Podu Lands Telangana: పోడు భూములకు పట్టాలు - ఈ 30న కేసీఆర్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభం
Podu Lands In Telangana: పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి జూన్ 30న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Podu Lands In Telangana: కుమ్రం భీమ్ జిల్లాలో ప్రారంభించనున్న కేసీఆర్ - నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల ప్రారంభం
ఆసిఫాబాద్: పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో జూన్ 30వ తేదీ నుంచి ఆదివాసీ గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి అదే రోజు (జూన్ 30)న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు. పోడు పట్టాల పంపిణీ చేశాక.. వీరికి కూడా రైతుబంధు అందించనున్నారు. ఈ నెల 24 నుంచే పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాలతో ఈ నెల 30 తేదీన పట్టాలు ఇవ్వాలని రీ షెడ్యూల్ చేశారు. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం, అందుకు సంబంధించి నిన్న ఇవ్వాల జిల్లా కలెక్టర్లకు శిక్షణాతరగుతులు నిర్వహస్తుండడం.. అదే సందర్భంలో ఈ నెల 29న బక్రీద్ పండుగ కూడా ఉన్నాయి. ఈ కారణాలతో తొలుత ప్రకటించిన కార్యక్రమాన్నిజూన్ 30కి మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 30వ తేదీ నుంచి రాష్ట్రంలోని గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి @TSwithKCR నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో 30వ తేదీన ప్రారంభిస్తారు. #Asifabad pic.twitter.com/YiEfv7UlWc
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) June 24, 2023
జూన్ 30న నూతనంగా నిర్మితమైన ఆసిఫాబాద్ జిల్లా సమికృత కలెక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని నిర్మల్ మంచిర్యాల జిల్లాల కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించారు. తాజాగా మిగిలిన ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాన్ని ఈనెల 30న ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొననున్నారు.
పోడు పట్టాలు పొందిన వారికి సాధారణ రైతుల మాదిరిగానే రైతు బంధు పథకం కింద ఆర్థిక సాయం అందించాలని సీఎం కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్‌ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతు బంధును జమ చేస్తుందని తెలిపారు. పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు అకౌంట్ల వివరాలను ఆర్థిక శాఖకు అందజేయాలని, దానిపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను, ఆ శాఖ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4లక్షల ఎకరాలకు పైగా 1.55 లక్షల మంది గిరిజనులకు పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయిలో పరిశీలన జరిగింది. ఇందుకు సంబంధించి పట్టాలను కూడా అధికారులు సిద్ధం చేశారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial