అన్వేషించండి

SRH Vs RR, IPL 2022 LIVE: SRH ఎక్కడ ఆపేసిందో అక్కడ్నుంచే మొదలెట్టింది! RR చేతిలో 61 రన్స్‌ తేడాతో ఓటమి

IPL 2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad), రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) తలపడుతున్నాయి. మరి ఈ రెండింట్లో ఎవరిపై ఎవరిది పై చేయి?

LIVE

Key Events
SRH Vs RR, IPL 2022 LIVE: SRH ఎక్కడ ఆపేసిందో అక్కడ్నుంచే మొదలెట్టింది! RR చేతిలో 61 రన్స్‌ తేడాతో ఓటమి

Background

IPL 2022, SRH vs RR preview: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు (IPL 2022) ఐదో మ్యాచులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad), రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) తలపడుతున్నాయి. మహారాష్ట్రలోని పుణె ఇందుకు వేదిక. గతేడాది ఘోర ఓటములతో హైదరాబాద్‌ అభిమానులను నిరాశపరిచింది. మరోవైపు ఎంటర్‌టైన్‌ చేయడంలో తిరుగులేని రాజస్థాన్‌ ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది. మరి ఈ రెండింట్లో ఎవరిపై ఎవరిది పై చేయి? ఎవరి బ్యాటింగ్‌ లైనప్‌ ఎలా ఉంది? ఎవరి బౌలింగ్‌ లైన్‌ మెరుగ్గా ఉంది?

RR, SRH సమవుజ్జీలే

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌లో(SRH vs RR) ఒకరు ఎక్కువా కాదు! ఇంకొకరు తక్కువా కాదు! రెండు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 15 సార్లు ఐపీఎల్‌లో తలపడితే రాజస్థాన్‌ 7 సార్లు గెలిచింది. సన్‌రైజర్స్‌ 8 సార్లు విజయం సాధించింది. చివరిగా తలపడ్డ ఐదు మ్యాచుల్లో రాజస్థాన్ మూడు గెలిస్తే హైదరాబాద్‌ రెండే గెలిచింది. గత సీజన్లో చెరోటి గెలిచారు.

Sanju Samson, Jos Buttler దబిడి దిబిడే

* 2020 నుంచి ఐపీఎల్‌లో కేవలం ఐదుగురు బ్యాటర్లు మాత్రమే 40 ప్లస్‌ సగటు, 140 ప్లస్‌ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశారు. అందులో ఇద్దరు రాజస్థాన్‌లోనే ఉన్నారు. కెప్టెన్‌ సంజు శాంసన్‌ 54. 50 సగటు, 145 స్ట్రైక్‌రేట్‌తో అదరగొట్టగా జోస్‌ బట్లర్‌ 43 సగటు, 159 స్ట్రైక్‌రేట్‌తో దంచికొట్టాడు.

* ఐపీఎల్‌ పవర్‌ప్లేలో అత్యంత విజయవంతమైన సీమర్‌, స్పిన్నర్‌ రాజస్థాన్‌లోనే ఉన్నారు. ఐపీఎల్‌ 2020 నుంచి ట్రెంట్‌ బౌల్ట్‌ (21 వికెట్లు), అశ్విన్‌ (8 వికెట్లు) మించి పవర్‌ప్లేలో ఇంకెవ్వరూ రాణించలేదు.

* సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దాదాపుగా 2021 బౌలింగ్‌ లైనప్‌నే తీసుకుంది. వీరిపై దేవదత్‌ పడిక్కల్‌కు మెరుగైన రికార్డులేదు. 94.21 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు.

