయినా వాటిని లెక్క చేయకుండా ఇసుక అనుమతులు, లెక్క తేల్చాలని నేతల పట్టుబట్టటంతో ప్రభుత్వం ఇరకాటంలోకి వెళ్ళిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇసుక దొంగలను అరెస్టు చేసి, ఉచిత ఇసుక విధానం తీసుకురావాలేని తెలుగు దేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.  

రోడ్డున పడుతున్న కార్మికులు...
జగన్ రెడ్డి ఇసుక దోపిడీతో 123 వృత్తులు, వ్యాపారాలు రోడ్డున పడ్డాయని తెలుగు దేశం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల నోట్లో జగన్ రెడ్డి మట్టి కొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని టీడీపీ చీప్‌ చంద్రబాబు 48 గంటల గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు దేశం పార్టీకి చెందిన శ్రేణులు రోడ్డెక్కాయి. మూడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా 2 రోజులు ఇసుక ర్యాంపుల వద్ద ప్లకార్డులు పట్టుకుని అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కొండలను తలపించేలా ఉన్న ఇసుక గుట్టలను పరిశీలించారు. 

ప్రకృతిని నాశనం చేస్తూ, పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ ఇసుక తవ్వకాలు జరిపి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. అక్రమ క్వారీలకు సంబంధించిన ఆధారాలు అంటూ మీడియాకు  చూపించారు. టెండర్లు పిలవకుండా, కొత్త ఏజెన్సీ ఎంపిక చేయకుండా, NGT విధించిన నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్, ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసుకుని అధిక ధరలకు ఇసుకను అమ్ముకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలు 
ఇసుక తవ్వకాలపై తెలుగు దేశం పార్టీ ఆందోళనకు పిలుపునివ్వటంతో ముందుగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. శ్రీకాకుళం నుంచి అనంతపుర వరకు వివిధ నియోజకవర్గాల్లో ముఖ్య నేతలందర్నీ గృహనిర్బంధం చేశారు ఇసుక క్వారీల విజిట్‌కు వెళ్ళకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఇసుక సత్యాగ్రహాల నిరసనలను తెలుగు దేశం పార్టీ ఇవాళ కూడా కొనసాగిస్తోంది. టీడీపీ పిలుపుతో రెండో రోజు కూడా వివిధ ప్రాంతాల్లో ఇసుక క్వారీలకు సమీపంలో సిబ్బందిని మోహరించారు పోలీసులు. బుధవారం మైనింగ్ శాఖ ప్రధాన కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు విజయవాడలోని అన్ని మార్గాలపై నిఘా పెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ లీడర్లు, శ్రేణులు విజయవాడ రాకుండా జాగ్రత్త పడుతున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sunita Williams Return to Earth Mission: సునీతా విలియమ్స్ టీం భూమీ మీదకు తిరుగు ప్రయాణం ప్రక్రియ ప్రారంభం - Live Video
సునీతా విలియమ్స్ టీం భూమీ మీదకు తిరుగు ప్రయాణం ప్రక్రియ ప్రారంభం - Live Video
MLAs Criminal Cases: దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు: ADR Report
దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు: ADR Report
Tirumala Tickets News: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల - పూర్తి టైమింగ్స్ ఇవే
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల - పూర్తి టైమింగ్స్ ఇవే
Telangana: ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth Biography | సునీతా విలియమ్స్ జర్నీ తెలుసుకుంటే గూస్ బంప్స్ అంతే| ABP DesamCM Revanth Reddy on Potti Sriramulu | పొట్టిశ్రీరాములకు అగౌరవం కలిగించాలనే ఉద్ధేశం లేదు | ABP DesamLeopard in Tirupati SV University  | వేంకటేశ్వర యూనివర్సిటీని వణికిస్తున్న చిరుతపులి | ABP DesamSunita Williams Return to Earth Process Explained | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చే విధానం ఇలా| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sunita Williams Return to Earth Mission: సునీతా విలియమ్స్ టీం భూమీ మీదకు తిరుగు ప్రయాణం ప్రక్రియ ప్రారంభం - Live Video
సునీతా విలియమ్స్ టీం భూమీ మీదకు తిరుగు ప్రయాణం ప్రక్రియ ప్రారంభం - Live Video
MLAs Criminal Cases: దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు: ADR Report
దేశంలో 45 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, అగ్రస్థానంలో ఏపీ ఎమ్మెల్యేలు: ADR Report
Tirumala Tickets News: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల - పూర్తి టైమింగ్స్ ఇవే
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, నేడు ఆర్జిత సేవా టికెట్లు విడుదల - పూర్తి టైమింగ్స్ ఇవే
Telangana: ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఆదాయం తగ్గి అప్పులు పెరిగినా దైర్యం కోల్పోలేదు - ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
RC16: రామ్ చరణ్ 'RC16' మూవీలో కన్నడ దివంగత నటుడి సతీమణి? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?
రామ్ చరణ్ 'RC16' మూవీలో కన్నడ దివంగత నటుడి సతీమణి? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?
Chandrabau : చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 అదుర్స్ - పూర్తి డీటైల్స్ ఇవిగో
చంద్రబాబు స్వర్ణాంధ్ర విజన్ 2047 అదుర్స్ - పూర్తి డీటైల్స్ ఇవిగో
IPL 2025 Captains Meeting: 20న ఐపీఎల్ జ‌ట్ల కెప్టెన్ల‌తో బోర్డు స‌మావేశం.. వివిధ కార్య‌క్ర‌మాల‌తో ఫుల్లు జోష్.. 22 నుంచి మెగాటోర్నీ ప్రారంభం
20న ఐపీఎల్ జ‌ట్ల కెప్టెన్ల‌తో బోర్డు స‌మావేశం.. వివిధ కార్య‌క్ర‌మాల‌తో ఫుల్లు జోష్.. 22 నుంచి మెగాటోర్నీ ప్రారంభం
Chandra Babu Latest News: హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు
హిందీ, ఇంగ్లీషు నేర్చుకుంటే తప్పేంటీ- నేరిస్తే ఢిల్లీతో కమ్యూనికేషన్ ఈజీ: ముఖ్యమంత్రి చంద్రబాబు  
Embed widget