By : ABP Desam | Updated: 01 Apr 2022 10:42 PM (IST)
KKR vs PBKS, IPL 2022 LIVE: 15 ఓవర్లో వరుసగా రెండు బంతుల్ని ఆండ్రీ రసెల్ (70) వరుసగా రెండు సిక్సర్లు బాదేసి విజయం అందించాడు. బిల్లింగ్స్ (24) అతడికి అండగా నిలిచాడు. 14.3 ఓవర్లకే 138ని ఛేదించేశాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: అర్షదీప్ 14 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో రసెల్ (58) ఒక బౌండరీ, ఒక సిక్సర్ బాదేసి హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. బిల్లింగ్స్ (23) అతడికి తోడుగా ఉన్నాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: రాహుల్ చాహర్ 5 పరుగులు ఇచ్చాడు. బౌండరీలేమీ రాలేదు. రసెల్ (46), బిల్లింగ్స్ (22) నిలకడగా ఆడారు.
KKR vs PBKS, IPL 2022 LIVE: ఒడీన్ స్మిత్‌కు రసెల్ (44) చుక్కలు చూపించాడు. మూడు సిక్సర్లు, ఒక బౌండరీ బాదేశాడు. ఆఖరి బంతికి బిల్లింగ్స్ (20) సిక్స్ కొట్టాడు. దాంతో మొత్తం 30 పరుగులు వచ్చాయి.
KKR vs PBKS, IPL 2022 LIVE: రాహుల్ చాహర్ 6 పరుగులు ఇచ్చాడు. ఆండ్రీ రసెల్ (21), బిల్లింగ్స్ (14) నిలకడగా ఆడుతున్నారు.
KKR vs PBKS, IPL 2022 LIVE: హర్‌ప్రీత్ బ్రార్‌కు రసెల్ (17) తన మజిల్ పవర్ చూపించాడు. రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. బిల్లింగ్స్ (12) అతడికి తోడుగా ఉన్నాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: రాహుల్ చాహర్ మరోసారి టైట్ బౌలింగ్ చేశాడు. కేవలం 2 పరుగులే ఇచ్చాడు. బిల్లింగ్స్ (11), రసెల్ (2) నిలకడగా ఆడుతున్నారు.
KKR vs PBKS, IPL 2022 LIVE: హర్‌ప్రీత్ 3 పరుగులు ఇచ్చాడు. ఆండ్రీ రసెల్ (1), బిల్లింగ్స్ (10) నిలకడగా ఆడుతున్నాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: రాహుల్ చాహర్ అద్భుతం చేశాడు. వరుసగా రెండు వికెట్లు తీశాడు. పరుగులేమీ ఇవ్వలేదు. నాలుగో బంతికి శ్రేయస్ (26), ఆరో బంతికి నితీశ్ రాణా (0) ఔటయ్యాడు. బిల్లింగ్స్ (8) నిలకడగా ఆడుతున్నాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: రబాడా 9 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని శ్రేయస్ (26) బౌండరీకి పంపించాడు. బిల్లింగ్స్ (8) అతడికి తోడుగా ఉన్నాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: ఒడీన్ స్మిత్ 9 పరుగులిచ్చి వికెట్ తీశాడు. మూడో బంతికి వెంకటేశ్ అయ్యర్ (3)ను ఔట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ (21), శామ్ బిల్లింగ్స్ (4) చెరో బౌండరీ బాదేశారు.
KKR vs PBKS, IPL 2022 LIVE: రబాడా 8 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతికి శ్రేయస్ (16) బౌండరీకి పంపించాడు. వెంకటేశ్ (3) సింగిల్ తీశాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: అర్షదీప్ 11 పరుగులు ఇచ్చాడు. విడ్త్ దొరకడంతో ఆఖరి రెండు బంతుల్ని శ్రేయస్ అయ్యర్ (9) బౌండరీకి పంపించాడు. వెంకటేశ్ (2) నిలకడగా ఆడుతున్నాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: రబాడా 6 పరుగులిచ్చి వికెట్ తీశాడు. ఆఖరి బంతిని ఆడబోయిన రహానె (12) స్లిప్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. వెంకటేశ్ (1) క్రీజులో ఉన్నాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: అర్షదీప్ 8 పరుగులు ఇచ్చాడు. రెండు బౌండరీలు బాది అజింక్య రహానె (8) ఐపీఎల్‌లో 4000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్ (0) ఇంకా ఖాతా తెరవలేదు.
