(Source: ECI/ABP News/ABP Majha)
Pervez Musharraf Profile: ముషారఫ్ పాక్ నుంచి ఎందుకు పారిపోయారు? భుట్టోను హత్య చేయించారా?
Pervez Musharraf Profile: పర్వేజ్ ముషారఫ్ పతనం ఎలా మొదలైంది?
Pervez Musharraf Profile:
పవర్‌ఫుల్ లీడర్‌గా..
పర్వేజ్ ముషారఫ్ ఢిల్లీలో 1943 ఆగస్టు 11న జన్మించారు. 1947లో పాకిస్థాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడ్డాక ముషారఫ్ కుటుంబం కరాచీకి వలస వెళ్లిపోయింది. ఆయన తండ్రి సయ్యద్ ముషారఫుద్దీన్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసే వారు. అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ముషారఫ్ సివిల్ సర్వీస్ వైపు మళ్లారు. భారత్, పాక్ విడిపోయే నాటికి ఆయన వయసు నాలుగేళ్లు. ఆయన తండ్రి అప్పటికే పాకిస్థాన్ సివిల్ సర్వస్‌లో చేరి పాక్ ప్రభుత్వంతో కలిసి పని చేశారు. విదేశాంగ శాఖలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. మొదటి నుంచి మిలిటరీలో చేరాలని కలలుకన్న ముషారఫ్ 1961లో 18 ఏళ్ల వయసులో కకూల్‌లోని పాకిస్థాన్ మిలిటరీ అకాడమీలో చేరారు. 1964లో బ్యాచ్‌లర్స్ డిగ్రీ పొందారు. భారత్, పారిస్థాన్ సరిహద్దు వద్ద పోస్టింగ్ ఇచ్చారు.
ఖేమక్రాన్ సెక్టార్ కోసం రెండో కశ్మీరీ యుద్ధం జరగ్గా... ఆ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు ముషారఫ్. ఈ యుద్ధం ముగిశాక 1965 స్పెషల్ సర్వీస్ గ్రూప్‌లో చేరారు. ఆ తరవాత ఆర్మీ కేప్టెన్‌గా, మేజర్‌గానూ పని చేశారు. 1971లో భారత్‌తో జరిగిన యుద్ధంలో SSG కమాండర్‌గా వ్యవహరించారు. 1999లో కార్గిల్ వార్‌ను ముందుండి నడపించారు. కార్గిల్ యుద్ధం ముగిశాకే..పాకిస్థాన్‌లో నాటకీయ పరిణామాలు జరిగాయి. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దె దిగేలా చేశారు ముషారఫ్. తనను ఆర్మీ చీఫ్‌గా ప్రమోట్ చేసిన నవాజ్ షరీఫ్‌ను అరెస్ట్ చేయించారు. ఆ తరవాత 2002లో అధ్యక్షుడు రఫిక్ తరార్ చేత బలవంతంగా రిజైన్ చేయించారు ముషారఫ్. అప్పటి నుంచి 2008 వరకూ పాక్ దేశాధ్యక్షుడిగా ఉన్నారు.
వివాదాల్లో చిక్కుకున్న ముషారఫ్..
పవర్‌ఫుల్ లీడర్‌గా, సోల్జర్‌గా పేరు తెచ్చుకున్న ముషారఫ్ పలు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. 2013లో ఆయనపై దాదాపు నాలుగు నేరాలు నమోదయ్యాయి. పాకిస్థాన్ రాజ్యాంగాన్ని సస్పెండ్ చేయడం, స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ, సీనియర్ లీడర్లను,జడ్జ్‌లను కారణం లేకుండా తొలగించడం లాంటి చర్యలతో విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు. ఆయనపై హత్యా ఆరోపణలూ వచ్చాయి. బలూచిస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అక్బర్ బుగాటీ హత్యలో ముషారఫ్ హస్తం ఉందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అంతే కాదు. పాక్ మాజీ ప్రధాని బెనజీర్ బుట్టో హత్యలోనూ ముషారఫ్ కుట్ర ఉందని అభియోగాలూ వచ్చాయి. ఈ విషయంలోనే కొందరు జడ్డ్‌లను కావాలనే అరెస్ట్ చేయించారు. దీనిపై సమాధానం చెప్పాలంటూ కోర్టు ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు ముషారఫ్.
2013లో బెనజీర్ బుట్టో హత్య కేసులో ఆయనను హౌజ్ అరెస్ట్ చేయాలంటూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తరవాత బెయిల్ ఇచ్చింది. ఆ తరవాత దేశం విడిచి వెళ్లిపోయారు. యాంటీ టెర్రరిజం కోర్ట్ ముషారఫ్ ను "అబ్‌స్కాండెడ్"గా ప్రకటించింది. స్పెషల్ కోర్ట్ మరణ శిక్ష విధించింది. కానీ...ముషారఫ్ పరారయ్యారు. దుబాయ్‌లో చాన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు.
Also Read: Pakistan Blocked Wikipedia: వికీపీడియాను బ్యాన్ చేసిన పాకిస్థాన్, ఆ కంటెంట్ తొలగించాలని వార్నింగ్