Gold Price: లక్ష రూపాయల మార్క్ చేేరాక బంగారం ధరలు ఎందుకు పెరగడం లేదు, దీనికి కారణాలు ఏంటీ ?
Gold Rate Today | ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు దాదాపు 1 శాతం తగ్గాయి. స్పాట్ బంగారం ధర 0.8 శాతం తగ్గడంతో ఔన్స్‌కు 3314.99 డాలర్లుగా ఉంది. లక్ష చేరిన బంగారం దూకుడు తగ్గించింది.

Gold Price In India | భారతదేశ మార్కెట్ చరిత్రలో తొలిసారిగా ఏప్రిల్ 22న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ.1 లక్ష మార్క్ దాటింది. అయితే, ఏప్రిల్ నెలాఖరు నాటికి లేదా అక్షయ తృతీయ వరకు బంగారం ధర 1 లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు ముందుగానే సూచించారు. ఆ వెంటనే బంగారం ధరలు హెచ్చుతగ్గులు నమోదువుతుంది. ఇండియన్ బులియన్ అసోసియేషన్ ప్రకారం, మంగళవారం (ఏప్రిల్ 29న) బంగారం ధర 0.8 శాతం పడిపోయి 10 గ్రాములకు రూ.97,970కి చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే, బంగారం ధరలో దాదాపు 1 శాతం దిగొచ్చింది. స్పాట్ గోల్డ్ ధర 0.8 శాతం పడిపోయి ఔన్స్‌కు 3,314.99 డాలర్లకు చేరుకుంది. అయితే అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 0.7 శాతం పడిపోయి డాలర్‌కు 3,325కి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ల ప్రభావంతో ఇన్వెస్ట్ మెంట్‌కు మార్గంగా బంగారంపై పెట్టుబడి పెట్టారు. టారిఫ్ లకు బ్రేక్ ఇవ్వడంతో బంగారానికి డిమాండ్ ఉన్నా, ఇన్వెస్ట్ మెంట్ తగ్గడంతో ధరలు లక్ష మార్క్ నుంచి దిగొచ్చాయి.
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధర పతనం
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ కు డిమాండ్ తగ్గడం, గ్లోబల్ మార్కెట్లో పెట్టుబడిదారుల సానుకూల వైఖరి. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇటీవల భారతదేశం సహా అనేక అగ్ర భాగస్వామ్య దేశాల నుండి అమెరికన్ టారిఫ్‌లకు బదులుగా అనేక మెరుగైన ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. భారతదేశంతో త్వరలోనే వ్యాపార ఒప్పందాలు జరుగవచ్చని, ఇక్కడ పసిడికి ఉన్న డిమాండ్ కారణమని పేర్కొన్నారు.
అంతేకాకుండా, అమెరికన్ వస్తువులపై కొన్ని టారిఫ్‌లను తొలగించడానికి చైనా తీసుకున్న నిర్ణయం సైతం మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించినట్లు భావిస్తున్నారు. అమెరికన్ ప్రభుత్వం కూడా ఆటో టారిఫ్‌లను తగ్గిస్తుందని, దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మెరుగవుతాయి.
ఆకాశం నుండి కిందకు వస్తున్న బంగారం ధర
ఎల్‌కెపిసెక్యూరిటీస్‌లో వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జితేన్ త్రివేది మాట్లాడుతూ.. వ్యాపార సంబంధాలలో ఉన్న నెలకొన్న ఒత్తిడి తగ్గడానికి కారణం అమెరికా టారిఫ్‌లపై చర్చలకు అనేక దేశాలకు అవకాశం కలిగింది. దాంతోపాటు చైనా, అమెరికా దేశాల మధ్య వ్యాపార ఒప్పందాలు త్వరలోనే జరుగుతాయని అమెరికన్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్ లో మార్పులకు కారణం అయింది. మార్కెట్లో పెట్టుబడులకు బంగారంపై ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచనను కొందరు విరమించుకున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కూడా సాధ్యం అవుతుందని నిపుణులు అంచనా వేయడంతో బంగారంలో సురక్షిత పెట్టుబడి అనే యోచనను కాస్త తగ్గించింది.
పెట్టుబడిదారులలో భయం పోయిన వెంటనే బంగారం వంటి సురక్షిత పెట్టుబడులలో మనీ ఇస్వెస్ట్ ఆలోచన నుండి బయటకు వచ్చేశారు. బంగారం డిమాండ్ ఈ విధంగా తగ్గడంతో తాత్కాలికంగా బంగారం ధర కాస్త దిగొచ్చాయి. కానీ పెళ్లిళ్ల సీజన్ ఉంటే మాత్రం మరికొన్ని రోజులు లక్ష మార్కు వద్దే విక్రయాలు జరుగుతాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయం, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి వల్ల ఇటీవల బంగారం ఔన్స్ 3,500.05 డాలర్లకు చేరుకుంది.






















