By: ABP Desam | Updated at : 23 May 2023 07:28 PM (IST)
మహేంద్ర సింగ్ ధోని - హార్ధిక్ పాండ్యా ( Image Source : CSK Twitter )
GT vs CSK Live: ఐపీఎల్ - 16 ఆఖరి దశకు చేరింది. నేటి నుంచే ప్లేఆఫ్స్ షెడ్యూల్‌లో భాగంగా చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ మధ్య ఫస్ట్ క్వాలిఫయర్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదలు బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
గెలిచిన జట్టు ఫైనల్‌కు..
డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌కు ఇది వరుసగా రెండో ప్లేఆఫ్స్ కాగా మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇది 14 సీజన్లలో 12వ ప్లేఆఫ్స్. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు ఈ సీజన్‌లో 3 మ్యాచ్‌లు జరుగగా మూడుసార్లు గుజరాత్ టైటాన్స్‌దే విజయం. మరి ఈసారైనా ధోనీ సేన లెక్క సరిచేస్తుందో లేదో చూడాలి.
ఇరు జట్లకూ ఈ మ్యాచ్ కీలకం. చెపాక్‌లో గెలిచిన విజేత నేరుగా మే 28 (ఆదివారం) జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు మే 24న ఎలిమినేటర్ (లక్నో సూపర్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్) మ్యాచ్ విజేతతో మే 26న రెండో క్వాలిఫయర్ ఆడనుంది. అయితే గత సీజన్‌లో పేలవ ప్రదర్శనతో 9వ స్థానంలో నిలిచి ఈసారి అత్యద్భుత ఆటతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన సీఎస్కే.. తాలా(ధోని)కు విజయంతో ట్రీట్ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. ఇక ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడి ఏకంగా పది విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచిన గుజరాత్‌ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీళ్లేదు. ఆ జట్టులో అందరూ ఆపద్భాంధవులే.
జీటీ బౌలింగ్ వర్సెస్ సీఎస్కే బ్యాటింగ్..
చెపాక్ పిచ్ కామన్‌గానే స్పిన్‌కు అనుకూలం. ఛేదనలో బంతి మరింత స్లో అయ్యే ఈ పిచ్ గురించి ధోనికి అణువణువూ ఐడియా ఉంది. కానీ జీటీకి రషీద్ ఖాన్, నూర్ అహ్మద్‌ల రూపంలో స్టార్ స్పిన్నర్లున్నారు. స్లోపిచ్‌లపై చెలరేగే మోహిత్ శర్మ కూడా ఆ జట్టు సొంతం. ఈ నేపథ్యంలో జీటీ బౌలింగ్ వర్సెస్ చెన్నై బ్యాటింగ్ మధ్య రసవత్తర పోరు జరుగనుంది.
🚨 Toss Update 🚨@gujarat_titans win the toss and elect to field first against @ChennaiIPL.
— IndianPremierLeague (@IPL) May 23, 2023
Follow the match ▶️ https://t.co/LRYaj7cLY9 #TATAIPL | #Qualifier1 | #GTvCSK pic.twitter.com/Bhj5g0Gv30
తుది జట్లు :
చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దసున్ శనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండె, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ
ODI World Cup: భారత్‌కు వస్తానని మాటివ్వు షేర్‌ఖాన్ - పీసీబీ వద్దకు ఐసీసీ పెద్దలు!
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!