RR, SRH Probable XI

రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, దేవదత్‌ పడిక్కల్‌, సంజు శాంసన్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, రియాన్‌ పరాగ్‌, జేమ్స్‌ నీషమ్‌ / నేథన్‌ కౌల్టర్‌ నైల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: రాహుల్‌ త్రిపాఠి, అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌, నికోలస్‌ పూరన్‌, అయిడెన్‌ మార్క్‌క్రమ్, అబ్దుల్‌ సమద్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మార్కో జెన్‌సన్‌ / రొమారియో షెఫర్డ్‌, భువనేశ్వర్ కుమార్‌, టి.నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌

23:12 PM (IST)  •  29 Mar 2022

20 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 149-7

SRH Vs RR, IPL 2022 LIVE Updates: రియాన్‌ 15 పరుగులు ఇచ్చాడు. మార్క్‌క్రమ్‌ (57)అజేయ హాఫ్‌ సెంచరీ చేశాడు. భువీ (3) అతడికి అండగా ఉన్నాడు. మొత్తంగా సన్‌రైజర్స్‌ 61 పరుగుల తేడాతో ఓడింది.

23:00 PM (IST)  •  29 Mar 2022

18 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 119-6

SRH Vs RR, IPL 2022 LIVE Updates: ప్రసిద్ధ్‌ 14 పరుగులు ఇచ్చాడు. ఆఖరి రెండు బంతుల్ని మార్‌క్రమ్‌ (44) 6, 4గా మలిచాడు, సుందర్‌ (20) అతడికి తోడుగా ఉన్నాడు.

22:55 PM (IST)  •  29 Mar 2022

17 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 105-6

SRH Vs RR, IPL 2022 LIVE Updates: కౌల్టర్‌నైట్‌ చెత్త బౌలింగ్‌ చేశాడు. 24 పరుగులు చేశాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (27) వరుసగా 6, 4, 4, 2, 4, 4తో అలరించాడు. మార్‌క్రమ్‌ (32) మరో ఎండ్‌లో ఉన్నాడు.

22:50 PM (IST)  •  29 Mar 2022

16 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 81-6

SRH Vs RR, IPL 2022 LIVE Updates: చాహల్‌ 4 పరుగులు ఇచ్చి వికెట్‌ తీశాడు. వాషింగ్టన్‌ (3), మార్‌క్రమ్‌ (32) క్రీజులో ఉన్నారు.

22:40 PM (IST)  •  29 Mar 2022

14 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 72-5

SRH Vs RR, IPL 2022 LIVE Updates: కౌల్టర్‌నైల్‌ 17 పరుగులు ఇచ్చాడు. ఆఖరి రెండు బంతుల్ని షెఫర్డ్‌ (21) సిక్సర్లు బాదేశాడు. మార్‌క్రమ్‌ (29) మరో ఎండ్‌లో ఉన్నాడు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Students Protest WalK: చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
CM Chandrababu: దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి,  ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి, ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
ఏపీకి రూ.446 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్‌ శాఖలకు కేటాయింపు
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Students Protest WalK: చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
చెప్పులు లేకుండా 18 కిలోమీటర్లు నడిచి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గురుకుల విద్యార్థులు
CM Chandrababu: దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి,  ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
దేశగతిని మార్చిన వాజ్‌పేయి దూరదృష్టి, ఆయన ఆలోచన తీరు విలక్షణమైనది: చంద్రబాబు
Jr NTR: అభిమాని ఆస్పత్రి బిల్స్ అన్నీ క్లియర్ చేసిన తారక్... ఇప్పుడైనా విమర్శలు ఆపేస్తారా?
అభిమాని ఆస్పత్రి బిల్స్ అన్నీ క్లియర్ చేసిన తారక్... ఇప్పుడైనా విమర్శలు ఆపేస్తారా?
Viral Video: సెక్స్ వర్కర్‌తో ఓ రోజు గడిపిన ఇన్‌ఫ్లూయన్సర్స్ - ఆ పని  కోసం కాదు - వీడియో చూస్తే శభాష్ అంటారు !
సెక్స్ వర్కర్‌తో ఓ రోజు గడిపిన ఇన్‌ఫ్లూయన్సర్స్ - ఆ పని కోసం కాదు - వీడియో చూస్తే శభాష్ అంటారు !
Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Embed widget