By: ABP Desam | Updated at : 13 Apr 2022 11:47 PM (IST)
Edited By: RamaLakshmibai
Prof Taher murder Case
న్యాయం, ధర్మం వైపు నిలిచే తండ్రి...రాజకీయ నాయకుల కుట్రకు బలవుతాడు...ఆ నేరం ఓ అమాయకుడిపై పడుతుంది...ఏళ్లతరబడి నడుస్తున్న ఆ కేసులోకి కొత్తగా వచ్చిన ఓలాయర్ పోరాడి విజయం సాధిస్తుంది. ఆమె ఎవరో కాదు చనిపోయిన లాయర్ కుమార్తె....తండ్రి హత్యకేసులో నిజమైన నిందితులకు శిక్ష పడేలా చేసేందుకు లా చదువు మొదలుపెట్టి పట్టా పుచ్చుకుని కోర్డులో అడుగుపెడుతుంది. ఎన్నో వ్యవప్రయాసలోర్చి విజయం సాధిస్తుంది. ఏంటీ... నాంది సినిమా కథ చెబుతున్నారా అంటారా...నిజమే ఇప్పటి వరకూ మీరు చదివినదంతా నాంది సినిమా కథే. చెప్పుకోవడానికి సినిమా కథే అయినప్పటికీ సినిమా చూస్తున్నంత సేపూ రోమాలు నిక్కబొడుచుకుంటాయ్. ఇంతకీ ఇప్పుడీ కథ ఎందుకు చెబుతున్నామంటే....కాస్త అటు ఇటుగా సేమ్ టు సేమ్ రియల్ గా హ జరిగింది. అయితే సినిమా కు మించిన మలుపులున్నాయ్ ఇక్కడ.
బంగ్లాదేశ్ లో 2006లో రాజ్‌షాహి యూనివర్సిటీలో జియాలజీ, మైనింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎస్ తాహెర్ అహ్మద్ హత్యకేసులో ఇద్దరు దోషులకు ఉరిశిక్ష, మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించిన హైకోర్టు తీర్పును బంగ్లాదేశ్‌లోని అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ప్రధాన న్యాయమూర్తి హసన్ ఫోజ్ సిద్ధిక్ నేతృత్వంలోని పూర్తి అప్పీలు ధర్మాసనం మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. హత్యకేసుల విచారణలో ఎప్పటికైనా నిందితులకు శిక్షపడాల్సిందే కదా అనుకోవచ్చు కానీ..ఈ కేసు ప్రత్యేకత వేరు. మీకు అర్థమయ్యేలా ఒక్కమాటలో చెప్పాలంటే పైన నాంది సినిమా స్టోరీ చెప్పుకున్నాం కదా..ఇంచుమించు అలాంటిదే అనుకోవాలి.
అసలేం జరిగిందంటే...
తాహెర్ అహ్మద్ ఓ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. భార్య, ఇద్దరు పిల్లలు-ఉద్యోగం ఇవే ఆయన లోకం. సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో ఉన్నపాటుగా విషాదంలో కూరుకుపోయింది. 2006 ఫిబ్రవరి 1న ప్రొఫెసర్ తాహెర్ కిడ్నాపయ్యారు. రెండు రోజుల తరువాత తాహెర్ శవం ఓ మ్యాన్‌హోల్‌లో కనిపించింది. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసిన పోలీసులు ఈ హత్య వెనుక ఆరుగురు నిందితులున్నట్టు ప్రాధమిక నిర్థారణకు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. తమకు న్యాయం కావాలంటూ ఆ కుటుంబం కోర్డుల చుట్టూ తిరిగింది. ఎక్కడా న్యాయం దొరకలేదు. ప్రయత్నించి విసిగిపోయిన ఆ కుటుంబంలో ఉన్న తల్లి, కొడుకు, కూతురు...ఇక ఎవ్వరి సహాయం అడగొద్దు..మనమే న్యాయం కోసం పోరాడుదాం అని నిర్ణయించుకున్నారు. తల్లి, సోదరుడు కలసి షెగుప్తా తబసుమ్( తాహెర్ కుమార్తె)ను లా పూర్తిచేయమన్నారు. తండ్రి మరణానికి కొద్ది రోజుల ముందే లా కాలేజీలో చేరిన షెగుప్తా .. తండ్రి మరణం తర్వాత చదువుకి బ్రేక్ ఇచ్చేసింది. ఎప్పుడైతే తమకు ఎవరూ న్యాయం చేయలేరని అనుకున్నారో అప్పుడు మళ్లీ షెగుప్తా తన చదువుపై దృష్టిపెట్టింది.