KKR vs PBKS, IPL 2022 LIVE: ఆండ్రీ రసెల్ వేసిన 18.1వ బంతికి రబాడా (25) ఔటయ్యాడు. సౌథీ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత బంతికే అర్షదీప్ (0) రనౌట్ అయ్యాడు. దాంతో పంజాబ్ ఆలౌటైంది.
KKR vs PBKS, IPL 2022 LIVE: శివమ్ మావి 17 పరుగులు ఇచ్చాడు. రబాడా (25) రెండు బౌండరీలు, స్మిత్ (9) ఒక సిక్స్ బాదేశాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: సౌథీ 16 పరుగులు ఇచ్చాడు. రబాడా (16) వరుసగా 4,4,6 బాదేశాడు. స్మిత్ (3) తోడుగా ఉన్నాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: ఉమేశ్ యాదవ్ అద్భుతం చేశాడు. రెండు వికెట్లు తీసి మెయిడిన్ ఓవర్ వేశాడు. రెండో బంతికి హర్‌ప్రీత్ (14), నాలుగో బంతికి రాహుల్ చాహర్ (0)ను ఔట్ చేశాడు. మొత్తంగా తన నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: నరైన్ 5 పరుగులు ఇచ్చాడు. ఒడీన్ స్మిత్ (2), హర్‌ప్రీత్ (14) ఆచితూచి ఆడుతున్నారు.
KKR vs PBKS, IPL 2022 LIVE: సౌథీ 5 పరుగులిచ్చి వికెట్ తీశాడు. నాలుగో బంతిని హర్‌ప్రీత్ (12) బౌండరీకి పంపించాడు. ఒడీన్ స్మిత్ (1) పరుగుల ఖాతా ఆరంభించాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: నరైన్ బౌలింగ్‌లో 6 పరుగులు వచ్చాయి. తొలి ఐదు బంతులకు హర్‌ప్రీత్ (8) ఇబ్బంది పడ్డాడు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టాడు. షారుఖ్ (0) ఇంకా ఖాతా తెరవలేదు.
KKR vs PBKS, IPL 2022 LIVE: వరుణ్ చక్రవర్తి 1 పరుగే ఇచ్చాడు. షారుఖ్ (0), హర్‌ప్రీత్ (2) నిలకడగా ఆడుతున్నారు.
KKR vs PBKS, IPL 2022 LIVE: సునిల్ నరైన్ 7 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. మూడో బంతికి రాజ్ బవా (11)ను ఔట్ చేశాడు. షారుఖ్ ఖాన్ (0), హర్‌ప్రీత్ బ్రార్ (1) క్రీజులో ఉన్నారు.
KKR vs PBKS, IPL 2022 LIVE: ఉమేశ్ యాదవ్ 8 పరుగులిచ్చి వికెట్ తీశాడు. ఆఖరి బంతికి సిక్సర్ కొట్టబోయిన లివింగ్‌స్టన్ (19) సౌథీకి క్యాచ్ ఇచ్చాడు. రాజ్ బవా (5) నిలకడగా ఆడుతున్నాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: నరైన్ వచ్చాడు. 5 పరుగులు ఇచ్చాడు. రాజ్ బవా (3), లివింగ్‌స్టన్ (14) ఆచితూచి ఆడుతున్నారు.
KKR vs PBKS, IPL 2022 LIVE: వరుణ్ చక్రవర్తి 3 పరుగులు ఇచ్చాడు. లివింగ్‌స్టన్ (12), రాజ్ బవా(1) నిలకడగా ఆడుతున్నారు.
KKR vs PBKS, IPL 2022 LIVE: టిమ్ సౌథీ 11 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఆఫ్ సైడ్ దూరంగా వేసిన బంతిని ఆడబోయిన శిఖర్ ధావన్ (16) కీపర్ షెల్డన్ జాక్సన్‌కు క్యాచ్ ఇచ్చాడు. రాజ్ బవా(౦), లివింగ్‌స్టన్ (10) బ్యాటింగ్ చేస్తున్నారు.
KKR vs PBKS, IPL 2022 LIVE: వరుణ్ చక్రవర్తి 8 పరుగులు ఇచ్చాడు. ధావన్ (12), లివింగ్‌స్టన్ (4) నిలకడగా ఆడుతున్నాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: శివమ్ మావి 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. రాజపక్స (31; 9 బంతుల్లో 3x4, 3x6) వరుసగా 4, 6,6,6 కొట్టాడు. ఆ తర్వాత ఔటయ్యాడు. ధావన్ (10) మరో ఎండ్‌లో ఉన్నాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: ఉమేశ్ యాదవ్ 14 పరుగులు ఇచ్చాడు. రాజపక్స (10) బౌండరీ బాదేశాడు. శిఖర్ ధావన్ (10) ఒక సిక్సర్ కొట్టాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: టిమ్ సౌథీ 5 పరుగులే ఇచ్చాడు. ఆఖరి బంతికి రాజపక్స (4) బౌండరీ బాదేశాడు. ధావన్ (2) క్రీజులో ఉన్నాడు.
KKR vs PBKS, IPL 2022 LIVE: ఉమేశ్ యాదవ్ అదరగొట్టాడు. 2 పరుగులే ఇచ్చితొలి ఓవర్ ఆఖరి బంతికి మయాంక్ అగర్వాల్ (1)ని ఎల్బీ చేశాడు. శిఖర్ ధావన్ (1), భానుక రాజపక్స క్రీజులో ఉన్నారు.
KKR vs PBKS, IPL 2022 LIVE: అజింక్య రహానె, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, శ్రేయస్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి
KKR vs PBKS, IPL 2022 LIVE: మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టన్, భానుక రాజపక్స, షారుఖ్ ఖాన్, ఒడీన్ స్మిత్, రాజ్ బవా, అర్షదీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కాగిసో రబాడా, రాహుల్ చాహర్
IPL 2022, PBKS vs KKR: ఐపీఎల్ 2022 ఎనిమిదో మ్యాచులో కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knightriders), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తలపడుతున్నాయి. ఈ మ్యాచుకు వాంఖడే వేదిక. 206 టార్గెట్‌ను ఊడ్చేసిన పంజాబ్ జోరు మీదుంటే రెండో మ్యాచులో పరాజయంతో కోల్‌కతాలో పట్టుదల మరింత పెరిగింది. మరి వీరిద్దరిలో ఎవరు బెస్ట్? ఎవరిపై ఎవరిది పై చేయి? ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు.
KKRదే పైచేయి
ఇండియన్ ప్రీమియర్ లీగులో (IPL) పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు (PBKS vs KKR) తిరుగులేని ఆధిపత్యం ఉంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 29 సార్లు తలపడగా కేకేఆర్ ఏకంగా 19 సార్లు గెలిచింది. పంజాబ్ 10 విజయాలకే పరిమితమైంది. రీసెంట్‌గా ఆడిన ఆఖరి ఐదింట్లోనూ 3-2తో కేకేఆర్‌దే పైచేయి. అయితే గతేడాది చెరో మ్యాచ్ గెలిచారు.
హిట్టర్లదే రాజ్యం!
PBKS vs KKR Probable Teams
కోల్‌కతా నైట్‌రైడర్స్: వెంకటేశ్ అయ్యర్, అజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్, ఆండ్రీ రసెల్ / చామిక కరుణరత్నె /మహ్మద్ నబీ, సునిల్ నరైన్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, రాజ్‌బావా, షారుఖ్ ఖాన్, ఓడీన్ స్మిత్, హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, కాగిసో రబాడా, రాహుల్ చాహర్
Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !
YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి
10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!
Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!