అన్వేషించండి

Telangana 10th Results 2025: రేపే తెలంగాణ టెన్త్‌ ఫలితాలు- అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం

Telangana SSC Results 2025: తెలంగాణ టెన్త్‌ ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. ఈసారి మెమోలో విద్యార్థుల మార్కులు, సబ్జెక్టుల వారీగా గ్రేడ్‌లతో ఇవ్వబోతున్నారు.

Telangana 10th Results 2025: తెలంగాణ పదోతరగతి ఫలితాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేయనుంది. మార్కుల మెమో ముద్రణపై క్లారిటీ రావడంతో రేపు ఫలితాలు విడుదలకు లైన్ క్లియర్ అయింది. దీంతో రేపు ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పదోతరగతి మార్కుల మెమోలపై మార్కులతోపాటు గ్రేడ్స్‌ను సైతం ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను ఏప్రిల్ 8న పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి పంపించింది. ఈ మధ్యే దీన్ని ప్రభుత్వం అంగీకరించింది. దీంతో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్‌ యోగితారాణా జారీ చేసిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి పదోతరగతిలో గ్రేడింగ్‌ విధానాన్ని తీసివేయనున్నారు. 

పదోతరగతిలో సబ్జెక్టులవారీగా గ్రేడ్లతోపాటు క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్(CGPA) ముద్రించే వాళ్లు. ఇప్పుడు కొత్త విధానం ప్రకారం మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు ఇస్తారు. గ్రేడ్లస్థానంలో మార్కుల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ ఏడాది నుంచే ఇంటర్నల్స్‌ రద్దు చేయాలని భావించారు. కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైంది. అందుకే ఈ దఫా మాత్రం ఇటర్నల్స్ ఉంచారు. వచ్చే ఏడాది నుంచి వీటిని రద్దు చేయనున్నారు. 

మార్క్‌షీట్ ఎలా ఉంటుంది?
ఈ ఏడాది పాస్ అయ్యే పదోతరగతి విద్యార్థులకు వచ్చే మార్క్‌షీట్‌లో సబ్జెక్టులవారీగా మార్కులు, గ్రేడ్లు కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఉన్న జీపీఏ కనిపించదు.  సబ్జెక్టులవారీ వచ్చే మార్కులతోపాటు, ఇంటర్నల్ మార్క్‌లతో కలిపి మొత్తం మార్కులు, గ్రేడుగా పేర్కొంటారు. లాస్ట్‌లో విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్ అయ్యారా? ముద్రిస్తారు. కో కరిక్యులర్ యాక్టివిటీస్‌లో గ్రేడ్లు ఇస్తారు.  

* ఎస్‌ఎస్‌సీ మార్క్‌ మెమోలపై ఇంటర్నల్స్‌ మార్కులు, వార్షిక పరీక్షల మార్కులు వేస్తారు. మొత్తం మార్కులతో పాస్‌ సర్టిఫికెట్‌ అందజేస్తారు. గ్రేడ్లు, మార్కులు వేర్వేరుగా ఇస్తారు. 

* సబ్జెక్టులవారీగా సాధించిన మార్కు లు, గ్రేడ్లు రెండు కూడా సర్టిఫికెట్‌లో కనిపిస్తాయి. 

* పదోతరగతిలో ఇంటర్నల్స్‌లో 20 మార్కులు ఇచ్చారు. పాస్‌ సర్టిఫికెట్‌లో వీటిని చూపుతారు.

* 20 ఇంటర్నల్‌ మార్కులు ఉన్నందున ఒక్కో సబ్జెక్టులో 80 మార్కులకే వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో 28 మార్కులు వస్తే పాస్ అవుతారు. 

* ఇంటర్నల్స్‌ మార్క్స్‌తో సంబంధం లేకుండా 28 మార్కులు రావాలి. లేకుంటే ఫెయిల్ అయినట్టు లెక్క. హిందీ సబ్జెక్ట్‌లో మాత్రం 16 మార్కులు వస్తే సరిపోతుంది. 

* మెమోలపై ఫస్ట్‌ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనేదేమీ ఉండదు. ఎన్ని మార్కులు వచ్చినా పాస్‌ అని మాత్రమే ఉంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget