అన్వేషించండి

Zuckerberg Watch: జుకర్‌బెర్గ్ బయట కనిపించేంత సింపుల్ కాదు - ఆయన పెట్టుకునే వాచ్ ఖరీదు రూ. 8 కోట్ల పైనే !

Meta Owner Watch: అత్తారింటికి దారేది సినిమాలో పవన్ చేతికి ఉన్న ఒక్క వాచ్ ఇస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని ముగ్గురు దాన్ని గిఫ్టుగా అడుగుతారు. నిజంగా అయితే మార్క్ జుకర్ బెర్గ్ ఇలాంటి వాచ్‌లు వాడతారు.

Zuckerberg Wears 900000 Dollers Watch: ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా యజమాని అయిన మార్క్ జుకర్ బెర్గ్ చాలా సింపుల్ గా కనిపిస్తారు. చాలా నిరాడంబర జీవితాన్ని గడుపుతారని చెప్పుకుంటారు. ఎంతో అరుదైన సందర్భాల్లో తప్ప ఆయన సూట్ వేయరు. సాధారణంగా టీ షర్టుల్లోనే ఉంటారు. కానీ ఆయన పెట్టుకునే వాచ్ విలువ మాత్రం కోట్లలో ఉంటుంది. తాజాగా ఫేస్ బుక్ లో ఓ మార్పు గురించి ప్రకటన చేసేందుకు ఆయన వీడియో రిలీజ్ చేశారు. అందరూ ఆ ప్రకటన గురించి పట్టించుకోలేదు. ఆ వీడియోలో ఆయన పెట్టుకున్న వాచ్ పై మాత్రం దృష్టి పెట్టారు. ఎందుకంటే దాని విలువ 8 కోట్ల రూపాయల పైమాటే అన్నమాట.

ప్రపంచ ధనవంతుల్లో ఒకరు అయిన జుకర్ బెర్గ్ కు రూ. ఎనిమిది కోట్ల విలువైన వాచ్ పెట్టుకోవడం పెద్ద విషయం కాదు. కానీ ఎప్పుడూ ఆయన తన ధన ప్రదర్శన చేయలేదు. అందుకే కొత్తగా ఎనిమిది కోట్ల విలువైన వాచ్ పెట్టుకునేసరికి ఆ వాచ్ ప్రత్యేకతల గురించి ఇంటర్నెట్ చర్చించడం ప్రారంభించారు. 

మార్క్ జుకర్‌బర్గ్ కట్టుకున్న వాచ్ గ్రూబెల్ ఫోర్సే 'హ్యాండ్ మేడ్ 1'. దీని ధర 9 లక్షల డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఎనిమిది కోట్ల రూపాయలకంటే ఎక్కువ. ఇంత ధర ఉండాలంటే ఎన్ని ప్రత్యేకతలు ఉండాలి. అన్నీ ఉంటాయి. ఇది స్విస్ తయారీ లిమిటెడ్ ఎడిషన్ వాచ్. ప్రపంచంలోని అత్యంత కుబేరుల వద్దనే ఉంటుంది. భారత్ లో అనంత్ అంబానీ ఇలాంటి వాచ్ ధరించి చాలా సార్లు మీడియాకు కనిపించారు.  

ప్రఖ్యాత స్విస్ వాచ్‌మేకర్ గ్రూబెల్ ఫోర్సే ఎస్ఏ ఉత్పత్తి చేసింది. ఇవి చాలా అరుదైన వాచ్‌లు. ఎందుకంటే కంపెనీ కూడా వీటిని ఏడాదికి  రెండు .. లేకపోతే మూడు మాత్రమే తయారు చేస్తుంది. జుకర్ బెర్గ్ దగ్గర ఇంకా చాలా ఖరీదైన వాచ్‌లు ఉన్నాయని అమెరికన్ మీడియా చెబుతోంది. వాచ్‌ల మీద  మార్క్ జుకర్‌బర్గ్ కు చాలా ఆసక్తి ఉంది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లికి వచ్చినప్పుడు  జుకర్‌బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్, అనంత్ ధరించిన  వాచ్‌ను ఆసక్తిగా చూశారు. ఇప్పుడు అలాంటి వాచ్ తోనే కనిపించారు. 

అయితే అనంత్ అంబానీ వాచ్ ఇంకా ఖరీదైనదని చెబుతున్నారు.  ఆ వాచ్ ది రిచర్డ్ మిల్లే RM 52-04 స్కల్ బ్లూ సఫైర్ అని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాచీలలో ఇది ఒకటి. ఇలాంటివి ప్రపంచంలో కేవలం మూడు మాత్రమే ఉన్నాయని చెబుతారు.  

Also Read : Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Telangana Tourism: సీఎం రేవంత్‌ చెప్పారు- నాగార్జున చేశారు- తెలంగాణలో కింగ్‌కు నచ్చిన ఫుడ్‌ ఇదేనట!
సీఎం రేవంత్‌ చెప్పారు- నాగార్జున చేశారు- తెలంగాణలో కింగ్‌కు నచ్చిన ఫుడ్‌ ఇదేనట!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Telangana Tourism: సీఎం రేవంత్‌ చెప్పారు- నాగార్జున చేశారు- తెలంగాణలో కింగ్‌కు నచ్చిన ఫుడ్‌ ఇదేనట!
సీఎం రేవంత్‌ చెప్పారు- నాగార్జున చేశారు- తెలంగాణలో కింగ్‌కు నచ్చిన ఫుడ్‌ ఇదేనట!
OG Sriya Reddy: పవన్ కళ్యాణ్  OG బ్యూటీ శ్రియా రెడ్డి షాకింగ్ లుక్!
పవన్ కళ్యాణ్ OG బ్యూటీ శ్రియా రెడ్డి షాకింగ్ లుక్!
Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
తిరుపతి తొక్కిసలాటలో వైసీపీ కుట్ర- టీటీడీ బోర్డు మెంబర్ సంచలన ఆరోపణలు 
Actor Mohan Babu: నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట - తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ చర్యలొద్దని ఆదేశం
KTR: 'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
'మరో వెయ్యి కేసులు పెట్టినా ఎదుర్కొంటాం' - ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
Embed widget