Anantapuram Latest News: పరిటాల రవి హత్య కేసుపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు- సూటుకేసు బాంబుపై జగన్ మాట్లాడాలని డిమాండ్
Anantapuram Latest News: అనంతపురం రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. ఫ్యాక్షన్ మళ్లీ వ్యాప్తి చెందేలా తోపుదుర్తి బ్రదర్స్ ప్రయత్నిస్తున్నారని పరిటాల సునీత ఆరోపించారు.

Anantapuram Latest News: పరిటాల రవి హత్య కేసు మరోసారి చర్చనీయాంశమవుతుంది. ఈ కేసులో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పాత్ర ఉందని మాజీ మంత్రి పరిటల సునీత ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 45 మంది టిడిపి నేతలను హత్య చేశారని అన్నారు. హత్య రాజకీయాలకు పెట్టింది పేరు జగన్ పార్టీ అని విమర్శించారు. అనంతపురం ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు.
పాపంపేటలో 106 సర్వే నెంబర్‌లో 63 సెంట్లలో సుప్రీంకోర్టు ఆర్డర్‌తో ఇంటిని తొలగించారని పరిటాల సునీత తెలిపారు. తమ వాళ్ళు కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేశారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాత్రం దీన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కూల్చివేతను తోపు బ్రదర్స్ ఎందుకు ఆపలేక పోతున్నారని ప్రశ్నించారు. తాము రూ.8 కోట్లు తీసుకున్నట్టు ఆరోపిస్తున్నారని తమకు చేయి చాచే దుస్థితి పట్టలేదన్నారు.
ప్రతిదీ రాజకీయం చేయడం తోపు బ్రదర్స్‌కి అలవాటుగా మారిందన్నారు పరిటాల. టీవీ బాంబు గురుంచి మాట్లాడే వారు కారు బాంబు గుర్తుకు రాదా అని ప్రశ్నించారు. మీరు ముగ్గురు జైల్‌లో ఉండి వచ్చారు కదా అని గుర్తు చేశారు. శుక్రవారం జిల్లాకి వచ్చే జగన్ సూటుకేసు బాంబు గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.
గతాన్ని ఈ ప్రాంతంలోని ప్రజలంతా మర్చిపోయారని తాము మాత్రం దారుణంగా నష్టపోయామన్నారు. కష్టపడి పిల్లల్ని చదివించి పెద్ద చేసుకున్నామన్నరు. ప్రశాంతంగా ఉన్న సమయంలో మళ్లీ ఫ్యాక్షన్‌కి ఆజ్యం పోసేలా తోపు బ్రదర్స్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తోపు వారి ఉచ్చులో గంగుల, కనుముక్కల కుటుంబాలు పడవని అన్నారు. అధికారంలో లేనప్పుడే కనుముక్కల, గంగుల కుటుంబాలు తోపు కుటుంబానికి గుర్తు వస్తాన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఒక లా... లేనప్పుఫుడు మరోలా వ్యవహరిస్తున్నారని సునీతా మండిపడ్డారు. రెడ్డి సోదరులకి, పరిటాల కుటుంబానికి ముందు నుంచి ఎలాంటి వివాదం లేదన్నారు. వాళ్ళ రాజకీయాలకు వాడుకుంటున్నారని అన్నారు. వాళ్ళ రాజకీయ ఉచ్చులో ఎవరు పడవద్దని సూచించారు. గతంలో తమ నాయకుడు చంద్రబాబు, లోకేష్‌పై దుర్భాషలు ఆడిన తోపు సోదరుడు ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని అన్నారు.
రామగిరిలో ఎంపీపీ అధ్యక్ష ఎన్నికను రాజకీయం చేస్తున్నారని పరిటాల ధ్వజమెత్తారు. తమ నాయకుడి ఆదేశాలతో పోటీకి దూరంగా ఉన్నామని అన్నారు. వాళ్ళ పార్టీ వాళ్లనే కిడ్నాప్ చేసి డ్రామాలు ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాక తమపై నిందలు వేస్తూ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. లింగమయ్య మృతి దురదృష్టవశాత్తు జరిగిందని తమ ఎంపీ, మంత్రిని పంపి భరోసా ఇచ్చామన్నారు.
తోపుదుర్తి ఆ కుటుంబాన్ని ఎందుకు పరమర్శించలేదని పరిటాల సునీత ప్రశ్నించారు. లింగమయ్యను పరామర్శించేందుకు మాజీ సీఎం వస్తున్నారని, సూటుకేసు బాంబు గురించి, అనంతలో జరిగిన హత్యల గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. గాండ్లపర్తి మోహన్ రెడ్డి, తోపుదుర్తి మహేష్ కుటుంబాలను జగన్ పరమర్శించాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తమ నియోజకవర్గంలో చాలా మంది వైసీపీ వారు నష్టపోయారని అందర్నీ పరామర్శించాలని సూచించారు. సిద్ధం సభలో గాయపడిన మీడియా ప్రతినిధులను కూడా పరామర్శించాలని అన్నారు.





















