Weather Update: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిరసన సెగ- సౌకర్యాలు, ముంపుపై కడెం వాసుల ఆగ్రహం
Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.
LIVE

Background
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిరసన సెగ- సౌకర్యాలు, ముంపుపై కడెం వాసుల ఆగ్రహం
భారీగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఈ ప్రాజెక్టుకు 18 గేట్లు ఉన్నప్పటికీ నాలుగు గేట్లు పని చేయడం లేదు. దీంతో 14 గేట్లు మాత్రమే ఎత్తి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో గేట్ల పైభాగం నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు కడెం వాసులను ఖాళీ చేయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు.
వారిని పరామర్శిచేందుకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై కడెం వాసులు ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ఏడాది వచ్చిన వరదలకే కడెం ప్రాజెక్టు గేట్లు పాడైనట్టు చెబుతున్నారు. ఏడాది కాలంగా గేట్లు మరమ్మతులు చేయించలేదు ఎందుకని ప్రశ్నించారు. మంత్రిని ఘొరావ్ చేసిన స్థానికులు తమ సమస్యపై నిలదీశారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే రేఖానాయక్‌ను కూడా ప్రశ్నించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో కూడా వసతులు సరిగా లేవని కడెం వాసులు మండిపడ్డారు. భోజనం కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి ఉంటే తాము ఇలా వరదల్లో చిక్కుకోవాల్సిన దుస్థితి వచ్చేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీట మునిగిన మొరంచపల్లి - బిల్డింగ్స్‌పై తలదాచుకుంటున్న ప్రజలు
భూపాలపల్లి జిల్లాలో మొరంచవాగు ఉద్ధృతి తీవ్రంగా ఉంది. దీంతో మొరంచపల్లి నీట మునిగింది. వాగు ఆరు ఫీట్ల ఎత్తులో ప్రవహిస్తుండటంతో ఊరిలోకి నీరు చేరింది. దీంతో ప్రజలకు ఎత్తైన బిల్డింగ్‌లు ఎక్కి తలదాచుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

