Chandrababu: నిండా ముంచిన చిట్ ఫండ్ సంస్థ - రోడ్డుపై బాధితుల్ని చూసి ఆగిన చంద్రబాబు - న్యాయం చేస్తామని హామీ
Andhra Pradesh: ఓ చిట్ ఫండ్ కంపెనీ మోసం చేయడంతో బాధితులు చంద్రబాబును కలిశారు. కరకట్ట రోడ్డు మీద ఉన్న వారిని చూసి చంద్రబాబు కాన్వాయ్ ఆపి మరీ పలకరించారు.

Chit fund company Victims: పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సాయి సాధన చిట్‌ఫండ్స్ బాధితులను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ చిట్ ఫండ్ కంపెనీ నిర్వాహకులు 250 కోట్ల వరకూ వసూలు చేసి బోర్డు తిప్పేశారు. తాము దివాలా తీశామని కోర్టులో లొంగిపోయారు. అయితే ప్రజల్ని మోసం చేసిన వాళ్లు.. కోర్టులో లొంగిపోయామంటే సరిపోదని బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తమ గోడును చెప్పుకునేందుకు సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు కరకట్ట వద్దకు వచ్చారు. వారిని చూసి కరకట్ట పై కాన్వాయ్ ఆపి బాధితులతో మాట్లాడిన సిఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. సాయి సాధన చిట్ ఫండ్ లో జరిగిన మోసాన్ని సిఎం కి వి బాధితులు వివరించారు. సుమారు 250 కోట్లకు పైగా మోసం చేసినట్లు తెలిపారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.
సచివాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో ఉండవల్లి నివాసం వద్దకు తరలివచ్చిన చిట్ ఫండ్ బాధితులను చూసి వారి వద్దకు వెళ్లాను. సాయి సాధన అనే చిట్ ఫండ్ సంస్థ తమను మోసం చేసిందని నరసరావుపేటకు చెందిన బాధితులు చెప్పారు. సుమారు 600 మంది ఈ ఘటనలో నష్టపోయారు. కష్టపడి సంపాదించుకుని దాచుకున్న… pic.twitter.com/VJgoVuQJxT
— N Chandrababu Naidu (@ncbn) March 3, 2025
సాయిసాధన చిట్ ఫండ్స్ మోసం కారణంగా దాదాపు 600 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని వారు కన్నీరు పెట్టుకున్నారు. సాయి సాధన చిట్ ఫండ్ ను పాలడుగు పుల్లారావు ్నే వ్యక్తి నిర్వహిస్తున్నారు. వందల కోట్లు చీటీలు కట్టించుకున్నారు. చిట్ పాడుకున్న వారికి ఇవ్వకుండా అధిక వడ్డీలకు ఆశ చూపి తన వద్దనే ఉంచుకున్నారు. తర్వాత బోర్డు తిప్పేసి.. అజ్జాతంలోకి వెళ్లిపోయారు. జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కొంత మంది కోర్టును ఆశ్రయించారు. చివరికి పాలడుగు పుల్లారావు కోర్టులో లొంగిపోయారు. జైలుకు వెళ్లారు.
కేసులు పెట్టారు అయిపోయింది.. ఇక న్యాయపరంగా తేల్చుకుందామని చిట్ ఫండ్ వర్గాలంటున్నాయి. కోర్టు కేసుల్లో పడితే డబ్బులు తిరిగి రావన్న ఆందోళనతో వారంతా చంద్రబాబును ఆశ్రయించారు.
ఏపీలో ప్రైవేటు చిట్ ఫండ్ కంపెనీల మోసాలు పెరిగిపోతున్నాయి. గతంలోనూ పలు కంపెనీలు మోసం చేయడంతో వాటి ఆస్తులు అమ్మి న్యాయం చేశారు. ఇప్పుడు సాయిసాధన చిట్ ఫండ్ కంపెనీ యాజమానులు., వాటా దార్ల ఆస్తులను అమ్మి అయినా న్యాయం చేయాలని అనుకుంటున్నారు. చిట్ ఫండ్ కాకపోయినా వేల మంది దగ్గర డిపాిజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్ వంటి సంస్థల్లో డబ్బులు పెట్టి మోసపోయిన వారికి త్వరలో ఆస్తులు వేలం వేసి నగదు చెల్లించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో తమకూ మేలు చేస్తారని సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు నమ్మకంతో ఉన్నారు.





















