Vastu Tips In Telugu: కెరీర్ ముందుకు సాగాలంటే ఈ ఫెంగ్ షుయ్ చిట్కాలు పాటిస్తే సరి
కేరీర్ లో అడ్డంకులు ఎదుర్కొంటున్నా , పురోగతి లేకపోయినా ఫెంగ్ షుయ్ లో మంచి ఉపాయాలున్నాయి. వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడేందుకు కూడా ఫేంగ్ షూయి మంచి మార్గాలు చూపుతుందని విశ్వసిస్తారు.
కేరీర్ ముందుకు సాగాలంటే ఈ ఫెంగ్ షుయ్ చిట్కాలు పాటిస్తే సరి
కొంత మంది ఏళ్లుగా కష్టపడి పనిచేస్తుంటారు కానీ ఎదుగూ బొదుగూ కనిపించదు. ఒక ప్రమోషనో, రాబడిలో మెరుగుదలో కనిపించదు. కానీ కొందరు మాత్రం చాలా వేగంగా విజయపథంలో దూసుకుపోతుంటారు. కేరీర్ లో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు లేదా పురోగతి లేని వారి కోసం ఫెంగ్ షూయిలో మంచి మంచి ఉపాయాలు ఉన్నాయి. అంతేకాదు వ్యాపారంలో నష్టాలు రావడం, ఉద్యోగం దొరకకపోవడం, సంపాదించిన డబ్బు నిలవక పోవడం వాటన్నింటికి ఫేంగ్ షూయి వాస్తు మంచి మార్గాలు చూపుతుంది. అలాంటి కొన్ని ఫెంగ్ షూయి వాస్తు చిట్కాలను గురించి తెలుసుకుందాం.
Also Read : రెండు నెలల పాటూ ఈ 4 రాశులవారికి ఆదాయం, ఆరోగ్యం, ఆనందం
- ఆఫీసు టేబుల్ మీద ఎప్పుడూ కుడివైపు వస్తువులు పెట్టకూడదు. ఇలా పెట్టుకుంటే పనిలో ఆటంకాలు ఏర్పడుతాయి. కెరీర్ ముందుకు సాగాలంటే డస్ట్ బిన్ కూడా కుడివైపున ఉంచకూడదు.
- ఆఫీస్ టేబుల్ మీద బరువైన వస్తువులు ఉంటే మీ పొజిషన్, కెరీర్ మీద చెడు ప్రభావం పడవచ్చు. కనుక అలాంటి వస్తువులు తొలగించాలి.
- మీరు కూర్చునే స్థానం పైన పిల్లర్ ఉంటే దాని వల్ల కలిగే ప్రతికూలతలను నిర్మూలించేందుకు ఫేంగ్ షూయి డింగ్ తప్పకుండా పెట్టుకోవాలి.
- కేరీర్ విజయపథాన సాగేందుకు ఈస్ట్ సెక్టార్ క్వాలిటీ ఇండెక్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
- ఇంట్లో తూర్పు వైపు ఒక గిన్నె పెట్టకుని అందులో ప్రతి రోజూ శుభ్రమైన నీటిని అందులో నింపాలి. ఈ పరిహారం ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసారానికి దోహదం చేస్తుంది.
- ఖర్చులు అధికంగా ఉండి ఆర్థిక నష్టం జరుగుతుంటే ఇంట్లో ఏదైనా ప్లంబింగ్ సమస్యలు ఉన్నాయేమో చూసుకుని వాటిని పరిష్కరించుకోవాలి. ఇంట్లో చిన్న పారే నీటి ఫౌంటైన్ పెట్టుకోవడం కూడా ఒక మంచి పరిహారం.
- ఇంటి ముంగిలి, ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా అలంకరించి ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రసారం అవుతూ ఉంటుంది.
- కొన్ని మొక్కలు ఫెంగ్ షూయిలో లక్కీ ప్లాంట్స్ గా పేరు పొందాయి. వాటి లో జేడ్ మొక్క కూడా ఒకటి. ఇవి ఇంటిలో పెంచితే సమృద్ధి, సంపద వస్తుంది.
- ఫెంగ్ షూయిలో తాబెలు కూడా చాలా ముఖ్యమంది. ఇవి దీర్ఘాయుష్షు, అపారమైన సమృద్ధికి ప్రతీక.
- ఈవిల్ ఐ కూడా ఇంట్లోకి నెగెటివిటి చేరకుండా నిరోధిస్తుంది కనుక ఇంట్లో వాల్ హ్యాంగింగ్ గా ఈవిల్ ఐని అలంకరించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- లాఫింగ్ బుద్ధ ఫేంగ్ షూయిలో చాలా ముఖ్యమైన చిహ్నం. ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.
- ఫెంగ్ షూయిలో మరో ముఖ్యమైన ఆర్టికల్ విండ్ షైమ్. మెటల్ తో తయారైన విండ్ షైమ్ ను ఇంట్లో వేలాడదీసుకుంటే ఇల్లు శుభప్రదంగా ఉంటుందని నమ్మకం.
- మీరు నివసించే ప్రదేశం లేదా , పనిచేసుకునే ప్రదేశంలో ఎరుపు లేదా ఆకుపచ్చ లేదా ఊదారంగు కలిగిన వస్తువులు కంటికి ఎదురుగా అలంకరించి పెట్టుకోవడం లేదా గోడలకు ఈ రంగులు వాడడం వల్ల పవర్ వైబ్రేషన్స్ మెరుగుపరిచేందుకు దోహదం చేస్తుంది.
Also Read : Bamboo plant: వెదురు మొక్కను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందా? దీన్ని ఎలా పెంచాలి?
-
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial