అన్వేషించండి

NASA Dart Mission: జేమ్స్ వెబ్, హబుల్ టెలిస్కోప్ మల్టీస్టారర్ మూవీ ఇది !

ఆస్టరాయిడ్ కక్ష్యను మార్చటమే లక్ష్యంగా జరిగిన ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అయ్యిందో తెలియాలంటే స్పేస్ టెలిస్కోపుల ఫలితాలు బయటకు రావాలి.

అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా ఓ పరిశీలన
ఒకే టార్గెట్ పై పనిచేస్తున్న జేమ్స్ వెబ్, హబుల్
డైమోర్ఫోస్ ఆస్ట్రరాయిడ్ పై దృష్టి పెట్టిన టెలిస్కోపులు
డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఢీకొన్న తర్వాతి ఫలితాలపై దృష్టి

కొన్ని రోజుల కిందట సానా డార్ట్ ప్రయోగం చేసి విజయం సాధించింది. డైమోర్ఫస్ అనే ఆస్ట్రరాయిడ్ ను డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ బలంగా ఢీకొట్టింది. ఆస్టరాయిడ్ కక్ష్యను మార్చటమే లక్ష్యంగా జరిగిన ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అయ్యిందో తెలియాలంటే స్పేస్ టెలిస్కోపుల ఫలితాలు బయటకు రావాలి. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర అంశాన్ని నాసా బయటపెట్టింది. అదేంటంటే డైమోర్ఫస్ ను డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ ను ఢీకొట్టే సమయంలో  అతిపెద్ద స్పేస్ టెలిస్కోపులైన నాసా జేమ్స్ వెబ్, హబుల్ స్పేస్ టెలిస్కోప్ లు ఆ దృశ్యాలను క్యాప్చర్ చేశాయి.  

జేమ్స్ వెబ్ - హబుల్ - ఓ మల్టీ స్టారర్ :
జేమ్స్ వెబ్ ప్రయోగించకముందు వరకూ హబుల్ టెలిస్కోపే మానవ చరిత్రలో ప్రయోగించిన అతిపెద్ద టెలిస్కోపు. విజిబుల్ లైట్ మీద పని చేసే ఈ టెలిస్కోపు ఇప్పటివరకూ విశ్వంలో సుదూర ప్రాంతాల్లోని ఎన్నో వేల గెలాక్సీలను, నక్షత్రాలను ఫొటోలు తీసింది. ఇప్పుడు జేమ్స్ వెబ్ ప్రయోగించిన తర్వాత హబుల్ ను మించిన దూరం, వేగంతో అంతరిక్షంలో జరిగే మార్పులను ఫోటోలు, వీడియోలు తీయగలుతున్నాం. ఇప్పుడు ఈ రెండు అతి పెద్ద స్పేస్ టెలిస్కోపులు కలిసి మొన్న జరిగిన డార్ట్ ప్రయోగాన్ని రికార్డ్ చేయటం అంటే అంతరిక్ష సినిమాలో మల్టీస్టారర్ చేయటం లాంటిదే.

NASA Dart Mission: జేమ్స్ వెబ్, హబుల్ టెలిస్కోప్ మల్టీస్టారర్ మూవీ ఇది !

Credits : Nasa Webb/Hubble/Twitter  

7 మిలియన్ కిలోమీటర్ల టార్గెట్ :
డైమోర్ఫోస్ ఆస్ట్రాయిడ్  భూమి నుంచి 70 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ జరిగిన డార్ట్ ప్రయోగాన్ని ఢీకొనే వరకూ స్పేస్ క్రాఫ్ట్ కి అమర్చిన డ్రాకో కెమెరా లైవ్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది. ఆస్ట్రరాయిడ్ కక్ష్యలో మార్పులు జరిగాయా. అసలు ఇంపాక్ట్ తీవ్రత ఎంత ఉంది. ఇవన్నీ తెలియాలంటే స్పేస్ టెలిస్కోపులు తప్పనిసరి. అందుకే ఏడు మిలియన్ మైళ్ల దూరంలో జరుగుతున్న ఈ మార్పులను గమనించే పనిని జేమ్స్ వెబ్, హబుల్ స్పేస్ టెలిస్కోపులకు అప్పగించింది నాసా. జేమ్స్ వెబ్ ఇన్ ఫ్రారెడ్ లైట్ లో, హబుల్ విజిబుల్ లైట్ లో అక్కడ ఇంపాక్ట్ తర్వాత ఏర్పడిన మార్పులను అధ్యయనం చేస్తున్నాయి. ఇంపాక్ట్ తీవ్రతను రికార్డు చేశాయి. ఈ ఫోటోల్లో కనిపిస్తున్నది అదే. నీలిరంగులో కనిపిస్తున్నది హబుల్ తీసిన ఇమేజెస్ అయితే...రెడ్ కలర్ లో కనిపిస్తున్నది జేమ్స్ వెబ్ తీసిన ఇన్ ఫ్రా రెడ్ ఇమేజెస్.

NASA Dart Mission: జేమ్స్ వెబ్, హబుల్ టెలిస్కోప్ మల్టీస్టారర్ మూవీ ఇది !

పరిశీలనల ఫలితమేంటీ..?
జేమ్స్ వెబ్ ఇంపాక్ట్ ఏర్పడుతున్న టైం లో ఐదుగంటల్లో పది ఫోటోలను తీసింది.  హబుల్ మొత్తం 45 ఫోటోలను తీసింది. వీటి ద్వారా డైమోర్ఫోస్ ఆస్ట్రరాయిడ్ ఉపరితలం స్వభావం ఏంటో తెలుసుకోవచ్చు. స్పేస్ క్రాఫ్ట్ ఆస్ట్రరాయిడ్ ను ఢీకొట్టినప్పుడు ఎంత మెటిరీయల్ దాని వాతావరణంలోకి ఎగిరింది..ఎంత బలంగా ఢీకొట్టింది లాంటి వివరాలు తెలియనున్నాయి. ఢీకొట్టిన కారణంగా దాని వాతావరణంలోకి ఎగసిన ధూళి మేఘాలను అధ్యయనం చేయటం ద్వారా పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగిందో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు.

వీటిన్నంటినీ కలపటం ద్వారా ఆస్ట్రరాయిడ్ కక్ష్యలో వచ్చిన మార్పులను తెలుసుకోవచ్చు. ఫలితంగా భవిష్యత్తులో భూమి దిశగా దూసుకువచ్చే గ్రహశకలాలు, ఇతర ప్రమాదాల నుంచి కాపాడుకునేలా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటంలో ఇప్పుడు జేమ్స్ వెబ్, హబుల్ స్పేస్ టెలిస్కోప్ లు చేస్తున్న పరిశోధనలు దోహదం చేస్తాయి.


NASA Dart Mission: జేమ్స్ వెబ్, హబుల్ టెలిస్కోప్ మల్టీస్టారర్ మూవీ ఇది !

టాప్ హెడ్ లైన్స్

Lower Back Pain : ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
Gaganayan Mission: గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
Beaver Supermoon : బీవర్ సూపర్‌మూన్ అంటే ఏమిటి? పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించే చంద్రుడి ప్రత్యేకతలు ఇవే.. సాయంత్రం చూసేయండి
బీవర్ సూపర్‌మూన్ అంటే ఏమిటి? పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించే చంద్రుడి ప్రత్యేకతలు ఇవే.. సాయంత్రం చూసేయండి
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget