అన్వేషించండి

Postal GDS 2025: పోస్టల్‌ జీడీఎస్‌ దరఖాస్తుల సవరణకు అవకాశం, గడువు ఎప్పటివరకంటే?

India Post: తపాళాశాఖలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాల్లో తప్పులుంటే సరిచేసుకునే అవకాశాన్ని కల్పించారు. మార్చి 8 వరకు వివరాలు సరిచేసుకోవచ్చు.

GDS Application Details Correction: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 21,413 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 1,215; తెలంగాణలో 519 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు సంబంధించి మార్చి 3తో గడువు ముగిసింది. దీంతో అభ్యర్థులకు తమ వివరాల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు పోస్టల్ శాఖ అవకాశం కల్పించింది.

అభ్యర్థులు మార్చి 6 నుంచి 8 వరకు దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవచ్చు. పదో తరగతి మార్కులతో ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఉద్యోగాలకు ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.10,000 - రూ.12,000 ప్రారంభ వేతనం అందుకోవచ్చు.

దరఖాస్తుల సవరణ కోసం క్లిక్ చేయండి..

ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంటెన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.

వివరాలు..

* గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు

➥ బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం)

➥ అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం)

➥ డాక్‌ సేవక్‌

మొత్తం పోస్టుల సంఖ్య: 21,413.

తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులు: ఏపీ-1,215, తెలంగాణ-519. 

పోస్టుల కేటాయింపు: యూఆర్ (జనరల్)-9735; ఓబీసీ-4164; ఎస్సీ-2867; ఎస్టీ-2086; ఈడబ్ల్యూఎస్-1952; పీడబ్ల్యూడీ(ఎ)-178; పీడబ్ల్యూడీ(బి)-195; పీడబ్ల్యూడీ(సి)-191; పీడబ్ల్యూడీ(డిఇ)-45.

సర్కిళ్లవారీగా ఖాళీలు..

ఆంధ్రప్రదేశ్: 1215 పోస్టులు

అస్సాం: 655 పోస్టులు

బిహార్: 783 పోస్టులు

ఛత్తీస్‌గఢ్: 638 పోస్టులు 

ఢిల్లీ: 30 పోస్టులు

గుజరాత్: 1203 పోస్టులు

హర్యానా: 82 పోస్టులు

హిమాచల్ ప్రదేశ్: 331 పోస్టులు

జమ్మూకశ్మీర్: 255 పోస్టులు

జార్ఖండ్: 822 పోస్టులు

కర్ణాటక: 1135 పోస్టులు

కేరళ: 1385 పోస్టులు

మధ్యప్రదేశ్: 1314 పోస్టులు

మహారాష్ట్ర: 1,498 పోస్టులు

నార్త్-ఈస్ట్రర్న్: 1260 పోస్టులు

ఒడిశా: 1101 పోస్టులు

పంజాబ్: 400 పోస్టులు

తమిళనాడు: 2292 పోస్టులు

ఉత్తర్ ప్రదేశ్: 3004 పోస్టులు

ఉత్తరాఖండ్: 568 పోస్టులు

వెస్ట్ బెంగాల్: 923 పోస్టులు

తెలంగాణ: 519 పోస్టులు

ఎంపిక విధానం: అభ్యర్థుల పదోతరగతిలో సాధించిన మెరిట్‌లిస్ట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.

జీతభత్యాలు: నెలకు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌/ డాక్‌ సేవక్‌ పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470.

ధ్రువపత్రాల పరిశీలనకు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు..

➥ మార్కుల సర్టిఫికేట్లు

➥ ఫొటో గుర్తింపు కార్డు

➥ క్యాస్ట్ సర్టిఫికేట్

➥ PWD సర్టిఫికేట్ (దివ్యాంగులైతే)

➥ EWS సర్టిఫికేట్ 

➥ ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్

➥ పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం

➥ మెడికల్ సర్టిఫికేట్

➥ ఇతర అవసరమైన డాక్యుమెంట్లు

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.02.2025.

✦ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 03.03.2025.

దరఖాస్తుల సవరణ: 06.03.2025 - 08.03.2025.

Notification

Circlewise Vacancy Details

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం

వీడియోలు

Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌
Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Satya Nadella: భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
భారత్‌లో మైక్రోసాప్ట్ 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి -ప్రధాని మోదీతో భేటీ తర్వాత సత్యనాదెళ్ల ప్రకటన
Embed widget