అన్వేషించండి

India vs Bangladesh 1st Test Day 3: బంగ్లా ముందు కొండంత లక్ష్యం పోరాడుతారా, కూలబడిపోతారా

India vs Bangladesh 1st Test Day 3: భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. భారత్ ఆధిక్యం 514 పరుగులకు చేరిన డిక్లేర్ చేయటంతో బంగ్లాదేశ్‌ ఎదుట 515 పరుగుల భారీ లక్ష్యం కనిపిస్తోంది.

India vs Bangladesh 1st Test Day 3 :చెన్నై వేదికగా జరుగుతున్న  తొలి టెస్టు పూర్తిగా భారత చేతుల్లోకి వచ్చేసింది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసిన టీమిండియా.. ఆ తర్వాత బంగ్లాను చుట్టేసింది. అనంతరం బంగ్లాకు ఫాలో ఆన్ ఆడే అవకాశం ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు... భారీ స్కోరు సాధించింది. రిషభ్ పంత్ మాస్ బ్యాటింగ్ కు... శుభ్ మన్ గిల్ క్లాస్ ఇన్నింగ్స్ తోడు కావడంతో భారత్ రెండో ఇన్నింగ్సులో కూడా భారీ స్కోరు చేసింది. పంత్, గిల్ శతక గర్జన చేయడంతో రెండో ఇన్నింగ్స్ ను నాలుగు వికెట్ల నష్టానికి 287 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుని బంగ్లా దేశ్ ముందు భారత జట్టు 515 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.భారత బౌలర్లు రాణిస్తున్న వేళ ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడం బంగ్లాదేశ్ కు చాలా కష్టమే. ఇంకో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న వేళ ఫలితం రావడం అయితే ఖాయమే. అయితే బంగ్లాదేశ్ పోరాడుతుందా... లేదా భారత బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలుతుందా అన్నదే తేలాల్సి ఉంది.

పంత్ జోరు... గిల్ హుషారు

చెన్నై టెస్టులో బంగ్లాదేశ్‌కు 515 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేసింది. 287 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలు చేశారు. గిల్ 119 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గిల్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. కీపర్ బ్యాట్స్‌మెన్ పంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. 128 బంతులు ఎదుర్కొని 109 పరుగులు చేశాడు. పంత్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 19 బంతులు ఎదుర్కొని 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చేతులెత్తేసిన బంగ్లా బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బౌలర్లు భారత బౌలర్ల ధాటికి ఏమీ చేయలేకపోయారు. మెహదీ హసన్ మిరాజ్ 25 ఓవర్లలో 103 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా చెరో వికెట్ తీశారు.తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌటైన బంగ్లాదేశ్.... ఈ కొండంత లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తుందేమో చూడాలి.

బుమ్రా-సిరాజ్ తో ముప్పే..

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. బుమ్రా 4 వికెట్లు తీశాడు. 11 ఓవర్లలో 50 పరుగులు ఇచ్చాడు. ఆకాశ్ దీప్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా కూడా 2 వికెట్లు తీశాడు. భారత బౌలర్లు లయ అందిపుచ్చుకున్న వేళ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం బంగ్లాదేశ్ కు అంత సులభం కాదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi in US: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
Telugu Indian Idol Season 3 Winner: ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Bigg Boss 8 Telugu Elimination 3rd week: బిగ్ బాస్‌ని తిడితే ఊరుకుంటారా... నిజంగా బయటకు గెంటేస్తున్నారు, ఈ వారం ఎలిమినేషన్ ఇతడిదే!
బిగ్ బాస్‌ని తిడితే ఊరుకుంటారా... నిజంగా బయటకు గెంటేస్తున్నారు, ఈ వారం ఎలిమినేషన్ ఇతడిదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pant Equals MS Dhoni Test Centuries | ఎంఎస్ ధోని సెంచరీల రికార్డును సమం చేసిన పంత్ | ABP DesamAP Govt Permission Devara Special Shows | ఏపీలో దేవర స్పెషల్ షోలకు స్పెషల్ పర్మిషన్ | ABP Desamఅయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi in US: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
Telugu Indian Idol Season 3 Winner: ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Bigg Boss 8 Telugu Elimination 3rd week: బిగ్ బాస్‌ని తిడితే ఊరుకుంటారా... నిజంగా బయటకు గెంటేస్తున్నారు, ఈ వారం ఎలిమినేషన్ ఇతడిదే!
బిగ్ బాస్‌ని తిడితే ఊరుకుంటారా... నిజంగా బయటకు గెంటేస్తున్నారు, ఈ వారం ఎలిమినేషన్ ఇతడిదే!
Pawan Kalyan Deeksha: భగవంతుడా మమ్మల్ని క్షమించు! పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
భగవంతుడా మమ్మల్ని క్షమించు! పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Duleep Trophy 2024: దులీప్‌ ట్రోఫీలో తెలుగు తేజం దూకుడు, రెండో సెంచరీకి అడుగు దూరంలో రికీ భుయ్
దులీప్‌ ట్రోఫీలో తెలుగు తేజం దూకుడు, రెండో సెంచరీకి అడుగు దూరంలో రికీ భుయ్
Embed widget