తండ్రి హత్యకేసే తొలికేసు
తండ్రి చేర్పించిన కాలేజీలోంచే బీఆర్ఏసీ యూనివర్శిటీలో న్యాయపట్టా తీసుకుంది. బార్ అసోసియేషన్ సభ్యత్వం తీసుకుని తండ్రి కేసుని టేకప్ చేసింది. ఎందుకోసం లా చదువు పూర్తిచేసిందో ఆ లక్ష్యం నెరవేరే దిశగా బుర్రకు పదునుపెట్టింది. సీనియర్ లాయర్లకు ధీటుగా నిలబడింది...వాదించింది...సాక్ష్యాలు సేకరించేందుకు చాలా కష్టపడింది. ఫలితంగా బంగ్లాదేశ్ లో రాజ్‌షాహి కోర్టు 2009లో నలుగురు దోషులకు మరణదండన విధించింది. అయితే వాళ్లు హైకోర్టును ఆశ్రయించడంతో ఐదేళ్లపాటూ ఆ హడావుడి నడిచి 2013లో హైకోర్టు వారిలో ఇద్దరికి మరణశిక్ష, మరో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు చేసింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేందుకు ఛాన్స్ లేదు..ఎందుకంటే ఇంకా ఉంది...
16 ఏళ్ల తర్వాత న్యాయం జరిగిందన్న బాధితులు: హైకోర్టులో న్యాయం జరగలేదంటూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొమ్మిదేళ్లుగా విచారణ సాగుతూ వచ్చిన ఆ కేసులో ఏప్రిల్ 12 న తుదితీర్పు వచ్చింది. మీడియా ముందుకు వచ్చిన తల్లీ, బిడ్డ...వివరాలు వెల్లడించారు. "16 సంవత్సరాలు దీని కోసం పోరాడానని" తాహెర్ భార్య సుల్తానా అహ్మద్ చెప్పారు. “ చాలా బాధలు, కష్టాలు అనుభవించాను. తీర్పు పట్ల సంతృప్తిగా ఉన్నాను. కానీ శిక్షలు అమలు చేసినప్పుడు మాత్రమే పూర్తిగా సంతృప్తి చెందుతాను. నేను లేని సమయంలో హంతకులు వారు మా ఇంటికి వచ్చి, నా డ్రాయింగ్ రూమ్‌లోకి ప్రవేశించి, నా సోఫాలో కూర్చుని, నా భర్త హత్యకు ప్లాన్ చేశారు. ఢాకాలో చదువుతున్న పిల్లల దగ్గరకు నేను వెళ్లడంతో ఇంట్లో ప్రొఫెసర్ ఒక్కరే ఉన్నారు...అప్పుడే కిడ్నాప్ చేశారన్నారు తాహెర్ భార్య సుల్తానా.
ఇంతకీ ఈ కేసులో దోషులు ఎవరంటే: తాహెర్ ప్రొఫెసర్‌గా పనిచేసే యూనివర్శిటీ వాళ్లే. ఆయనతో కలిసి పనిచేసిన ప్రొఫెసర్లే. మొహియుద్దీన్ అనే ప్రొఫెసర్... యూనివర్సిటీకి పదోన్నతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ దరఖాస్తును పరిశీలించిన పోలీసులకు ఆ కమిటీలో తాహెర్ కూడా ఉన్నట్టు క్లారిటీ వచ్చింది. పైగా తాహెర్... మొహియుద్దీన్ మోసాలను ప్యానెల్ ముందు బయటపెట్టాడని తేలింది. అందుకే మొహియుద్దీన్ పక్కా ప్లాన్ చేసి స్నేహితుల సహాయంతో ప్రొఫెసర్ తాహెర్ ను హత్యచేసి మృతదేహాన్ని మ్యాన్ హోల్లో పడేశాడు. ఏళ్ల తరబడి సాగిన కేసులో పోరాడి విజయం సాధించింది కుమార్తె షెగుప్తా. లాయర్ పట్టా పుచ్చుకున్నాక తండ్రి కేసే తొలికేసు. ఆమె పట్టుదలకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండగలమా...
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా
Texas Gun Fire: కాల్పులతో దద్దరిల్లిన టెక్సాస్, ప్రైమరీ స్కూల్లోకి చొరబడి విచ్చలవిడి కాల్పులు - 18 పిల్లలు, టీచర్లు మృతి
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం- త్రుటిలో తప్పిన ప్రమాదం!
Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి మూడు నెలలు- పుతిన్ సాధించిందేంటి?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్‌లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
May 26 Records in Cricket: మే 26తో భారత క్రికెట్‌కు ప్రత్యేక కనెక్షన్ - రెండు మర్చిపోలేని రికార్డులు - ద్రవిడ్‌కు కూడా!