మహారాష్ట్రలో భారీ వర్షాలు, నీట మునిగిన ముంబయి!
ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంబయి నగరంలో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. చాలా చోట్ల రోడ్లన్నీ నీట మునిగాయి. ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. అక్టోబర్ 1వ తేదీ వరకూ ఇదే స్థాయిలో వానలు పడతాయని IMD వెల్లడించింది. ఈ రెయిన్ ఎఫెక్ట్ ఫ్లైట్ సర్వీస్‌లపైనా పడింది. 14 ఫ్లైట్స్‌ని ముంబయి నుంచి మళ్లించారు. లోకల్ ట్రైన్స్ ఆగిపోయాయి. ఈ భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. ఇప్పటికే IMD ముంబయికి రెడ్ అలెర్ట్ ప్రకటించింది. 25వ తేదీ సాయంత్రం సిటీలో పలు చోట్ల 100 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అది కూడా కేవలం 5 గంటల్లోనే. అంధేరిలో ఈ ప్రభావం గట్టిగానే కనబడుతోంది. మహారాష్ట్రతోపాటు ఛండీగఢ్, తమిళనాడు, హరియాణాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉంది. అయితే..భారీ వర్షాల కారణంగా ఈ పర్యటన రద్దు చేయాల్సి వచ్చింది.