అన్వేషించండి
Brahmamudi Serial November 14th Episode Highlights: యుద్ధానికి బయలుదేరిన రాజ్ .. కూల్ గా ఉన్న కళావతి - అనామిక భారీ కుట్ర - బ్రహ్మముడి నవంబరు 14 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: దుగ్గిరాల వారి కంపెనీలోకి కావ్య CEO గా అడుగుపెట్టడంతో కథ కీలక మలుపు తిరిగింది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today November 14th Highlights
1/9

కళ్యాణ్ ఆలోచనలో ఉండగా అక్కడకు వచ్చిన అప్పు...పోటీ సంగతి చెబుతుంది. ఈ పోటీలో తప్పనిసరిగా కావ్య వదినే గెలుస్తుందని కళ్యాణ్ నమ్మకంగా చెబుతాడు. మా బావగారిని కూడా తక్కువ అంచనా వేయొద్దంటుంది అప్పు..
2/9

రాజ్, కావ్య మధ్య సీతారామయ్య పోటీ పెట్టారని..కావ్య గెలిచి తిరిగి మా ఇంట్లో అడుగుపెడుతుందని ఇందిరాదేవి కనకానికి కాల్ చేసి చెబుతుంది. కనకం సంతోషానికి అవధులుండవు..ఇంతలో కావ్య రావడంతో తెగ హడావుడి చేస్తుంది
3/9

అనామికకు కాల్ చేసిన రుద్రాణి పందెం సంగతి చెబుతుంది. ఈ పందెంలో ఎవరు గెలిచినా మనకే నష్టం అంటుంది అనామిక. అసలు మీకా కాంట్రాక్ట్ ఆ కంపెనీకి రాకపోతే ఈ డీల్ ఉండదు కదా ఇంతకీ కాంట్రాక్ట్ ఇచ్చిందెవరని ఆరా తీస్తుంది అనామిక. ఆ డీటేల్స్ చెబుతుంది రుద్రాణి. ఇక మీరు ఆస్తి గొడవలు కంటిన్యూ చేయండి అంటుంది
4/9

ఆస్తి గొడవలు సృష్టించేందుకు మళ్లీ ధాన్యలక్ష్మిని రంగంలోకి దించుతుంది రుద్రాణి. నీకు కోట్ల ఆస్తి ఉన్నా కొడుకు మాత్రం ఆటోనడుపుకుంటున్నాడు.. నీ విషయంలో జాలిపడాలో,బాధపడాలో తెలియడం లేదంటుంది రుద్రాణి. కళ్యాణ్ కి న్యాయం చేకుండా కావ్య-రాజ్ ని గెలిపించే ప్రయత్నంలో ఉన్నారంతా అని అగ్గిరాజేస్తుంది
5/9

రాజ్-కావ్యను నెత్తిన పెట్టుకుని ఏదో ఓ రోజు కళ్యాణ్ కి ఆస్తితో సంబంధం లేదనేస్తారని బాంబ్ పేలుస్తుంది. ఆ మాయలో ధాన్యలక్ష్మి పడిపోతుంది. నీ కోపం కుటుంబ సభ్యులకు అర్థమయ్యేలా చేయాలని ఆజ్యం పోస్తుంది
6/9

ఆఫీసుకి బయలుదేరిన రాజ్ కి ప్రకాశం ఎదురొస్తాడు.. ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన బాధ్యత లేదా అని అంటే.. అవును కదూ కావ్యకు కాల్ చేసి ఆల్ ది బెస్ట్ చెబుతా అంటాడు ప్రకాశం. కావ్య చేతిలో ఓడిపోయేందుకు ఆఫీసుకి వెళుతున్నావా అని పంచ్ వేస్తాడు సుభాష్. రుద్రాణి తప్ప అందరూ కావ్య గెలుపునే కోరుకుంటారు.
7/9

కోపంగా ఆఫీసుకి వెళ్లిన రాజ్ కి సెక్యూరిటీగా మారిన మేనేజర్ విష్ చేస్తాడు..వాడిపై రాజ్ సెటైర్ వేస్తాడు. రేపో మాపో మీ మేనేజర్ జాబ్ కూడా పోతుందని అంతా అనుకుంటున్నారని పంచ్ వేస్తాడు సెక్యూరిటీ గార్డ్.
8/9

డిజైన్స్ గీయడానికి బోర్డ్, ఛార్ట్‌లతో ఆఫీస్‌కు వచ్చిన రాజ్ ని చూసి..డిజైన్స్ గీయాలంటే క్రియేటివిటీ ఉండాలికదా అని పంచ్ వేస్తుంది. ఇక రాజ్ మంచి డిజైన్స్ గీసిన వారికి సొంతిల్లు కట్టించి ఇస్తానని ఆఫర్ ఇస్తాడు. ఉద్యోగులంతా పని మొదలుపెడతారు.
9/9

బ్రహ్మముడి నవంబరు 15 ఎపిసోడ్ లో ...దుగ్గిరాల కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిన జగదీష్ ప్రసాద్‌ను కలసిన అనామిక.. ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని అలాంటి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దంటుంది. ఆ కాంట్రాక్ట్ తమ కంపెనీకి ఇవ్వమని అడుగుతుంది.. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
Published at : 14 Nov 2024 08:56 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
బిజినెస్
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion