News
News
X

Hardik Natasa White Wedding: నటాషాతో మళ్లీ పెళ్లి- వైరల్ గా మారిన హార్దిక్ పాండ్య డ్యాన్స్ వీడియో!

Hardik Natasa White Wedding: హార్దిక్ పాండ్య, నటాషా స్టాంకోవిచ్ లు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వివాహ సమయంలో పాండ్య చేసిన డ్యాన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

FOLLOW US: 
Share:

Hardik Natasa White Wedding:  టీమిండియా టీ20 కెప్టెన్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య- నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్ ల వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వేడుకగా జరిగింది. వీరిద్దరూ ఇదివరకే చట్టప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే కుటుంబం, సన్నిహితుల మధ్య క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం మళ్లీ ఒక్కటయ్యారు. వీరిద్దరికీ అగస్త్య అనే బాబు ఉన్నాడు. 

భారత ఆటగాడు హార్దిక్ పాండ్య, నటాషాలు మూడేళ్ల క్రితం చట్టప్రకారం పెళ్లి చేసుకున్నారు. 2020 మే, 31న తాము వివాహం చేసుకున్నట్లు వీరిరువురూ ప్రకటించారు. జూలై 2020లో నటాషా అగస్త్యకు జన్మనిచ్చారు.  అప్పుడు కొవిడ్ పాండమిక్ కారణంగా వీరు ఘనంగా పెళ్లి చేసుకోలేకపోయారు. అందుకనే ఇప్పుడు ఫిబ్రవరి 14న క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం వీరు మళ్లీ వివాహం చేసుకున్నారు. 

డ్యాన్స్ అదుర్స్

ఈ వివాహ వేడుక 3 రోజులపాటు జరగనుంది. పాండ్య, నటాషాల వివాహానికి కొంతమంది క్రికెటర్లు, బాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే వివాహ సమయంలో హార్దిక్ పాండ్య చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. బ్లాక్ సూట్ లో తన భార్యతో కలిసి వస్తూ పాండ్య హిందీ పాటకు డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

హార్దిక్ పాండ్య తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'మూడేళ్ళ క్రితం మేము చేసుకున్న ప్రతిజ్ఞలను పునరుద్ధరించుకున్నాం. వివాహం ద్వారా ఈ ప్రేమ ద్వీపంలో ప్రేమికుల రోజును ఇలా జరుపుకున్నాం. ఈ సమయంలో మా కుటుంబం, స్నేహితులు మాతో ఉన్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం' అని పాండ్య అన్నాడు. 

పునరాగమనం సూపర్

గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన తర్వాత హార్దిక్ పాండ్య అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు అరంగేట్రంలోనే కెప్టెన్ గా ట్రోఫీని అందించాడు. అలాగే భారత జట్టులోనూ రాణిస్తున్నాడు. సీనియర్ల గైర్హాజరీలో ఐర్లాండ్, న్యూజిలాండ్ లతో టీ20 సిరీస్ లకు ప్రాతినిధ్యం వహించి జట్టును సిరీస్ విజేతగా నిలిపాడు. పాండ్య కెప్టెన్సీలో శ్రీలంకతో 3 టీ20ల సిరీస్ ను 3-0తో భారత్ గెలుచుకుంది. 

కెప్టెన్ గా, ఆటగాడిగా హార్దిక్ పాండ్య ప్రదర్శనను బట్టి చూస్తే పరిమిత ఓవర్ల క్రికెట్ లో రోహిత్ శర్మ తర్వాతి నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఆ దిశగా బీసీసీఐ సూచనలు ఇచ్చింది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ టీ20లకు ఇకనుంచి పాండ్యనే రెగ్యులర్ కెప్టెన్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఏడాది స్వదేశంలో టీమిండియా వన్డే ప్రపంచకప్ ఆడనుంది. సొంతగడ్డపై కప్ ఫేవరెట్ గా భారత్ బరిలోకి దిగనుంది. 

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

Published at : 15 Feb 2023 11:25 PM (IST) Tags: Hardik Pandya Hardik Pandya Wedding Hardika natasha wedding Hardik Pandya Dance

సంబంధిత కథనాలు

IPL 2023: గాయం కారణంగా ఐపీఎల్‌కు ముఖేష్ చౌదరి దూరం - మరి చెన్నై ఎవర్ని సెలెక్ట్ చేసింది?

IPL 2023: గాయం కారణంగా ఐపీఎల్‌కు ముఖేష్ చౌదరి దూరం - మరి చెన్నై ఎవర్ని సెలెక్ట్ చేసింది?

Shaik Rasheed: అండర్-19 వైస్ కెప్టెన్సీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ దాకా - షేక్ రషీద్ గత రికార్డులు ఎలా ఉన్నాయి?

Shaik Rasheed: అండర్-19 వైస్ కెప్టెన్సీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ దాకా - షేక్ రషీద్ గత రికార్డులు ఎలా ఉన్నాయి?

Bhagath Varma: చెన్నై జట్టులో హైదరాబాదీ ప్లేయర్ - ఎవరీ కనుమూరి భగత్?

Bhagath Varma: చెన్నై జట్టులో హైదరాబాదీ ప్లేయర్ - ఎవరీ కనుమూరి భగత్?

మీరు రాకుంటే మేమూ రాం! వన్డే వరల్డ్ కప్‌లో ఆడేందుకు పాక్ అభ్యంతరం

మీరు రాకుంటే మేమూ రాం! వన్డే వరల్డ్ కప్‌లో ఆడేందుకు పాక్ అభ్యంతరం

IPL 2023: ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిపై కోట్లాది రూపాయల ఖర్చు-ఫ్రాంచైజీలకు ఆ డబ్బు ఎలా వస్తుంది?

IPL 2023: ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిపై కోట్లాది రూపాయల ఖర్చు-ఫ్రాంచైజీలకు ఆ డబ్బు ఎలా వస్తుంది?

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు