Ganesh Chaturdhi 2021: వినాయకచవితి పండుగను నియంత్రించడం వెనుక వేరే అజెండా ఉంది : విష్ణు వర్థన్ రెడ్డి
ఏపీలో వినాయక చవితి వేడుకలపై వివాదం నెలకొంది. ఆంక్షలు ఎత్తివేయాలని ప్రతిపక్షాలు గళమెత్తాయి. ప్రధానంగా బీజేపీ గణేష్ చతుర్థి వేడుకలకు బహిరంగ వేడుకలకు అనుమతులు ఇవ్వాలని నిరసనలు చేపట్టింది. ఈ విషయంపై ఏపీ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ప్రైవేట్ ప్రదేశాల్లో ఐదుగురికి మించకుండా వేడుకలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అందుకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వినాయక చవితి వేడుకల వివాదంపై ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్థన్ రెడ్డి ఏబీపీ దేశంతో మాట్లాడారు. వేడుకలపై ఆంక్షలు విధించడంపై వైసీపీ ప్రభుత్వం ఉద్దేశం వేరే ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలకు, వారి వేడుకలకు లేని ఆంక్షలు హిందువుల పండుగలకే ఎందుకని ప్రశ్నించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎంపీ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, స్థానిక నేతలు వేల మందితో ర్యాలీ నిర్వహిస్తే కోవిడ్ ఆంక్షలు గుర్తురాలేదా అని ప్రశ్నించారు. చర్చలకు, రంజాన్ వేడుకలకు అడ్డురాని ఆంక్షలు వినాయక చవితికే ఎందుకని ప్రశ్నించారు.