News
News
X

Crime: గచ్చిబౌలిలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

Crime:గచ్చిబౌలిలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేఘాలయ రాష్ట్రానికి చెందిన మహాత్మా గాంధీ యూనివర్శిటీ సర్టిఫికెట్లను ఈ ముఠా చలామణి చేస్తోంది.

FOLLOW US: 
 

Crime:  హైదరాబాద్ గచ్చిబౌలిలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేఘాలయ రాష్ట్రానికి చెందిన మహాత్మా గాంధీ యూనివర్శిటీ సర్టిఫికెట్లను ఈ ముఠా మార్కెట్ లో చలామణి చేస్తోంది. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఈ సర్టిఫికెట్ల విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఈ కుంభకోణంలో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మహాత్మాగాంధీ యూనివర్శిటీలో డైరెక్టరుగా ఉన్న మిల్లి గోయల్.. క్లర్కుగా పనిచేస్తున్న శివనిలు పరారీలో ఉన్నట్లు చెప్పారు. మొత్తం 430 మంది విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు నిందితులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. దీని కోసం ఒక్కో విద్యార్థి నుంచి లక్షా 50 వేల నుంచి రూ. 2 లక్షల 50 వేల వరకు వసూలు చేేసినట్లు పేర్కొన్నారు. ఈ దందా 5 సంవత్సరాలుగా జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. ముఖ్యంగా బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ, బీఎస్పీ కంప్యూటర్స్ లాంటి కోర్సుల విద్యార్థులు ఈ నకిలీ సర్టిఫికెట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు.

నిందితుల నుంచి యూనివర్శిటీకి సంబంధించిన సర్టిఫికెట్లు, ల్యాప్ టాప్, స్టాంపులు, రూ. 50 వేల నగదు, 7 మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంక్ అకౌంట్ లో ఉన్న రూ. 37 లక్షల 50 వేలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

News Reels

Published at : 15 Nov 2022 04:38 AM (IST) Tags: Hyderabad crime news Hyderabad News Mahatma Gandhi University Gachhibowi fake certificates fake certificates gang in gachhibowli

సంబంధిత కథనాలు

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Mancherial News : దళిత బంధు రావాలంటే ఎంపీపీ భర్తతో గడపాలి, వివాహితకు భర్త వేధింపులు!

Mancherial News :  దళిత బంధు రావాలంటే ఎంపీపీ భర్తతో గడపాలి, వివాహితకు భర్త వేధింపులు!

YS Sharmila : 4 గంటలుగా రోడ్డుపైనే వైఎస్ షర్మిల దీక్ష, విజయమ్మను అడ్డుకున్న పోలీసులు!

YS Sharmila :  4 గంటలుగా రోడ్డుపైనే వైఎస్ షర్మిల దీక్ష, విజయమ్మను అడ్డుకున్న పోలీసులు!

Woman Kidnap Case: యువతి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్ - సేఫ్‌గా ఉన్నానని తండ్రికి ఫోన్, తరువాత ఏమైందంటే !

Woman Kidnap Case: యువతి కిడ్నాప్ కేసులో మరో ట్విస్ట్ - సేఫ్‌గా ఉన్నానని తండ్రికి ఫోన్, తరువాత ఏమైందంటే !

Bandi Sanjay On BRS : బీఆర్ఎస్ అంటే బందిపోట్ల సమితి, ఆవిర్భావ సభ కాదు సంతాప సభ- బండి సంజయ్

Bandi Sanjay On BRS : బీఆర్ఎస్ అంటే బందిపోట్ల సమితి, ఆవిర్భావ సభ కాదు సంతాప సభ-  బండి సంజయ్

టాప్ స్టోరీస్

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ

Woman Kidnap Case:యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ - నిందితుడితో గతంలోనే పరిచయం, పెళ్లికి నో చెప్పడంతో రచ్చరచ్చ