UK–Ukraine Agreement: జెలెన్స్కీని వెళ్లగొట్టిన అమెరికా, స్వాగతించిన బ్రిటన్.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం
అమెరికాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అవమానం జరిగిన వేళ మరుసటి రోజే ఆయనను యూకే స్వాగతించడం ఆసక్తిని రేపుతోంది. జెలెన్స్కీకి యూకే ప్రధాని కైర్ స్టార్మర్ లండన్‌లో ఘనంగా స్వాగతం పలికారు.

loan agreement between UK and Ukrain: అమెరికా వైట్‌హౌస్‌లో అధినేత డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీకి మధ్య శుక్రవారం మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. రష్యా యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజాలను తమకు అప్పగించాలని ట్రంప్ బృందం పట్టుబట్టగా.. మరోసారి రష్యా యుద్ధం చేయకుండా నిలువరించగలరా అని జెలెన్‌స్కీ వేసిన ప్రశ్నకు సరైన సమాధానం రాలేదు. ఫలితంగా నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేలా మాటామాటా పెరిగిపోయింది. అధ్యక్షులు లేచి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. దీంతో ఆ సమావేశం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
ఉక్రెయిన్‌కు అండగా ఉంటాం
అయితే అమెరికాలో ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితిలు ఎదురైన వేళ మరుసటి రోజే ఆయనను యూకే స్వాగతించడం ఆసక్తిని రేపుతోంది. ట్రంప్‌తో అంటకాగిన అనంతరం జెలెన్స్కీకి యూకే ప్రధాని కైర్ స్టార్మర్ లండన్‌లో ఘనంగా స్వాగతం పలికారు. జెలెన్‌స్కీ, కైర్ స్టార్మర్ సమావేశమై కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటామని కైర్ స్మార్టర్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు యూకే నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని లండన్‌లో జరిగిన సమావేశంలో వెల్లడించారు. తమ దేశానికి ఇలాంటి స్నేహితులు ఉన్నందుకు సంతోషంగా ఉందని స్మార్టర్ అన్నారు.
సైనిక సామగ్రిని పెంచడానికి..
ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. తమ దేశం స్తంభింపజేసిన రష్యన్ ఆస్తుల నుంచి వచ్చే లాభాలను ఉపయోగించి ఉక్రెనియన్ సైనిక సామగ్రిని పెంచడానికి సహకరిస్తామని స్మార్టర్ హామీ ఇచ్చారు. ఇద్దరు నేతలు భారీ రుణ ఒప్పందంపై సంతకం చేశారు.
2.26 బిలియన్ల రుణ ఒప్పందం
రష్యాతో యుద్ధం కొనసాగుతున్న వేళ కీవ్ రక్షణ సామర్థ్యాలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో యూకే–ఉక్రెయిన్ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2.74 బిలియన్ యూరోల రుణ ఒప్పందంపై చేసుకున్నాయి. యూకే ఛాన్సలర్ రాచెల్ రీవ్స్, ఉక్రెయిన్ ఆర్థిక మంత్రి సెర్గీ మార్చెంకో ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందాన్ని ‘ఉక్రేనియన్ ప్రజలకు మా తిరుగులేని మద్దతుకు ఇది సంకేతం’ అని యూకే పేర్కొంది.
ఈ మద్దతు మరిచిపోలేనిది: జెలెన్‌స్కీ
సమావేశం తర్వాత జెలెన్‌స్కీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా యూకేకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘యుద్ధంలో దెబ్బతిన్న యూరోపియన్ దేశానికి ఈ మద్దతు మరిచిపోలేనిది’ అని అన్నారు. ‘చర్చల సమయంలో ఉక్రెయిన్తోపాటు యూరప్ మొత్తం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఇతర దేశాలతో సమన్వయం, బలోపేతంపై చర్చించాం. యుద్ధాన్ని శాంతియుతంగా ముగించడానికి చేపట్టాల్సిన చర్యలు, భద్రతా హామీలను చర్చించాం’ అని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.
శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు నిశ్చయించుకున్నా: స్మార్టర్
ఈ ఒప్పందంపై స్మార్టర్ సైతం ఎక్స్ వేదిగా స్పందించారు. జెలెన్స్కీని డౌనింగ్ స్ట్రీట్‌కు స్వాగతించడం, ఉక్రెయిన్‌కు తన అచంచలమైన మద్దతు పునరుద్ఘాటించడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. రష్యా చట్టవిరుద్ధమైన యుద్ధాన్ని ముగించి, ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, భద్రతను కాపాడేందుకు, శాశ్వత శాంతిని నెలకొల్పే మార్గాన్ని అన్వేషించేందుకు తాను నిశ్చయించుకున్నానని రాసుకొచ్చారు.
వారం తర్వాత ఉక్రెయిన్‌కు నిధులు
ఈ ఒప్పందంలోని మొదటి విడత నిధులు వచ్చే వారం తర్వాత ఉక్రెయిన్‌కు చేరే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌లో ఆయుధాల ఉత్పత్తి కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

