HCU Land Dispute: హెచ్‌సీయూకి ఆనుకొని ఉన్న 400 ఎకరాల్లో ఎకో పార్క్- ఎవరు కొనుక్కున్నా గుంజుకుంటాం: కేటీఆర్
HCU Land Dispute: హైదరాబాద్‌లో వివాదాస్పదమవుతున్న 400 ఎకరాల్లో ఇంచ్ కొనుకున్నా లాక్కుంటామని కేటీఆర్ హెచ్చరించారు. దాన్ని ఎకో పార్క్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.

HCU Land Dispute: హెచ్‌సీయూకి ఆనుకొని ఉన్న 400 ఎకరాలను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకో టూరిజం పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. కచ్చితంగా మూడేళ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామన్నారు. ఆ స్థలాన్ని ఎవరు కొనుక్కున్నా గుంజుకుంటామన్నారు. అప్పుడు తమను నిందిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఎవరూ కొనుక్కోవద్దని సూచించారు.
హైదరాబాద్ ప్రజలు తమకు ఓట్లు వేసి గెలిపించారని అందుకే వారికి గిఫ్ట్‌గా ఇస్తామన్నారు కేటీఆర్. మూడేళ్లల వచ్చిన తర్వాత తెలంగాణలోనే అది పెద్ద ఎకో పార్క్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. అప్పుడు హెచ్‌సీయూకి, తెలంగాణ ప్రజలకు మంచి గిఫ్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఇంతలో రేవంత్ రెడ్డి మాయలో పడి ఎవరైనా ఈ ల్యాండ్స్‌లో ఒక్క ఇంచ్ కొనుక్కన్నా వెనక్కి లాక్కుంటామని హెచ్చరించారు. అప్పుడు తమను తప్పుపడితే ప్రయోజనం ఉండబోదన్నారు.
LIVE : BRS Working President @KTRBRS addressing the media at Telangana Bhavan#SaveHyderabadBioDiversity https://t.co/57Wb4X6t1d
— BRS Party (@BRSparty) April 3, 2025
ప్రత్యక్ష పోరాటానికి దిగక తప్పదు
విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని రాజకీయం చేసే ఉద్దేశం లేక ప్రత్యక్ష పోరాటానికి దిగలేదని ఇకపై చేస్తామన్నారు కేటీఆర్. తాము వెళ్తే ఇదంతా తమ ప్రోద్బలంతో జరుగుతుందని ఆరోపిస్తారని వెనక్కి తగ్గామన్నారు. ప్రభుత్వం మరీ మొండిగా వెళ్తోందని అందుకే ఇకపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు.
అక్కడ పశుపక్షులకు ప్రాణహాని లేదని ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. ఇప్పుడు సోషల్ మీడియాతో సర్క్యులేట్ అవుతున్న ఫొటోలు నిజమైనవని ఏఐ జనరేట్ చేసినవి కాదని అన్నారు. తెలిసీ తెలియక చాలా మంది ఇది ఏఐ జనరేటెడ్ ఫటోలు అని ప్రచారం చేస్తున్నారని తప్పుపట్టారు.
బందిపోట్లు మాదిరిగా పాలకులు: కేసీఆర్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని బుధవారం తనను కలిసిన ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో అన్నారు. పాలకుల తీరు బందిపోట్లను తలపిస్తోందని మండిపడ్డారు. భారీ సంఖ్యలో బుల్డోజర్లను రంగంలోకి దించి విధ్వంసానికి పాల్పడటం సీఎం మనస్తత్వానికి అద్దంపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పతనం దిశగా వెళ్తోందని దాన్ని ఎవరూ కాపాడలేరని అన్నారు. అందుకే దొరికినంత వరకు దోచుకునేందుకు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారని విమర్శలు చేసారు.
27న జరిగే వరంగల్ సమావేశం గురించి కూడా చర్చించారు. ఈ సమావేశానికి ప్రజలే స్వచ్ఛందంగా తరలి వస్తారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ పాలనపై ప్రజల్లో రోజురోజుకు అసంతృప్తి పెరుగుతోందని అన్నారు. ఒంటెద్దు పోకడలతో జనం విసిగిపోతున్నారని తెలిపారు. ప్రజలను మాయ చేసి ఈ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాయని ఇప్పుడు అసలు విషయం తెలిసిపోతుందన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) లో భూ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి కాంగ్రెస్ సర్కార్ విద్యార్థుల మీద చేస్తున్న దమనకాండపై ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, K. R సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీ దాసోజు… pic.twitter.com/Mjf4dR8hl5
— BRS Party (@BRSparty) April 2, 2025





















