Pak vs SL, Live streaming: ఎవరి గెలుపు కోసం చూస్తారు! ఆసియాకప్ ఫైనల్ ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ ఎందులో?
Pakistan vs Sri Lanka Live Streaming: ఆసియాకప్ -2022 ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం పాకిస్థాన్, శ్రీలంక ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ వివరాలు మీకోసం.
Pakistan vs Sri Lanka Live Streaming: ఆసియాకప్ -2022 ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం పాకిస్థాన్, శ్రీలంక ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. అంచనాల్లేకుండా వచ్చిన లంకేయులు అద్భుతాలు చేయగా టాస్ లక్కు, ఇతర కారణాలతో పాకిస్థాన్ ఫైనల్ చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ వేదిక, టైమ్, లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ వివరాలు మీకోసం.
When Does Pakistan vs Sri Lanka T20 match Begin (Date and Time in India) in Asia cup 2022?
పాకిస్థాన్, శ్రీలంక టీ20 వేదిక దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. 7:00 గంటలకు టాస్ వేస్తారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
Where to Watch Pakistan vs Sri Lanka T20 match?
ఆసియాకప్ 2022 ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ ఇండియా గెలుచుకుంది. పాకిస్థాన్, శ్రీలంక ఫైనల్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లలో ప్రసారం అవుతుంది. స్టార్‌సోర్ట్స్ 1, స్టార్‌స్పోర్ట్స్ 1హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ హిందీ ఛానళ్లలో వీక్షించొచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, తమిళం, మళయాలం భాషాల్లో చూడొచ్చు.
How to Watch Pakistan vs Sri Lanka T20 match Live Streaming Online for Free in India?
ఆసియాకప్ మ్యాచులను లైవ్ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్లు నేరుగా లైవ్ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి.
Asia cup 2022, Schedule
ఆగస్టు 27న ఆసియాకప్ మొదలైంది. సెప్టెంబర్ 11న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. సెప్టెంబర్ ౩ నుంచి సూపర్-4 మ్యాచులు మొదలయ్యాయి. టీమ్‌ఇండియా 2 ఓడి 1 గెలిచి ఫైనల్‌కు దూరమైంది. ఈ ఆదివారం శ్రీలంక, పాకిస్థాన్ ఫైనల్లో తలపడుతున్నాయి.
Pakistan vs Sri Lanka T20 ProbableXI
శ్రీలంక: నిశాంక్, కుశాల్ మెండిస్, అసలంక, గుణతిలక, భానుక రాజపక్స, దసున్ శనక (కెప్టెన్), హసరంగ, చామిక కరుణరత్నే, తీక్షణ, దిల్షాన్, మదుశంక.
పాకిస్థాన్ : బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, కుష్‌దిల్ షా, షాబాద్ ఖాన్, అసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, హ్యారిస్ రౌఫ్, మహ్మద్ హస్నైన్
Skipper @dasunshanaka1 talks about the great wishes from YOU back home! 🤩
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 10, 2022
Use the link below to send your #RoaringForGlory wishes ahead of the final ⬇️https://t.co/R46lZfsCFG pic.twitter.com/2GVsFIOzvU