Jack Trailer: కామెడీ ఒక్కటే కాదు... అంతకు మించి - సిద్ధూ సినిమా అంటే అట్లుంటది మరి... జాక్ ట్రైలర్ వచ్చేసింది, చూడండి
Siddhu Jonnalagadda's Jack Update: స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన జాక్ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. కామెడీ ఒక్కటే కాదు అంతకు మించి అనేలా ఉన్న ట్రైలర్ చూశారా?

'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda). ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'జాక్ కొంచెం క్రాక్' (Jack Movie). తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. అదెలా ఉందో చూశారా?
కామెడీ ఒక్కటే కాదు... అంతకు మించి!
Jack movie trailer Telugu review: ప్రేక్షకులకు వినోదం అందించడంలో సిద్ధూ జొన్నలగడ్డది సపరేట్ టిపికల్ స్టైల్. టిల్లు పాత్రలో అతని నటన, కామెడీ టైమింగ్ తెలుగు జనాలకు విపరీతంగా నచ్చేసింది. జాక్ టీజర్ చూస్తే టిల్లు టైమింగ్ గుర్తుకు వస్తుంది. ట్రైలర్ వచ్చేసరికి కామెడీ మాత్రమే కాదు... అంతకు మించి అనేలా కథను చెబుతూ కట్ చేశారు.
'జాక్ కొంచెం క్రాక్'తో స్టార్ బాయ్ పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా అలరించనున్నాడని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. తన కుమారుడు ఏం కావాలని అనుకుంటున్నాడో తెలుసుకోవాలనే తండ్రిగా సీనియర్ నరేష్ టీజర్ వరకు అలరించారు. ట్రైలర్లో సిద్ధూ ఒక స్పై ఏజెంట్ అనే రేంజ్ లో చూపించారు. యాక్షన్ సీన్లలో హీరో అదరగొట్టాడు. వైష్ణవి చైతన్యతో అతని కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరి మధ్య సన్నివేశాలు సూపర్ అనేలా ఉన్నాయి. సినిమాలో యాక్షన్ ఒక్కటే కాదని, కామెడీతో పాటు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కథ కూడా హైలైట్ అవుతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
Also Read: మధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా బావుందా? లేదా?
ఏప్రిల్ 10న థియేటర్లలోకి 'జాక్ కొంచెం క్రాక్'!
'జాక్ కొంచెం క్రాక్' చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న థియేటర్లలో భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి అచ్చు రాజమణి పాటలు అందించగా.... పుష్ప 2, సుడల్ 2కు నేపథ్య సంగీతం అందించిన సామ్ సిఎస్ ఈ సినిమాకు కూడా ఆర్ఆర్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మజీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
Also Read: 'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?
𝐌𝐚𝐠𝐧𝐢𝐟𝐲𝐢𝐧𝐠 𝐬𝐮𝐬𝐩𝐞𝐧𝐬𝐞 𝐳𝐨𝐨𝐦𝐢𝐧𝐠 𝐢𝐧 𝐨𝐧 𝐦𝐚𝐝𝐧𝐞𝐬𝐬 💥💥#JackTrailer is now live with ENTERTAINMENT mode fully ON 🤟🏻
— SVCC (@SVCCofficial) April 3, 2025
— https://t.co/gHG3HCFYuK#Jack #JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @Prakashraaj #AchuRajamani… pic.twitter.com/95U3HCc5VJ



















